SNP
IPL 2024, Uncapped Players, Abhishek Sharma; ఐపీఎల్ 2024లో అదరగొట్టిన భారత యువ క్రికెటర్ల లిస్ట్‌ను ఒకసారి పరిశీలిస్తే.. అందులో ప్రపంచ క్రికెట్‌ను ఏలే ఫ్యూచర్ స్టార్లు కనిపిస్తున్నారు. అలాంటి లిస్ట్ ఒక సారి చూద్దాం..
IPL 2024, Uncapped Players, Abhishek Sharma; ఐపీఎల్ 2024లో అదరగొట్టిన భారత యువ క్రికెటర్ల లిస్ట్‌ను ఒకసారి పరిశీలిస్తే.. అందులో ప్రపంచ క్రికెట్‌ను ఏలే ఫ్యూచర్ స్టార్లు కనిపిస్తున్నారు. అలాంటి లిస్ట్ ఒక సారి చూద్దాం..
SNP
క్రికెట్ అభిమానులకు అంతులేని వినోదాన్ని పంచిన ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిపోయింది. అన్ని టీమ్స్ హోరాహోరీగా తలపడి.. అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఫైనల్‌గా అన్ని టీమ్స్‌ను దాటుకుని కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ సీజన్‌లో స్టార్ క్రికెటర్లు కొంతమంది అద్భుతంగా ఆడితే మరికొంత మంది తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. కానీ, కొంతమంది భారత అన్‌క్యాప్డ్ కుర్రాళ్లు.. టీమిండియా తరఫున ఒకటీ రెండు మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు.. ఈ సీజన్‌లో దుమ్మురేపారు. భవిష్యత్తులో వాళ్లే టీమిండియాను ముందుండి నడిపించే ప్లేయర్లుగా ఎదగనున్నారు. సచిన్, కోహ్లీలా.. ప్రపంచ క్రికెట్‌ను ఏలే స్టార్లు.. వీరి నుంచి ఉద్భవించనున్నారు. మరి ఈ యువ క్రికెటర్లు ఎవరు? ఈ సీజన్‌లో ఏం సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం..
రియాన్ పరాగ్ (22 ఏళ్లు)
ఓవర్ య్యాటిట్యూడ్ స్టార్‌గా గతంలో ట్రోలింగ్‌కు గురైన రియాన్ పరాగ్ ఈ సీజన్‌లో మాత్రం అదరగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌కు మిడిల్డార్‌లో, లోయర్ ఆర్డర్‌లో నమ్మదగిన బ్యాటర్‌గా ఎదిగాడు. ఈ సీజన్‌లో చాలా మంచి మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 52.09 యావరేజ్, 149.22 స్ట్రైక్‌రేట్‌తో 573 పరుగులు చేశాడు. గత ఐదు సీజన్స్‌లో చేసిన పరుగులు.. ఈ ఒక్క సీజన్‌లోనే చేశాడు పరాగ్. ఇతను భవిష్యత్తులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్సు ఉంది.
రఘువంశీ (18 ఏళ్లు)
ఈ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కత్తా నైట్ రైడర్స్‌లో మెరిసిన ఒక అద్భుతం ఈ అంగ్రీష్ రఘువంశీ. ఫీయర్‌లెస్ బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన రఘువంశీ ఈ సీజన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడాడు. 23.29 యావరేజ్, 155.24 స్ట్రైక్‌రేట్‌తో 163 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. పరుగులు తక్కువగానే చేసినా.. అతని ఇంటెంట్ ఇంప్రెసివ్‌గా ఉంది.
అభిషేక్ పొరెల్ (21 ఏళ్లు)
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతూ.. ఈ సీజన్‌లో అదరగొట్టిన అన్‌క్యాప్డ్ ప్లేయర్లలో అభిషేక్ పొరెల్ ఒకడు. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన పొరెల్ 32.70 యావరేజ్, 159.51 స్ట్రైక్‌రేట్‌తో 327 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడినా అంతగా ఆకట్టుకోలేకపోయాడు పొరెల్. కానీ, ఈ సీజన్‌లో అతని ఆట చూస్తే.. త్వరలోనే టీమిండియా జెర్సీ వేసుకునేలా కనిపిస్తున్నాడు.
