న్యూజిలాండ్‌ vs ఆఫ్ఘనిస్థాన్‌ మ్యాచ్‌ జరగకుంటే ఇండియాపై విమర్శలు ఎందుకు?

Afghanistan, New Zealand, Greater Noida, BCCI: ఆఫ్ఘనిస్థాన్‌-న్యూజిలాండ్‌ మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ గత నాలుగు రోజులుగా రద్దు అవుతూ వస్తోంది.. దాంతో ఇండియాపై, బీసీసీఐపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ రెండు దేశాల మధ్య మ్యాచ్‌ రద్దు అయితే.. భారత్‌పై విమర్శలు ఎందుకొస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..

Afghanistan, New Zealand, Greater Noida, BCCI: ఆఫ్ఘనిస్థాన్‌-న్యూజిలాండ్‌ మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ గత నాలుగు రోజులుగా రద్దు అవుతూ వస్తోంది.. దాంతో ఇండియాపై, బీసీసీఐపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ రెండు దేశాల మధ్య మ్యాచ్‌ రద్దు అయితే.. భారత్‌పై విమర్శలు ఎందుకొస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..

ఇండియాలో క్రికెట్‌ను ఓ మతంలా భావిస్తారు. క్రికెటర్లను డెమీ గాడ్‌లా ఆరాధిస్తారు. అలాంటి ఇండియాపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లేకాదు.. కొంతమంది భారత క్రికెట్‌ అభిమానులు సైతం.. బీసీసీఐ తీరుపై మండిపడుతున్నారు. అది ఎందుకో తెలుసా? ఆఫ్ఘనిస్థాన్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగాల్సిన ఒకే ఒక టెస్ట్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా జరగకపోవడమే. వర్షం వచ్చి.. ఆ రెండు దేశాల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కాకపోతే.. ఇండియాపై ఎందుకు విమర్శలు వస్తున్నాయని అనుకోవచ్చు. మ్యాచ్‌ జరగాల్సింది ఇండియాలోనే.. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ఈ మ్యాచ్‌కు ఇండియా ఆతిథ్యం ఇచ్చింది.

అలా అయినా కూడా.. వర్షం వస్తే ఏ క్రికెట్‌ మ్యాచ్‌ అయినా జరగదు.. అందులో పెద్ద విషయం ఏముంది అని అనుకోవచ్చు. కానీ, వర్షం వచ్చి, ఆగిపోయినా కూడా గ్రౌండ్‌ మ్యాచ్‌ కోసం సిద్ధంగా లేదు. గ్రౌండ్‌ తడిగా ఉండటం వల్లే ఏకంగా 4 రోజుల ఆట రద్దు అయింది. ఇండియాలాంటి దేశంలో.. రెండు అంతర్జాతీయ జట్లు మ్యాచ్‌ ఆడుతుంటే.. ఇలాంటి చెత్త గ్రౌండ్‌ను కేటాయించడంపై బీసీసీఐతో పాటు ఇండియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గ్రౌండ్‌లో తడిని తీసేందుకు ఏకంగా.. గ్రౌండ్‌పై ఉండే గడ్డిని తీసేసి.. కొత్త గడ్డి ఏర్పాటు చేస్తూ.. ఫ్యాన్లతో గ్రౌండ్‌ను రెడీ చేస్తున్నారు గ్రౌండ్‌ స్టాఫ్‌. ఈ పాట్లకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు, 50కి పైగా క్రికెట్‌ స్టేడియాలు ఉన్న ఇండియాలో.. ఆఫ్ఘానిస్థాన్‌, న్యూజిలాండ్‌ ఓ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడేందుకు ఏ మంచి స్టేడియమే దొరకలేదా అని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. వర్షంతో మ్యాచ్‌ ఆగిపోతే.. అది వేరే విషయం. కానీ, వర్షం ఆగిపోయినా గ్రౌండ్‌ను రెడీ చేసి ఇవ్వలేకపోతున్న బీసీసీఐని క్రికెట్‌ అభిమానులు తిట్టిపోస్తున్నారు. అయితే.. ఆ రెండు దేశాల మ్యాచ్‌ మన దేశంలో ఎందుకు అంటే.. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు బాగాలేని సమయంలో వారికి ఇండియాలోని నోయిడా గ్రౌండ్‌ సెకండ్‌ హోం గ్రౌండ్‌గా ఉంది. ఆఫ్ఘాన్‌కు క్రికెట్‌లో విషయంలో బీసీసీఐ చాలా ఏళ్లుగా సాయం చేస్తూ ఉంది. ఆ దేశంలో క్రికెట్‌ అభివృద్ధికి, అలాగే ఆఫ్ఘాన్‌ క్రికెట్‌ టీమ్‌కు మన దేశంలో క్యాంపులు ఏర్పాటు చేయడంలో సాయం చేస్తూ ఉంటుంది. కానీ, ఇప్పుడు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు సరైన గ్రౌండ్‌ ఏర్పాటు చేయకపోవడంతో బీసీసీఐపై విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments