SNP
SNP
క్రికెట్‌లో బ్యాటర్ల మధ్య మిస్ కమ్యూనికేషన్ జరిగి.. ఫన్నీ రనౌట్లు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని సార్లు ఆ రనౌట్లు ఫన్నీగా ఉన్నా.. మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. తాజాగా వెస్టిండీస్‌లో జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్-బార్బోడోస్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అలాంటి ఓ ఫన్నీ రనౌట్ జరిగింది. ఆ రనౌట్‌తో పొలార్డ్-పూరన్‌ల మధ్య కొంతసేపు గొడవ కూడా జరిగింది. అయితే.. ఆ రనౌట్‌తో వికెట్ కోల్పోయిన టీమ్ కంటే.. రనౌట్ చేసిన జట్టుకే ఎక్కువ నష్టం జరిగింది. ఫుల్ స్టోరీ ఏంటంటే..?
బార్బోడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 9.3 ఓవర్ల ఆట జరిగే సమయానికి నైట్ రైడర్స్ 2 వికెట్లో కోల్పోయి 78 పరుగులు చేసింది. పొలార్డ్ 2 రన్స్‌తో, పూరన్ 27 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రాయల్స్ బాహుబలి ప్లేయర్ రహ్కీమ్ కార్న్‌వాల్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ 4వ బంతిని పొలార్డ్ షార్ట్ ఫైన్ లెగ్ వైపు ఆడి.. రన్ కోసం కాల్ ఇచ్చాడు. నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న పూరన్ వేగంతో పరుగు పూర్తి చేశాడు. షార్ట్ ఫైన్ లెగ్‌లో బంతి అందుకున్న మేయర్స్ వేగంగా బంతిని అందుకున్నాడు.
దీంతో పొలార్డ్ పరుగు ఆపేసి తిరిగి స్ట్రైకింగ్ ఎండ్ క్రీజ్‌లోకి వచ్చేశాడు. అప్పటికే పూరన్ సైతం అదే ఎండ్‌కు చేరుకున్నాడు. బంతి అందుకున్న మేయర్స్.. బౌలర్ కార్న్‌వాల్‌కు అందించాడు. అతను వికెట్లను గిరాటేశాడు. దీంతో నైట్‌రైడర్స్ మూడో వికెట్ కోల్పోయింది. కానీ, ఎవరు అవుట్ అయ్యారో అంపైర్ ప్రకటించలేదు. పొలార్డ్-పూరన్ మాత్రం తప్పు నీదంటే నీదని క్రీజ్‌లో వాదించుకున్నారు. చివరకు పొలార్డ్ కెప్టెన్ కావడంతో పూరన్ రెస్పెక్ట్ ఇచ్చి.. తాను పెవిలియన్‌కు నడిచాడు.
కానీ, అంపైర్లు రిప్లేను పరిశీలించి.. పొలార్డ్‌ను అవుట్‌గా ప్రకటించారు. పొలార్డ్ కంటే పూరన్ ముందుగా క్రీజ్‌లోకి చేరుకోవడంతో పొలార్డ్‌ను అవుట్‌గా ప్రకటించారు. దీంతో పొలార్డ్ వెనుదిరగాల్సి వచ్చింది. అయితే.. అంపైర్లు తీసుకున్న నిర్ణయం నైట్ రైడర్స్ కంటే బార్బోడోస్ రాయల్స్‌కే ఎక్కువ నష్టం చేసింది. అంపైర్లు రిప్లే చూడటంతో రనౌట్ కాకుండా బతికిపోయిన పూరన్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. 53 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సులతో 102 పరుగులు చేసి.. నైట్ రైడర్స్‌కు భారీ స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్‌లో నైట్ రైడర్స్ 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరి ఈ రనౌట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Wait a minute, what just happened??? A run out at the Queens Park Oval but who is out Kieron Pollard or Nicholas Pooran? #CPL23 #TKRvBR #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/uq52I5cfrb
— CPL T20 (@CPL) September 7, 2023
ఇదీ చదవండి: లబుషేన్ తల్లీ నమ్మకం ముందు విధి ఓడిపోయింది!