Gautam Gambhi: వన్డేలు బోరింగ్.. అవి వేస్ట్! గంభీర్ షాకింగ్ కామెంట్స్!

  • Author Soma Sekhar Published - 09:54 AM, Fri - 1 December 23

టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం వన్డే క్రికెట్ ప్రమాదంలో పడిందని చెప్పుకొచ్చాడు. వన్డే క్రికెట్ చచ్చిపోకుండా ఉండాలంటే ఇలా చేయాలని కొన్ని ఇంట్రెస్టింగ్ సలహాలు ఇచ్చాడు.

టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం వన్డే క్రికెట్ ప్రమాదంలో పడిందని చెప్పుకొచ్చాడు. వన్డే క్రికెట్ చచ్చిపోకుండా ఉండాలంటే ఇలా చేయాలని కొన్ని ఇంట్రెస్టింగ్ సలహాలు ఇచ్చాడు.

  • Author Soma Sekhar Published - 09:54 AM, Fri - 1 December 23

టెస్టు క్రికెట్.. సంప్రదాయబద్ధ క్రికెట్ గా పేరుగాంచిన ఈ ఫార్మాట్ ఇప్పటికే ప్రమాదంలో పడింది. ప్రేక్షకులు ఈ మ్యాచ్ లను చూడ్డానికి గ్రౌండ్స్ కు రావడంమే మానేశారు. ఇక టీవీల్లో ఈ మ్యాచ్ లను చూసే వారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఈ క్రమంలోనే తాజాగా వన్డే ఫార్మాట్ కూడా ప్రమాదంలో పడబోతోంది అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి అంటున్నారు క్రీడా పండితులు. వీరి వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తూ.. టీమిండియా మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం వన్డే క్రికెట్ ప్రమాదంలో పడిందని చెప్పుకొచ్చాడు గంభీర్. ఇలాంటి టైమ్ లో ఏం చేయాలనే చర్చ మెుదలైంది. వన్డే క్రికెట్ చచ్చిపోకుండా ఉండాలంటే ఇలా చేయాలని కొన్ని ఇంట్రెస్టింగ్ సలహాలు ఇచ్చాడు.

వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో ఐసీసీ పెద్దలు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ప్రపంచ కప్ లో మాత్రమే వన్డేలు ఆడించాలని అభిప్రాయపడ్డారు. దీంతో వన్డే ఫార్మాట్ ప్రమాదంలో పడబోతోంది అన్న విషయం అందరికి అర్ధమైంది. ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్, ద్వైపాక్షిక సిరీస్ ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్. వన్డే క్రికెట్ బోరింగ్ గా మారిందని ఇక దైపాక్షిక సిరీస్ లు వేస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. వీటికి పునర్వైభవం తీసుకురావడానికి కొన్ని సలహాలు కూడా ఇచ్చాడు.

ఈ అంశంపై ఓ ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ..”వన్డే క్రికెట్ బోరింగ్ గా తయ్యారు అయ్యింది. అలాగే ద్వైపాక్షిక సిరీస్ ఇప్పుడు వేస్ట్. వాటిని ఇంట్రెస్టింగ్ గా మార్చాలంటే ఈ విధంగా చేయాలి. వన్డేల్లో తొలి 10 ఓవర్లలో తొమ్మిది మంది ఆటగాళ్లు సర్కిల్ లోపలే ఉండాలి. నెక్ట్స్ 20 ఓవర్ల వరకు సర్కిల్ లోపల 5 ఫీల్డర్లు ఉండాలి. ఇక 31 నుంచి 40 ఓవర్ల మధ్యలో నలుగురు ప్లేయర్లను లోపల ఉంచాలి. చివరి పది ఓవర్లలో కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే సర్కిల్ లోపల ఉంచాలి” అంటూ తనదైన సూచనలు చేశాడు.

వీటితో పాటుగా రెండు కొత్త బంతులతో మ్యాచ్ ను మెుదలుపెట్టి.. తొలి 20 ఓవర్లలోనే వాటిని ఉపయోగించుకోవాలని గంభీర్ సూచించాడు. ఆ రెండు బంతుల్లో ఒక బాల్ ను మిగతా 30 ఓవర్లు ఉపయోగించుకునే అవకాశం కెప్టెన్ కు ఇవ్వాలని ఈ టీమిండియా స్టార్ పేర్కొన్నాడు. అలాగే ద్వైపాక్షిక సిరీస్ లపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సిరీస్ లు వేస్ట్ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ట్రై సిరీస్ లు, నాలుగు జట్ల మధ్య జరిగే సిరీస్ లు ఫ్యాన్స్ కు మంచి మజాను ఇస్తాయని తెలిపాడు. మరి వన్డే ఫార్మాట్ గురించి గంభీర్ చేసిన వ్యాఖ్యల, సూచనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments