Gautam Gambhir: రోహిత్‌ శర్మ, కోహ్లీ ఎప్పటి వరకు టీమ్‌లో ఉంటారో చెప్పేసిన గంభీర్‌!

Gautam Gambhir, Virat Kohli, Rohit Sharma: టీమిండియా కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఎప్పటి వరకు టీమ్‌లో ఉంటారో క్లారిటీ ఇచ్చేశాడు. అది కూడా ఒక కండీషన్‌పై.. మరి గంభీర్‌ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

Gautam Gambhir, Virat Kohli, Rohit Sharma: టీమిండియా కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఎప్పటి వరకు టీమ్‌లో ఉంటారో క్లారిటీ ఇచ్చేశాడు. అది కూడా ఒక కండీషన్‌పై.. మరి గంభీర్‌ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. మిగిలిన రెండు ఫార్మాట్స్‌.. టెస్టు, వన్డేల్లో ఎంత కాలం కొనసాగుతారనే విషయంపై కూడా క్రికెట్‌ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. పైగా కొత్త కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ యంగ్‌ క్రికెటర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, అలాగే ఆటగాళ్ల స్టార్‌డమ్‌, వ్యక్తిగత రికార్డులను అస్సలు పట్టించుకోడు.. అలాంటి వ్యక్తి టీమిండియా హెడ్‌ కోచ్‌గా వస్తుండటంతో ఇక రోహిత్‌, కోహ్లీ ఎక్కువకాలం టీమిండియాలో ఉండరని క్రికెట్‌ అభిమానులు ఫిక్స్‌ అయిపోయారు.

అంతా భయపడుతున్నట్లే.. హెడ్‌ కోచ్‌గా అపాయింట్‌ అయిన తర్వాత గౌతమ్‌ గంభీర్‌, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో కలిసి ప్రెస్‌ కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్నాడు. హెడ్‌ కోచ్‌గా తన తొలి ప్రెస్‌మీట్‌లోనే గంభీర్.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఎంత కాలం టీమిండియాలో ఉంటారో చెప్పేశాడు. రోహిత్‌, కోహ్లీ వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్లు అని, ఏ టీమ్‌ అయినా వారిద్దరిని ఆడించాలనే కోరుకుంటుందని.. టీమిండియాకు కూడా వాళ్లిద్దరు ఎంతో కీలక ఆటగాళ్లంటూ గంభీర్‌ పేర్కొన్నాడు. అలాగే రానున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో వాళ్లిద్దరూ ఆడతారంటూ స్పష్టం చేశాడు.

ఇక క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అంశంపై కూడా గంభీర్‌ స్పందించాడు. 2027 వన్డే వరల్డ్‌ కప్‌ వరకు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఆడతారా? అనే విషయంపై స్పందిస్తూ.. అప్పటి వరకు వాళ్లిద్దరూ ఫిట్‌గా ఉంటే ఆడతారంటూ స్పష్టం చేశాడు. రోహిత్‌, కోహ్లీ ఇంకా చాలా క్రికెట్‌ ఆడనున్నారంటూ గంభీర్‌ తెలిపాడు. మరి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పినట్లే చెప్పిన గంభీర్‌.. ఫిట్‌నెస్‌ ఉంటేనే 2027 వరకు ఆడతారంటూ గంభీర్‌ మెలిక పెట్టాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments