Rohit Sharma: టీమిండియాలో ఎంత మంది గొప్ప ప్లేయర్లు ఉన్నా.. రోహితే బెస్ట్: రాహుల్ ద్రవిడ్

టీమిండియాలో ఉన్న స్టార్ క్రికెటర్ల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. జట్టులో ఎంత మంది గొప్ప ప్లేయర్లు ఉన్నాగానీ.. కెప్టెన్ రోహిత్ శర్మ బెస్ట్ అంటూ ప్రశంసలు కురిపించాడు.

టీమిండియాలో ఉన్న స్టార్ క్రికెటర్ల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. జట్టులో ఎంత మంది గొప్ప ప్లేయర్లు ఉన్నాగానీ.. కెప్టెన్ రోహిత్ శర్మ బెస్ట్ అంటూ ప్రశంసలు కురిపించాడు.

టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వాత అదే ఊపులో జింబాబ్వే, శ్రీలంకపై టీ20 సిరీస్ లను కైవసం చేసుకుంది. కానీ అదే జోరును శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో మాత్రం చూపించలేక చతికిల పడింది. మూడు వన్డేల సిరీస్ ను 2-0తో చేజార్చుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా టీమిండియాలో ఉన్న స్టార్ క్రికెటర్ల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. జట్టులో ఎంత మంది గొప్ప ప్లేయర్లు ఉన్నాగానీ.. కెప్టెన్ రోహిత్ శర్మ బెస్ట్ అంటూ ప్రశంసలు కురిపించాడు. మరి ద్రవిడ్ అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియాలో ఉన్న సీనియర్ క్రికెటర్ల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. టీమ్ ను సమష్టిగా ఉంచడంలో వారు కీలక పాత్ర పోషించేవారని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు ద్రవిడ్. “రోహిత్ శర్మకు అందరిని కలుపుకొనిపోయే తత్వం ఎక్కువ. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ప్రశాంతగా ఉండటానికి మెయిన్ రీజన్ అతడే. అయితే రోహిత్, కోహ్లీ, బుమ్రాతో పాటుగా మరికొంత మంది ప్లేయర్లు నిరాడంబరంగా ఉంటారు. రోహిత్ తో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. ఇక టీ20 వరల్డ్ కప్ గెలవడంలో నాతో పాటుగా సీనియర్లు ఎంతో కష్టపడ్డారు. ఈ విజయం అందరి కృషి. రోహిత్ అద్భుతమైన నాయకుడు, అతడిని నేను రెండున్నరేళ్లుగా చాలా దగ్గర నుంచి గమనించాను. ప్లేయర్లు అందరూ అతడిని ఎంతో గౌరవిస్తారు, వారి ప్రేమను అతడు కొల్లగొట్టాడు. అందుకే  జట్టులో ఎంతో మంది సీనియర్లు ఉన్నా.. రోహితే బెస్ట్” అంటూ ప్రశంసలు కురిపించాడు రాహుల్ ద్రవిడ్.

ఇక సీనియర్లు అయిన బుమ్రా, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లతో పాటుగా మిగతా ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్ ను ప్రశాంతగా ఉంచేందుకు తోడ్పడతారు అని ద్రవిడ్ పేర్కొన్నాడు. కాగా.. టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత హెడ్ కోచ్ గా ద్రవిడ్, కెప్టెన్ గా రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టి భారత్ కు అద్భుత విజయాలు అందించారు. వీరిద్దరి కాలంలోనే టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021-2023 ఫైనల్, వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ లతో పాటుగా మరికొన్ని మేజర్ టోర్నీల్లో రాణించింది. మరి టీమిండియాలో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా.. రోహిత్ శర్మే బెస్ట్ అన్న ద్రవిడ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments