టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో సెమీస్‌ చేరే టీమ్స్‌ ఇవే! దిగ్గజ క్రికెటర్ల ప్రిడిక్షన్‌!

Semi Final, T20 World Cup 2024, Brian Lara: రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో సెమీ ఫైనల్‌ చేరే జట్లు ఇవే అంటూ దిగ్గజ క్రికెటర్లు తమ తమ అంచనాలను వెల్లడించారు. మరి వారి అంచనాలను ఒకసారి చూద్దాం..

Semi Final, T20 World Cup 2024, Brian Lara: రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో సెమీ ఫైనల్‌ చేరే జట్లు ఇవే అంటూ దిగ్గజ క్రికెటర్లు తమ తమ అంచనాలను వెల్లడించారు. మరి వారి అంచనాలను ఒకసారి చూద్దాం..

ధనాధన్‌ క్రికెట్‌ ఐపీఎల్‌ ముగిసిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి టీ20 వరల్డ్‌ కప్‌ 2024పై పడింది. జూన్‌ 2 నుంచి ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్‌ 2024 ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో జూన్‌ 5న ఆడనుంది. ఈ మ్యాచ్‌లో వరల్డ్‌ కప్‌ వేటను మొదలుపెట్టనుంది రోహిత్‌ సేన. జూన్‌ 9న యావత్‌ ప్రపంచం ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే న్యూయార్క్‌లోని నసావు క్రికెట్‌ స్టేడియం సిద్ధమైంది. అంతా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియా-పాక్ మ్యాచ్‌ అంటే ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాతో పాటు అన్ని టీమ్స్‌ కూడా వరల్డ్‌ కప్‌ను గెలవాలనే కసితోనే బరిలోకి దిగుతున్నాయి. అయితే.. మెగా టోర్నీలో సెమీ ఫైనల్‌ చేరే నాలుగు టీమ్స్‌ ఇవే అంటూ.. దిగ్గజ క్రికెటర్లు తమ అంచనాలు వెల్లడిస్తున్నారు. మరి వారి లెక్క ప్రకారం సెమీస్‌ చేనే నాలుగు టీమ్స్‌ ఏమో ఇప్పుడు చూద్దాం..

వెస్టిండీస్‌ దిగ్గజ మాజీ క్రికెటర్‌ బ్రియాన్ లారా.. భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, అఫ్గనిస్థాన్ సెమీస్‌కు చేరుతాయని అభిప్రాయపడ్డాడు. అలాగే భారత దిగ్గజ మాజీ క్రికెటర్‌ సునీల్ గవాస్కర్.. భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా సెమీస్‌కు వెళ్తాయని ప్రెడిక్ట్‌ చేశాడు. అయితే.. లారా అఫ్గనిస్థాన్‌ను ఈ లిస్ట్‌లో చేర్చడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే.. ఆఫ్ఘాన్‌కు ఏ మాత్రం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదని అంటున్నారు క్రికెట్‌ అభిమానులు. టీ20 క్రికెట్‌లో ఆ జట్టు సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. రషీద్‌ ఖాన్‌, నబీ, గుర్బాజ్‌, ఒర్జాయ్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, నూర్‌ అహ్మద్‌, ముజిబ్‌ ఇలా చాలా మంది టీ20 స్టార్లు ఆ టీమ్‌లో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లతో పాటు మరి కొంత మంది మాజీ క్రికెటర్లు కూడా సెమీస్‌ వేరే నాలుగు జట్లను అంచనా వేశారు.

వారిలో ఇంగ్లండ్‌కు చెందిన పాల్‌ కాలింగ్‌ వుడ్.. భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా. న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ మోరిస్.. భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా. ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ఆరోన్ ఫించ్.. భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా. టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్ కైఫ్.. భారత్, ఇంగ్లండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా. ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ టామ్ మూడీ.. భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా. టీమిండియా మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్.. భారత్, ఇంగ్లండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా. టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు.. భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు సెమీ ఫైనల్‌కు వెళ్తాయని అంచనా వేశారు. ఈ మాజీలు పేర్కొన్న నాలుగేసి టీమ్స్‌లో ఇండియా మాత్రం కమాన్‌గా ఉంది. సో.. టీమిండియా సెమీ ఫైనల్‌ చేరడం పక్కా అని క్రికెట్‌ అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరి ఈ అంచనాలపై మీ అభిప్రాయాలను అలాగే.. మీ అంచనాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments