IND vs SL, Rohit Sharma: మా ఓటమికి కారణం అదే.. మీరు చెప్పింది పెద్ద జోక్: రోహిత్ శర్మ

IND vs SL, Rohit Sharma: మా ఓటమికి కారణం అదే.. మీరు చెప్పింది పెద్ద జోక్: రోహిత్ శర్మ

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ను 2-0తో చేజార్చుకుంది టీమిండియా. ఇక ఈ దారుణ ఓటమికి కారణాలను వెల్లడించాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. మా ఓటమికి రీజన్ అది కాదు.. మీరు చెప్పేది పెద్ద జోక్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ను 2-0తో చేజార్చుకుంది టీమిండియా. ఇక ఈ దారుణ ఓటమికి కారణాలను వెల్లడించాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. మా ఓటమికి రీజన్ అది కాదు.. మీరు చెప్పేది పెద్ద జోక్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్ ను మాత్రం శ్రీలంకకు సమర్పించింది. వన్డే సిరీస్ లో శ్రీలంక ఆది నుంచి భారత్ పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే వచ్చింది. తొలి మ్యాచ్ టై కాగా.. ఆ తర్వాత మ్యాచ్ లో 32 పరుగులతో ఓడిపోయింది. ఇక సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో 110 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి సిరీస్ ను చేజార్చుకుంది. మూడో వన్డేలో శ్రీలంక నిర్దేశించిన 249 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 138 రన్స్ కే కుప్పకూలింది. ఇక ఈ ఓటమికి కారణాలు చెప్పుకొచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ.

మూడు వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది శ్రీలంక. దాంతో 27 సంవత్సరాల తర్వాత భారత్ పై వన్డే సిరీస్ గెలిచి లంక చరిత్ర సృష్టించింది. ఇక ఈ సిరీస్ లో శ్రీలంక అద్భుతమైన ప్రదర్శన చేసిందని, తమ ఓటమికి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రిలాక్స్ అవ్వడమే అని చాలా మంది అనుకుంటున్నారని అది నిజం కాదని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఎన్నో ఏళ్లుగా టీమిండియా ప్లేయర్లు నిలకడగా రాణిస్తున్నారని తెలిపాడు రోహిత్.

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ..”ఈ సిరీస్ లో మాకంటే శ్రీలంక అద్భుత ప్రదర్శన చేసింది. అందుకే సిరీస్ గెలిచింది. అయితే చాలా మంది మేము టీ20 వరల్డ్ కప్ గెలిచాక రిలాక్స్ అయ్యాం అని, అందుకే ఈ ఓటమి అని అంటున్నారు. అదో పెద్ద జోక్, అందులో ఎలాంటి నిజం లేదు. ఇక స్పిన్ ఆడటంలో భారత బ్యాటర్లు తడబడటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ దానిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్ లో మేం ఒత్తిడికి గురైన మాట వాస్తవమే. అదీకాక వ్యక్తిగత ప్లాన్స్ పై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. రిలాక్స్ అయ్యాం అన్న మాటలో నిజం లేదు. భారత్ కు ఆడుతున్న కాలం ఆ మాటకు చోటు లేదు” అంటూ హిట్ మ్యాన్ పేర్కొన్నాడు. మరి టీమిండియా ఈ సిరీస్ లో ఓడిపోవడానికి కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments