వీడియో: మ్యాచ్‌ తర్వాత గ్రౌండ్‌లోనే గంభీర్‌-సూర్య మధ్య..! గమనించారా?

Suryakumar Yadav, Gautam Gambhir, IND vs SL: శ్రీలంకపై రెండో విజయంతో టీమిండియా సిరీస్‌ కైవసం చేసుకుంది. అయితే.. రెండో మ్యాచ్‌ విజయం తర్వాత.. గ్రౌండ్‌లోనే సూర్య-గంభీర్‌ మధ్య ఓ ఆసక్తికర సంఘటన జరిగింది అదేంటో ఇప్పుడు చూద్దాం..

Suryakumar Yadav, Gautam Gambhir, IND vs SL: శ్రీలంకపై రెండో విజయంతో టీమిండియా సిరీస్‌ కైవసం చేసుకుంది. అయితే.. రెండో మ్యాచ్‌ విజయం తర్వాత.. గ్రౌండ్‌లోనే సూర్య-గంభీర్‌ మధ్య ఓ ఆసక్తికర సంఘటన జరిగింది అదేంటో ఇప్పుడు చూద్దాం..

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది సూర్య సేన. కొత్త కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌, కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ సారథ్యంలో యంగ్‌ టీమిండియా బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది. తొలి మ్యాచ్‌లో ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన అదరగొట్టిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో ఛేజింగ్‌లో టార్గెట్‌ను ఊదిపారేసింది. ఆదివారం పల్లెకలె స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించినా.. టీమిండియా విజయాన్ని అడ్డుకోలేకపోయింది. అయితే.. మ్యాచ్‌ తర్వాత ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సులువైన విజయం సాధించిన తర్వాత.. టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్ మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. మ్యాచ్‌తో పాటు సిరీస్‌ కైవసం చేసుకున్న తర్వాత.. సెలబ్రేషన్స్‌ను పక్కనపెట్టేసి.. కోచ్‌, కెప్టెన్‌ ఒక విషయంపై తీవ్రంగా చర్చించారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2026 టార్గెట్‌గా బరిలోకి దిగిన కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, టీ20 కెప్టెన్‌ సూర్యకు తన ప్లాన్స్‌ గురించి వివరించినట్లు తెలుస్తోంది. సిరీస్‌కి ముందు ఇద్దరి మధ్య అంత టైమ్‌ దొరకలేదు.. ఇప్పుడు సిరీస్‌ గెలిచి కాస్త రిలాక్స్‌ అవ్వడంతో.. తొలి రెండు టీ20ల్లో చేసిన తప్పులేంటి? మెరుగుపడాల్సిన విషయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే మూడో టీ20ల్లో టీమిండియా ప్రయోగాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. స్టార్‌ ఆటగాళ్లకు రెస్ట్‌ ఇచ్చి.. ఇప్పటి వరకు బెంచ్‌కే పరిమితం అయిన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని కూడా కెప్టెన్‌ సూర్యతో గంభీర్‌ చర్చించినట్లు సమాచారం. తొలి మ్యాచ్‌ ఆడలేకపోయిన సంజు శాంసన్‌కు రెండో మ్యాచ్‌లో అవకాశం ఇస్తే.. గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. అయినా అతనికి మూడో మ్యాచ్‌లో మరో ఛాన్స్‌ ఇవ్వాలని భావిస్తున్నారు. సీనియర్‌ ప్లేయర్‌ హార్ధిక్‌ పాండ్యాకు రెస్ట్‌ ఇచ్చి.. బెంచ్‌లో ఉన్న ప్లేయర్లను ఆడించే అవకాశం ఉంది. అలాగే సిరాజ్‌ స్థానంలో ఖలీల్‌ అహ్మద్‌ బరిలోకి దిగొచ్చు. ఇలా కొన్ని మార్పులతో మూడో మ్యాచ్‌ ఆడాలని కోచ్‌, కెప్టెన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కెప్టెన్‌ సూర్య, కోచ్‌ గంభీర్‌ మధ్య జరిగిన చర్చలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments