పెద్ద త్యాగం చేయడంతోనే గంభీర్‌కు టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి?

పెద్ద త్యాగం చేయడంతోనే గంభీర్‌కు టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి?

Gautam Gambhir, Head Coach: టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ పేరు మాత్రమే వినిపిస్తుండటంతో.. అతని ఎంపిక వెనుక అసలు కారణం ఇదే అంటూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Gautam Gambhir, Head Coach: టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ పేరు మాత్రమే వినిపిస్తుండటంతో.. అతని ఎంపిక వెనుక అసలు కారణం ఇదే అంటూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియాకు కొత్త హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ పేరు ఖరారు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైలోని బీసీసీఐ హెడ్‌క్వార్టర్స్‌లో ఇంటర్వ్యూకు కూడా గంభీర్‌ సిద్ధమైనట్లు సమాచారం. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ వారసుడిగా గంభీర్‌ బాధ్యతలు చేపట్టనున్నాడంటూ లీకులు అందుతున్నాయి. అయితే.. టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి అంటే ఎంతో మంది హేమాహేమీలు ఎగిరి గంతులేస్తూ మరి వచ్చి బాధ్యతలు చేపడతారు. కానీ, టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవికి కేవలం ఒకే ఒక్క దరఖాస్తు వచ్చిందంటూ బీసీసీఐ ప్రకటించడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే.. గంభీర్‌కే టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి ఇవ్వడానికి అసలు కారణం వేరే ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. గతంలో బీజేపీ ఎంపీగా ఉన్న గౌతమ్‌ గంభీర్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. 2019లో ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందిన గంభీర్‌.. 2024 ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. ఈస్ట్ ఢిల్లీ నుంచి ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు గంభీర్.. కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు.

గంభీర్‌ను బీజేపీ అధిష్టానం కావాలనే పోటీ నుంచి తప్పించిందనే ప్రచారం కూడా అప్పట్లో సాగింది. హర్షా మల్హోత్రా కోసం గంభీర్‌ను బీజేపీ అధిష్టానం పక్కనపెట్టిందని, అది గంభీర్‌కు నచ్చలేదని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటూ, లక్నో నుంచి కూడా బయటికి వచ్చి కేకేఆర్‌ మెంటర్‌గా చేరాడనే వార్తలు వచ్చాయి. గంభీర్‌ స్థానంలో ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్న మల్హోత్రాకు టికెట్ ఇచ్చి గెలిపించిన బీజేపీ అధిష్టానం కేంద్ర సహాయమంత్రి పదవి కూడా ఇచ్చింది. ఢిల్లీలో అధికారం కోసం ఈ మార్పులు చేసింది. అయితే.. తమ సూచన మేరకు ఇష్టలేకపోయినా పోటీ నుంచి తప్పుకున్న గంభీర్‌కు టీమిండియా హెడ్ కోచ్ పదవి ఆఫర్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments