దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ క్రికెటర్లకు BCCI గుడ్ న్యూస్!

  • Author Soma Sekhar Published - 04:50 PM, Mon - 10 July 23
  • Author Soma Sekhar Published - 04:50 PM, Mon - 10 July 23
దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ క్రికెటర్లకు BCCI గుడ్ న్యూస్!

భారతదేశంలో ఉన్న యంగ్ క్రికెటర్లకు BCCI గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ముంబైలో జరిగిన సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను సయ్యద్ ముస్తాఖ్ అలీ టోర్నీలో ప్రవేశపెట్టం కాగా.. రెండోది ఆసియా క్రీడలకు మహిళా జట్టుతో పాటుగా పురుషుల జట్టును కూడా పంపడం. ఈ నిర్ణయాలతో పాటుగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ బౌలర్లకు మంచి జరగనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

టీమిండియా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే? దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ బౌలర్లను వెతకడం కోసం ఓ భారీ ఆపరేషన్ ను చేపట్టనుందని సమాచారం. ఈ ఆపరేషన్ లో భాగంగా.. దేశంలో ఉన్న 18-23 సంవత్సరాల వయసు గల మ్యాచ్ విన్నింగ్ బౌలర్లను జల్లెడ పట్టనున్నారు. వీరిందరిని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్ లకు అప్పగించి.. శిక్షణ ఇప్పిస్తారు. టీమిండియా బౌలింగ్ డిపార్ట్ మెంట్ స్ట్రాంగ్ గా.. మరీ ముఖ్యంగా టెస్టుల్లో గెలవడానికి మ్యాచ్ విన్నింగ్ బౌలర్లను తయ్యారు చేయడమే.. ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం.

కాగా.. పురుషుల జట్టుతో పాటుగా మహిళల జట్టులోకి ఈ బౌలర్లను తీసుకుంటారు. మహిళా క్రికెట్ జట్టులో కొంత మంది బంగ్లాదేశ్ సిరీస్ కు అందుబాటులో ఉండటం లేదు. వారి స్థానాలను వీరితో భర్తీ చేయాలని భావిస్తోంది బీసీసీఐ. అయితే ఈ టాలెంట్ హంట్ లో బౌలర్లకు నైపుణ్యంతో పాటుగా.. ఫిట్ నెస్ కూడ ఉండాలని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ బౌలింగ్ హంట్ కు అర్హులు కావాలంటే.. 1-24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ నిబంధనతో పాటుగా మరికొన్ని నిబంధనలు, బెనిఫిట్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ తన సంవత్సరపు మీటింగ్ లో తెలియజేయనుందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి దేశవ్యాప్తంగా విన్నింగ్ బౌలర్ల కోసం హంట్ ను ప్రారంభించనున్న బీసీసీఐపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments