చరిత్ర లిఖించిన యంగ్‌ గ్రాండ్‌మాస్టర్‌! చెస్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు ప్రజ్ఞానంద

భారత యంగ్‌ గ్రాండ్‌మాస్టర్‌ రమేశ్‌ బాబు ప్రజ్ఞానంద కొత్త చరిత్ర లిఖించాడు. చెస్‌ వరల్డ్‌ కప్‌లో ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీస్‌లో టైబ్రేకర్‌తో వరల్డ్‌ నంబర్‌ 3 ఫాబియానో కరౌనాను 3.5-2.5 పాయింట్ల తేడాతో ఓడించాడు. దీంతో మంగళవారం మొదలయ్యే చెస్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌ వన్‌ చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను మన ప్రజ్ఞానంద పోటీపడనున్నాడు. కాగా, అమెరికన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ అయిన ఫాబియానో కరౌనాతో ప్రజ్ఞానంద ఆడిన తొలి రెండు సెమీఫైనల్‌ గేమ్స్‌ డ్రాగా ముగిశాయి. దీంతో వీళ్ల మధ్య పోటీ టైబ్రేకర్‌కు వెళ్లింది.

సోమవారం జరిగిన టైబ్రేకర్‌లో మొదటి రెండు ర్యాపిడ్‌ గేమ్‌లలో కూడా ఫలితం రాలేదు. కానీ, మూడో ఆటలో ప్రజ్ఞానంద అద్భుతంగా పావులు కదిపాడు. అతని ఎత్తులకు అమెరికన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ కరౌనా చిత్తయ్యాడు. నాలుగో గేమ్‌లో కరౌనా కాస్త దూకుడు చూపించానా 82 ఎత్తుల తర్వాత డ్రాకు అంగీకరించకతప్పలేదు. దీంతో టైబ్రేకర్‌లో ప్రజ్ఞానంద విజయం సాధించి.. సగర్వంగా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీస్‌ కంటే ముందు క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఇండియాకు చెందిన అర్జున్‌తో పోటీపడిన ప్రజ్ఞానంద 8 గేమ్‌లు ఆడాడు. ఆ 8 గేమ్స్‌లో కూడా ఫలితం తేలకపోవడంతో మ్యాచ్‌ సడన్‌ డెత్‌కు వెళ్లింది. అందులో గెలవడంతో ప్రజ్ఞానంద సెమీస్‌ చేరాడు. సెమీస్‌లో ప్రపంచ నంబర్‌ 3 ఆటగాడిని ఓడించిన మన యంగ్‌ గ్రాండ్‌మాస్టర్‌.. ఫైనల్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ కార్ల్‌సన్‌కు కూడా గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎందుకంటే.. ఈ టోర్నీలోనే ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్‌ 2 చెస్‌ ప్లేయర్‌ అయిన హికారు నకమురాను ఓడించిన విషయం తెలిసిందే. అదే కాన్ఫిడెన్స్‌తో కార్ల్‌సన్‌కు గట్టి పోటీ ఇవ్వడం వీలైతే ఓడించడంపైనే ప్రజ్ఞానంద ఫోకస్‌ పెట్టాడు. కార్ల్‌సన్‌ను ఓడిస్తే.. చెస్‌ వరల్డ్‌ కప్‌ గెలిచిన యంగెస్ట్‌ ఇడియన్‌ గ్రాండ్‌ మాస్టర్‌గా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టిస్తాడు. గతంలో ఒకసారి ప్రజ్ఞానంద.. కార్ల్‌సన్‌ను ఓడించిన విషయం తెలిసిందే. ఇప్పటికే క్యాండిడెట్స్‌ చెస్‌కు అర్హత సాధించిన ప్రజ్ఞానంద.. బాబీ ఫిషర్‌, కార్ల్‌సన్‌ వంటి దిగ్గజాల తర్వాత అతి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన గ్రాండ్‌ మాస్టర్‌గా నిలిచాడు. మరి ప్రజ్ఞానంద చెస్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌! ఆసియా కప్‌, వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు!

Show comments