టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌ను ప్రకటించిన BCCI

BCCI, Indian Women's Squad, T20 World Cup 2024 Women's: ఈ ఏడాది జరిగిన మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌ను రోహిత్‌ సేన సాధించింది. అలాగే ఉమెన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌ కోసం తాజాగా బీసీసీఐ టీమ్‌ను ప్రకటించింది. అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

BCCI, Indian Women's Squad, T20 World Cup 2024 Women's: ఈ ఏడాది జరిగిన మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌ను రోహిత్‌ సేన సాధించింది. అలాగే ఉమెన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌ కోసం తాజాగా బీసీసీఐ టీమ్‌ను ప్రకటించింది. అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

యూఏఈ వేదికగా అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కాబోతున్న ఐసీసీ ఉమెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా మొత్తం 15 మందితో కూడా స్క్వౌడ్‌ను ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నిజానికి బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉంది. కానీ, అక్కడి పరిస్థితుల దృష్ట్యా టోర్నీ నిర్వహణను బంగ్లాదేశ్‌ నుంచి యూఏఈకి మార్చారు. యూఏఈలోని దుబాయ్‌, షార్జా స్టేడియాల్లో టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 10 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ రెండు స్టేడియాల్లోనే జరుగుతాయి. అయితే.. ఇటీవల ఆసియా కప్‌ ఆడిన టీమిండియానే టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక చేశారు. కేవలం ఒకే ఒక్క మార్పు చేస్తూ.. స్క్వౌడ్‌ను అనౌన్స్‌ చేశారు.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం ఎంపిక చేసిన జట్టు..

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), యాస్తికా భాటియా (వికెట్‌ కీపర్‌), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్. (యాస్తికా భాటియా, శ్రేయాంక పాటిల్ ఫిట్‌నెస్‌ సాధించాల్సి ఉంది.), ట్రావెలింగ్ రిజర్వ్‌ ప్లేయర్లు: ఉమా చెత్రీ (వికెట్‌ కీపర్‌), తనూజా కన్వర్, సైమా ఠాకోర్. నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌ ప్లేయర్స్‌: రాఘవి బిస్త్, ప్రియా మిశ్రా. మరి టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక చేసిన ఈ టీమ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments