Fact Check: గిల్ తో సారా ఫొటో వైరల్.. అసలు నిజం ఇది!

శుభ్ మన్ గిల్- సారా టెండుల్కర్ ప్రేమలో ఉన్నారని.. గిల్ ప్రేమకు సారా అంగీకారం తెలిపిందంటూ ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫొటో వెనుక దాగున్న అసలు నిజాలు ఇవి.

శుభ్ మన్ గిల్- సారా టెండుల్కర్ ప్రేమలో ఉన్నారని.. గిల్ ప్రేమకు సారా అంగీకారం తెలిపిందంటూ ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫొటో వెనుక దాగున్న అసలు నిజాలు ఇవి.

క్రికెట్ ప్రేక్షకుల్లో ఇప్పుడ శుభ్ మన్ గిల్ అంటే విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ప్రతి మ్యాచ్ లో తనని తాను నిరూపించుకుంటూ కెరీర్ లో దూసుకెళ్తున్నాడు. శుభ్ మన్ గిల్ పేరు రాగానే.. అందరి మైండ్ లోకి వెంటనే సారా టెండుల్కర్ అనే పేరు కూడా వచ్చేస్తుంది. క్రికెట్ గాడ్ సచన్ టెండుల్కర్ గారాల పట్టి సారా.. శుభ్ మన్ డేటింగ్ చేస్తున్నారంటూ, ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా శుభ్ మన్ గిల్ తో ఉన్న సారా టెండుల్కర్ పిక్ ఒకటి నెట్టింట దర్శనం ఇస్తోంది. పైగా గిల్ ప్రేమకు సారా ఓకే చెప్పింది అంటూ ఓ పోస్టు కూడా పెట్టారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. అది మార్ఫింగ్ ఫొటో అని క్లియర్ గా చెప్పచ్చు.

సారా టెండుల్కర్- శుభ్ మన్ గిల్ ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. పైగా టీమిండియా మ్యాచులకు సారా టెండుల్కర్ హాజరు కావడం, గిల్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు కెమెరాలు సారాపైనే ఉండటం, ప్రేక్షకులు సారా బాబీ అంటూ కేకలు వేసినప్పుడు కోహ్లీలాంటి వాళ్లు కూడా ఇంకా అరవండి అంటూ ఎంకరేజ్ చేయడం, మరీ ముఖ్యంగా.. ఇరు కుటుంబాలు ఈ వార్తలను ఖండించకపోవడంతో వారి మధ్య ప్రేమ ఉందేమో అనే వార్తలకు బలం చేకూరింది. గతంలో సారా అలీఖాన్, సారా టెండుల్కర్ ఇద్దరిలో ఎవరు శుభ్ మన్ గర్ల్ ఫ్రెండ్ అనే అనుమానాలు కూడా ఉండేవి. కానీ, తాజాగా సారా అలీ ఖాన్ ఓ క్లారిటీ ఇచ్చేసింది. “సారాకి సారా దునియా గలత్ సారాకే పీచే పడ్ గయే” అంటూ ఆ సారా తాను కాదు అంటూ కుండ బద్దలు కొట్టేసింది.

ఇప్పుడు వారి మధ్య ప్రేమ ఉందేమో అనే వార్తలు మరింత పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సారా టెండుల్కర్- శుభ్ మన్ గిల్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫొటోలు సారా టెండుల్కర్ శుభ్ మన్ గిల్ మీద చేయివేసి ఉన్నట్లుగా ఉంది. ఈ ఫొటో పెట్టి గిల్ ప్రేమకు సారా అంగీకారం తెలిపింది అంటూ పోస్టు కూడా పెట్టారు. అయితే ఇది పక్కా మార్ఫింగ్ ఫొటో. సారా టెండుల్కర్ తన సోదరుడు అర్జున్ టెండుల్కర్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. ఆ పోస్టులో ఉన్న ఒక ఫొటోని తీసుకుని ఇప్పుడు ఇలా గిల్ ఫొటోతో మార్ఫ్ చేసి ప్రచారం చేస్తున్నారు. అయితే తమ్ముడు ఉన్న ఫొటోని గిల్ తో మార్ఫిగ్ చేసి పైశాచికానందం పొందడం మాత్రమే కాకుండా.. ప్రేమకు ఓకే చెప్పింది అంటూ ప్రచారం చేయడం కూడా మరీ దారుణంగా చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా కూడా మారింది.

ఇది మార్ఫింగ్ ఫొటో అని చాలామందికి తెలియడం లేదు. ఎక్కువ మంది ఇది నిజమైన ఫొటో అంటూ భావిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ మార్ఫింగ్ ఫొటోల రచ్చ నడుస్తూనే ఉంది. ఇటీవలే రష్మీకా మందన్నాకి సంబంధించిన ఒక ఫేక్ వీడియో ప్రచారం జరగడం చూశాం. డీప్ ఫేక్ అనే ఒక ఏఐ టెక్నాలజీతో జారా పటేల్ అనే ఇన్ ఫ్లుఎన్సర్ విడియోకి రష్మికా ముఖాన్ని జతచేసి ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. ఈ వీడియోపై ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఆ వీడియోలో ఉన్న బ్రిటిష్ ఇండియన్ జారా పటేల్ కూడా తాను కూడా ఈ ఘటనలో బాధితురాలినే అంటూ పోస్ట్ చేసింది. తర్వాత కత్రినా కైఫ్ ఫొటో కూడా మార్ఫింగ్ జరిగింది. ఇప్పుడు ఆ జాబితాలోకి గిల్, సారా టెండుల్కర్ చేరారు. కొందరు సోషల్ మీడియాలో వచ్చే లైకులు, షేర్లు, ఫాలోవర్స్ కోసం ఇలాంటి కొన్ని తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటి పనుల వల్ల అవతలి వారికి ఎలాంటి నష్టం జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. మరి.. ఈ మార్ఫింగ్ ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments