SNP
Gautam Gambhir, Head Coach: టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్‌కు రానున్న కాలం కష్ట కాలంలా ఉంది. కానీ, అది సక్సెస్ ఫుల్‌గా దాటితే అతన్ని మించి కోచ్ భారత క్రికెట్ చరిత్రలో ఉండడు. మరి ఆ సవాళ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Gautam Gambhir, Head Coach: టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్‌కు రానున్న కాలం కష్ట కాలంలా ఉంది. కానీ, అది సక్సెస్ ఫుల్‌గా దాటితే అతన్ని మించి కోచ్ భారత క్రికెట్ చరిత్రలో ఉండడు. మరి ఆ సవాళ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
భారత జట్టు కొత్త హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను నియమిస్తూ.. మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2024తో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో.. కొత్త కోచ్‌గా గంభీర్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. అతన్నే హెడ్ కోచ్‌గా నియమిస్తారనే విషయం చాలా కాలంగా క్రికెట్ వర్గాల్లో సర్క్యూలేట్ అవుతూనే ఉంది.. మంగళవారం బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. హెడ్ కోచ్‌గా రాహుల్ ట్రాక్ రికార్డ్ గొప్పగానే ఉందని చెప్పాలి. అతని కోచింగ్‌లో టీ20 వరల్డ్ కప్ 2022లో సెమీ ఫైనల్స్, 2023లో డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఆడింది టీమిండియా. అలాగే తాజాగా టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచింది. వరల్డ్ కప్ విజయంతో ద్రవిడ్ తన కోచ్ పదవికీ వీడ్కోలు పలికాడు.
దీంతో.. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్‌పై మరింత ఎక్కువ బాధ్యత పడనుంది. ప్రస్తుతం టీమిండియా విన్నింగ్ ట్రాక్ రికార్డును కొనసాగిస్తూ.. దీని కంటే టీమ్‌ను మరింత బెటర్ చేస్తూ వరల్డ్ కప్పులు గెలవాలి. అయితే.. కొత్త కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ ముందు పెద్ద పెద్ద సవాళ్లే ఉన్నాయి. కోచ్‌గా.. రానున్న కాలం గంభీర్‌కు చాలా కష్టకాలమే. కానీ, ఒక వేళ సక్సెస్ అయితే మాత్రం.. భారత క్రికెట్ చరిత్రలోనే గ్రేటెస్ట్ హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ చరిత్రలో నిలిచిపోతాడు. ఇంతకీ గంభీర్ ముందున్న ఆ సవాళ్లు ఏంటో.. అతన్ని ఎలా నంబర్ వన్ కోచ్‌గా నిలబెడతాడో ఇప్పుడు చూద్దాం..
గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి.. ఫీల్డ్‌లోకి దిగిన తర్వాత.. ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా. వచ్చే ఏడాది అంటే 2025లో పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ, అలాగే జూన్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2026లో టీ20 వరల్డ్ కప్, 2026లో న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, 2027లో మళ్లీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, అదే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఇలా గంభీర్ మూడేళ్ల పదవీ కాలంలో ఎదురు కానున్న పెద్ద సవాళ్లు. వీటితో పాటు చిన్నాచితకా సిరీస్‌లు కూడా చాలా ఉన్నాయి. అయితే.. ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో టీమిండియా విజయం సాధిస్తే.. కోచ్‌గా గంభీర్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. మరి ఈ సవాళ్లను దాటి.. ఎంత మేర సక్సెస్ అవుతాడని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gautam Gambhir has a very tough schedule in his coaching career:
– 5 Tests in Australia in 2024
– Champions Trophy in 2025
– WTC final in 2025
– 5 Tests in England in 2025
– T20I World Cup in 2026
– 2 Tests in New Zealand in 2026
– WTC final in 2027
– ODI World Cup in 2027 pic.twitter.com/VP4powztdE— Johns. (@CricCrazyJohns) July 10, 2024