Mitchell Starc: ఆ ట్రోఫీ కంటే టీమిండియాతో సిరీసే మాకు కీలకం.. స్టార్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

BGT 2024-25: భారత్-ఆస్ట్రేలియా.. ఈ రెండు జట్లు తలపడితే చూసేందుకు రెండు కళ్లు చాలవు. అన్ని ఫార్మాట్లలోనూ టాప్​లో ఉన్న ఈ టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే అదో యుద్ధాన్ని తలపిస్తుంది. వీళ్ల మధ్య రైవల్రీ కూడా ఉంది.

BGT 2024-25: భారత్-ఆస్ట్రేలియా.. ఈ రెండు జట్లు తలపడితే చూసేందుకు రెండు కళ్లు చాలవు. అన్ని ఫార్మాట్లలోనూ టాప్​లో ఉన్న ఈ టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే అదో యుద్ధాన్ని తలపిస్తుంది. వీళ్ల మధ్య రైవల్రీ కూడా ఉంది.

భారత్-ఆస్ట్రేలియా ఈ రెండు జట్లు తలపడితే చూసేందుకు రెండు కళ్లు చాలవు. అన్ని ఫార్మాట్లలోనూ టాప్​లో ఉన్న ఈ టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే అదో యుద్ధాన్ని తలపిస్తుంది. వీళ్ల మధ్య రైవల్రీ కూడా ఉంది. వరల్డ్ క్రికెట్​ను ఏలిన ఆసీస్​ను వణికించింది భారత్. 2003 వన్డే వరల్డ్ కప్​లో ఫైనల్​కు చేరుకుంది. ఆఖరి పోరులో కంగారూల చేతుల్లో ఓడినా ఆ టీమ్ డామినేషన్​ను సవాల్ చేయడం స్టార్ట్ అయింది. టీ20 ప్రపంచ కప్-2007, వన్డే వరల్డ్ కప్-2011లో ఆసీస్​ను నాకౌట్ మ్యాచెస్​లో చిత్తు చేసి ఛాంపియన్​గా అవతరించింది భారత్. రీసెంట్​గా పొట్టి ప్రపంచ కప్​లోనూ మెన్ ఇన్ బ్లూ విన్నర్​గా నిలిచింది. ఆసీస్ గడ్డపై ఆ జట్టును వరుసగా రెండు పర్యటనల్లో చిత్తు చేసి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది టీమిండియా. అలాంటి భారత్ మరోమారు కంగారూ టూర్​కు వెళ్లనుంది. అందుకే ఆసీస్ క్రికెటర్లు మన జట్టును టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఏడాది ఆఖర్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్​కు పయనం కానుంది భారత్. ఈ 5 టెస్టుల సిరీస్​లో కంగారూలను మరోమారు చిత్తు చేయాలని టీమిండియా భావిస్తోంది. ఆస్ట్రేలియా కూడా ఈ సిరీస్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. యాషెస్ సిరీస్ కంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మరింత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది. తమ గడ్డ మీద తమను చిత్తు చేసిన భారత్​ను ఓడించాలని చూస్తోంది. ఆ జట్టు టాప్ పేసర్ మిచెల్ స్టార్క్ ఈ విషయంపై రియాక్ట్ అయ్యాడు. యాషెస్ కంటే భారత్​తో సిరీసే తమకు చాలా ముఖ్యమని అన్నాడు. ఇంతకుముందు ఈ సిరీస్​లో మూడు టెస్టులు జరిగేవని.. ఇప్పుడు ఐదు టెస్టులు జరగనున్నాయని, దీంతో యాషెస్​ రేంజ్​ను ఇది మించిపోతోందని అన్నాడు స్టార్క్. టీమిండియా చాలా బలమైన జట్టని.. వాళ్లను ఓడించడంలోనే అసలైన కిక్ ఉంటుందన్నాడు.

సొంతగడ్డపై జరిగే ప్రతి మ్యాచ్​లోనూ నెగ్గాలని అనుకుంటున్నామని.. భారత్​ను కూడా ఓడిస్తామన్నాడు స్టార్క్. భారత్-ఆస్ట్రేలియాలు టెస్ట్ ఫార్మాట్​లో టాప్-2 టీమ్స్ అని చెప్పిన కంగారూ పేసర్.. ఈ సిరీస్ కోసం అభిమానులతో పాటు తాను కూడా ఎంతో ఎగ్జయిటింగ్​గా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రోఫీని వదిలేది లేదన్నాడు స్టార్క్. ఆసీస్ తరఫున బ్యాగీ గ్రీన్ క్యాప్ వేసుకొని టెస్టుల్లో ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తానని పేర్కొన్నాడు. తనలోని అత్యుత్తమ ప్రతిభను కనబర్చేందుకు టెస్టులను మించిన మరో ఫార్మాట్ లేదన్నాడు స్టార్క్. ఇక, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఇప్పటి నుంచే భారత్​ను టార్గెట్ చేస్తూ ఓడిస్తామంటూ ఆసీస్ ఆటగాళ్లు ప్రగల్భాలకు పోతున్నారు. ఇదే క్రమంలో స్టార్క్ పైవ్యాఖ్యలు చేశాడు. మరి.. యాషెస్ కంటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటూ స్టార్క్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments