Hardik Pandya: వీడియో: సొంత నగరానికి హార్దిక్.. విక్టరీ పరేడ్​కు తగ్గని రేంజ్​లో గ్రాండ్ వెల్​కమ్!

Team India: టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు నయా హీరోగా అవతరించాడు. వరల్డ్ కప్​కు ముందు వరకు అతడిపై ఉన్న నెగెటివిటీ అంతా ఇప్పుడు పాజిటివ్​గా మారిపోయింది.

Team India: టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు నయా హీరోగా అవతరించాడు. వరల్డ్ కప్​కు ముందు వరకు అతడిపై ఉన్న నెగెటివిటీ అంతా ఇప్పుడు పాజిటివ్​గా మారిపోయింది.

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు నయా హీరోగా అవతరించాడు. వరల్డ్ కప్​కు ముందు వరకు అతడిపై ఉన్న నెగెటివిటీ అంతా ఇప్పుడు పాజిటివ్​గా మారిపోయింది. ఐపీఎల్-2024 సమయంలో అతడు ఎన్నో విమర్శలకు, ట్రోలింగ్​కు గురయ్యాడు. గుజరాత్ టైటాన్స్​ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు మారడంతో జీటీ ఫ్యాన్స్ అతడ్ని అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. ముంబై యాజమాన్యం రోహిత్ శర్మను తీసేసి హార్దిక్​ను కెప్టెన్ చేయడంతో ఇటు ఎంఐ అభిమానులు కూడా అతడిపై కోపం పెంచుకున్నారు. హార్దిక్ గ్రౌండ్​లో అడుగుపెడితే చాలు.. బూ అంటూ అవహేళన చేశారు. సారథిగా, బ్యాటర్​గా, బౌలర్​గా అట్టర్ ఫ్లాప్ అవడంతో పాండ్యాపై ట్రోలింగ్ మరింత పెరిగింది. పొట్టి ప్రపంచ కప్​లో అతడ్ని ఆడించొద్దనే డిమాండ్లు వినిపించాయి.

ఎవరెన్ని విమర్శలు చేసినా నవ్వుతూ లైట్ తీసుకున్నాడు హార్దిక్. కూల్​గా తన పని తాను చేసుకుపోయాడు. ఐపీఎల్ తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్​లో అదరగొట్టాడు. బ్యాటర్​గా, బౌలర్​గా సూపర్బ్​గా పెర్ఫార్మ్ చేశాడు. ఫైనల్ మ్యాచ్​లో క్లాసెన్, మిల్లర్​ను ఔట్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అప్పటివరకు ఉన్న నెగెటివిటీ పోయి పాండ్యా హీరో అయిపోయాడు. ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చిన భారత జట్టు వాంఖడే మైదానానికి వెళ్లినప్పుడు ఒకప్పుడు హార్దిక్​ను తిట్టిన వాళ్లే ఆ రోజు చప్పట్లతో అతడ్ని ప్రశంసిచారు. రియల్ హీరో అంటూ అతడ్ని మెచ్చుకున్నారు. అలాంటోడికి సొంత నగరమైన వడోదరలోనూ అంతే స్థాయిలో అపూర్వ స్వాగతం లభించింది.

వరల్డ్ కప్ తర్వాత ఫస్ట్ టైమ్ వడోదరకు తిరిగొచ్చిన హార్దిక్​కు అక్కడి ప్రజలు గ్రాండ్​ వెల్​కమ్ చెప్పారు. పాండ్యా కోసం వేలాది మంది తరలివచ్చారు. దీంతో వడోదర రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఓపెన్ బస్​ ఎక్కి జాతీయ జెండా ఊపుతూ అభిమానులకు అభివాదం చేశాడు పాండ్యా. తనను చూసేందుకు వచ్చిన వారికి థ్యాంక్స్ చెప్పాడు. టీమిండియా జెర్సీ వేసుకున్న పాండ్యా చప్పట్లు కొడుతూ అందరిలో జోష్ నింపాడు. ఆ టైమ్​లో చుట్టూ ఉన్న అభిమానుల్లో చాలా మంది భారత జెర్సీలు వేసుకొని జాతీయ పతాకాలతో సందడి చేశారు. హార్దిక్.. హార్దిక్ అని అరుస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక, ఎప్పుడో సొంత సిటీకి రావాల్సిన పాండ్యా.. ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్​లో బిజీ అయిపోయాడు. అవి ముగిసిన తర్వాత వడోదరకు పయనమయ్యాడు.

Show comments