సాయి సుదర్శన్ (22 ఏళ్లు)
టీమిండియా తరఫున ఓ మూడు వన్డేలు ఆడిన సాయి సుదర్శన్‌ను చాలా మంది టీ20 క్రికెట్‌కు పనికిరాడేమో అని అనుకున్నారు. కానీ, ఈ సీజన్‌లో అతని ఆట చూసి అంతా నోరెళ్లబెట్టారు. ఈ సీజన్‌లో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడిన సాయి.. 47.91 యావరేజ్, 141.29 స్ట్రైక్‌రేట్‌తో 527 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదే ప్రదర్శన కనుక డొమెస్టిక్ క్రికెట్‌లోనూ కొనసాగిస్తే.. సాయి సుదర్శన్ కూడా టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. తర్వాత ప్రపంచాన్ని ఏలే ఆటగాడు అయినా ఆశ్చర్యం లేదు.
అశుతోష్ శర్మ (25 ఏళ్లు)
ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తమ స్థాయి ప్రదర్శన చేయకపోయినా.. ఆ జట్టులోని ఓ ఇద్దరు ఆటగాళ్లు అందరి దృష్టిని ఆకర్షించారు. అందులో ఒకడు శశాంక్ సింగ్ అయితే మరొకరు అశుతోష్ శర్మ. శశాంక్ ఏజ్ ఎక్కువ కావడంతో.. మనం అశుతోష్ గురించి మాట్లాడుకుంటే.. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన అశుతోష్ 27 యావరేజ్, 167.26 స్ట్రైక్‌రేట్‌తో 189 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. శశాంక్‌తో కలిసి పంజాబ్‌కు రెండు మూడు విక్టరీలు అందించాడు. ఇతనికి కూడా మంచి భవిష్యత్తు ఉంది.
అభిషేక్ శర్మ (23 ఏళ్లు)
ఫైనల్ వరకు దూసుకెళ్లి.. తుది పోరులో చతికిల పడి రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన అభిషేక్ శర్మ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫెయిర్ లెస్ బ్యాటింగ్‌తో బౌలర్లను ఊతికి ఆరేసిన అభిషేక్, ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి 32.27 యావరేజ్, 204.22 స్ట్రైక్‌రేట్‌తో 484 పరుగులు చేశాడు. అందులో మూడో హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పైగా అభిషేక్‌కు ట్రైనింగ్ ఇస్తోంది టీమిండియా దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్. దీంతో.. అభిషేక్ చాలా తొందర్లోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నితీష్ కుమార్ రెడ్డి (21 ఏళ్లు)
ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. నితీష్ కుమార్ రెడ్డి. ఈ తెలుగు కుర్రాడు.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ 2024 అవార్డును అందుకున్నాడు. ఇదొక్కటి చాలా నితీష్ ఏ రేంజ్‌లో సత్తా చాటాడో చెప్పడానికి. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన నితీష్ రెడ్డి 33.67 యావరేజ్, 142.92 స్ట్రైక్‌రేట్‌తో 303 పరుగులు చేశాడు. అందులో రెండు కీలకమైన హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే బౌలింగ్‌లోనూ 3 వికెట్లు పడగొట్టాడు. బ్యాటర్‌గా, బౌలర్‌గా, అద్భుతమైన ఫీల్డర్‌గా అసలు సిసలైన ఆల్‌రౌండర్‌గా ఉన్న నితీష్ కుమార్ రెడ్డికి టీమిండియాలో తలుపు తెరుచుకోవడానికి పెద్దగా టైమ్ పట్టేలా లేదు. ఇదే టెంపర్‌మెంట్‌ను టీమిండియాలోనూ చూపిస్తే.. దేశం గర్వించే క్రికెటర్ అవుతాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ లిస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pat Cummins Comments on Abhishek Sharma latest Instagram Post! pic.twitter.com/ir1SM5Iv7S
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) May 27, 2024
Nitish Kumar Reddy, the 20 year old boy from Andhra Pradesh putting on a show for SRH. 💥pic.twitter.com/JEQcIfbRKJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 9, 2024
Emerging Player of the Season 2024 , Nitish Kumar Reddy 🔥 pic.twitter.com/l6R2i1gUJz
— 🎰 (@StanMSD) May 26, 2024