Gautam Gambhir: అఫీషియల్: టీమిండియా హెడ్ కోచ్​గా గంభీర్.. కన్ఫర్మ్ చేసిన జైషా!

టీమిండియా హెడ్ కోచ్​గా ఎవరు వస్తారనేది చాన్నాళ్లుగా వార్తల్లో నలుగుతున్న అంశం. ఎట్టకేలకు దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది.

టీమిండియా హెడ్ కోచ్​గా ఎవరు వస్తారనేది చాన్నాళ్లుగా వార్తల్లో నలుగుతున్న అంశం. ఎట్టకేలకు దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది.

టీమిండియా హెడ్ కోచ్​గా ఎవరు వస్తారనేది చాన్నాళ్లుగా వార్తల్లో నలుగుతున్న అంశం. టీ20 వరల్డ్ కప్​ మొదలైనప్పటి నుంచి ఇదే డిస్కషన్ నడుస్తోంది. అందుకు కారణం రాహుల్ ద్రవిడ్ ఆ పోస్ట్​ నుంచి తప్పుకోవడమే. మెగాటోర్నీ ఫైనల్​తో కోచ్ పదవికి గుడ్​బై చెప్పేశాడతను. అందుకే ప్రపంచ కప్ మొదలవక ముందు నుంచే ద్రవిడ్​కు వారసుడ్ని వెతికే పనిలో పడింది భారత క్రికెట్ బోర్డు. కోచ్​ రేసులో చాలా పేర్లు వినిపించాయి. పలువురు దేశీ దిగ్గజాలతో పాటు ఫారెన్ లెజెండ్స్ పేర్లు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఈ మధ్యే బీసీసీఐ హెడ్ కోచ్ పోస్ట్​ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూతో గౌతం గంభీర్ నెక్స్ట్ కోచ్​ అనేది దాదాపుగా ఖాయమైంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

కోచ్​ పోస్ట్​పై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. భారత నయా హెడ్ కోచ్​గా గంభీర్​ను నియమిస్తున్నట్లు బీసీసీఐ సెక్రెటరీ జైషా ప్రకటించారు. గంభీర్​కు స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉందన్నాడు. వేగంగా మారుతున్న మోడ్రన్ క్రికెట్​ను గౌతీ దగ్గర నుంచి చూశాడని తెలిపాడు. సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో విభాగాల్లో రాణించాడని.. ఇండియన్ క్రికెట్​ను ముందుకు తీసుకెళ్లేందుకు విశేషంగా కృషి చేశాడంటూ గంభీర్​ను ప్రశంసల్లో మంచెత్తాడు జైషా. ఆయనపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నాడు. ఈ కొత్త ప్రయాణంలో గంభీర్​కు భారత క్రికెట్ బోర్డు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేశాడు జైషా. మరి.. కొత్త కోచ్​గా గంభీర్​ రాకపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments