తొలి టార్గెట్‌ను పూర్తి చేసిన కొత్త కెప్టెన్‌ సూర్య, కొత్త కోచ్‌ గంభీర్‌! కానీ, ఒక సమస్య?

తొలి టార్గెట్‌ను పూర్తి చేసిన కొత్త కెప్టెన్‌ సూర్య, కొత్త కోచ్‌ గంభీర్‌! కానీ, ఒక సమస్య?

Suryakumar Yadav, Gautam Gambhir, IND vs SL: కొత్త కోచ్‌ గంభీర్‌, కొత్త కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తమ ఫస్ట్‌ టార్గెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడు. కానీ, టీమ్‌లో కొన్నిలోపాలు అలాగే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Suryakumar Yadav, Gautam Gambhir, IND vs SL: కొత్త కోచ్‌ గంభీర్‌, కొత్త కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తమ ఫస్ట్‌ టార్గెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడు. కానీ, టీమ్‌లో కొన్నిలోపాలు అలాగే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ తమ తొలి టార్గెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌తో టీ20లకు పూర్తి స్థాయి కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ అపాయింట్‌ అయిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత.. రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో రోహిత్‌ వారసుడిగా సూర్యకు టీ20 కెప్టెన్సీ, అదే టీ20 వరల్డ్‌ కప్‌తో హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో కొత్త హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచి.. ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు కెప్టెన్‌గా, హెడ్‌ కోచ్‌గా వచ్చిన వీరిద్దరిపై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్య-గంభీర్‌ జోడీ.. తమ కొత్త ప్రయాణం శ్రీలంక సిరీస్‌తోనే మొదలుపెట్టారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా.. ఇప్పటికే తొలి రెండు టీ20లు గెలిచి.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్లు లేకపోయినా.. శ్రీలంకపై సూర్య సేన పూర్తి డామినేషన్‌ చూపించింది. దీంతో.. సూర్య-గంభీర్‌ జోడీకి తొలి సిరీస్‌తోనే మంచి మార్కులే పడ్డాయి. అయినా కూడా జట్టులో టిక్‌ చేయాల్సిన బాక్సులు ఇంకా ఉన్నాయని క్రికెట్‌ నిపుణులు భావిస్తున్నారు. అవేంటో గంభీర్‌-సూర్యకు కూడా బాగా తెలుసు అంటున్నారు.

శ్రీలంకపై సిరీస్‌ విజయం గంభీర్‌-సూర్య టార్గెట్‌ కాదు.. వాళ్ల టార్గెట్‌ 2026లో జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌. అందుకోసం ఇప్పటి నుంచే వాళ్లు కోర్‌ టీమ్‌ను రెడీ చేసుకోవాలి. కానీ, ప్రస్తుతం శ్రీలంకతో ఆడిన టీమ్‌లో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. శుబ్‌మన్‌ గిల్‌ మెడనొప్పితో రెండో టీ20కు దూరం అయితే.. వారి వద్ద బెస్ట్‌ ఓపెనింగ్‌ ఆల్ట్రనేట్‌ లేదు. సంజు శాంసన్‌ను ఆడిస్తే అతను గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. అలాగే బౌలింగ్‌ విభాగంలో మెయిన్‌ బౌలర్లు భారీగా పరుగులు ఇస్తుంటే.. రియాన్‌ పరాగ్‌ లాంటి పార్ట్‌టైమ్‌ బౌలర్‌పై ఆధారపడాల్సి వస్తోంది. ఒక ఛాంపియన్‌ టీమ్‌లో మెయిన్‌ బౌలర్లు అంతా విఫలం కావడం పెద్ద సమస్య. ఏదో ఒక బౌలర్‌ లయ తప్పితే పర్వాలేదు కానీ, సిరాజ్‌, అర్షదీప్‌ కనీసం పూర్తి కోటాను పూర్తి చేయలేకపోయారు. ఇలా గంభీర్‌-సూర్య ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. రెండో టీ20 తర్వాత గంభీర్‌-సూర్య చాలా సేపు గ్రౌండ్‌లో చర్చలు జరిపారు. బహుషా ఈ విషయాల గురించే అయి ఉంటుందని క్రికెట్‌ పండితులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments