ఆసీస్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం! ఇటలీ నేషనల్‌ టీమ్‌ తరఫున బరిలోకి..

Joe Burns, Australia, Italy: ఆస్ట్రేలియాకు చెందిన ఓ స్టార్‌ క్రికెటర్‌ తన సొంత దేశాన్ని వదిలిపెట్టి.. ఇటలీ నేషనల్‌ క్రికెట్‌ టీమ్‌ తరఫున ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ సంచలన నిర్ణయం తీసుకున్న క్రికెటర్‌ ఎవరు? ఎందుకు అలా చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Joe Burns, Australia, Italy: ఆస్ట్రేలియాకు చెందిన ఓ స్టార్‌ క్రికెటర్‌ తన సొంత దేశాన్ని వదిలిపెట్టి.. ఇటలీ నేషనల్‌ క్రికెట్‌ టీమ్‌ తరఫున ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ సంచలన నిర్ణయం తీసుకున్న క్రికెటర్‌ ఎవరు? ఎందుకు అలా చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్‌లో మంచి టాలెంట్‌ ఉండి.. చిన్నా చితక దేశాల్లో ఆడే క్రికెటర్లు మరింత ఎదిగేందుకు పెద్ద దేశాలకు వలస వెళ్తారు. కొంతమంది పెద్ద పెద్ద టీమ్స్‌లో చోటు దక్కక.. వేరే దేశాలకు ఆడేందుకు వెళ్లిపోతారు. ఇలా ఒక దేశంలో పుట్టి, ఆ దేశానికి ఆడి, మరో దేశానికి వెళ్లి ఆ దేశానికి కూడా ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరిపోయాడు ఆస్ట్రేలియన్‌ మాజీ ఓపెనర్‌ జో బర్న్స్‌. ఆస్ట్రేలియాను వీడి.. ఇటలీ జాతీయ జట్టుకు ఆడాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు బర్న్స్‌. ఇటలీని టీ20 వరల్డ్‌ కప్‌ 2026కు క్వాలిఫై అయ్యేలా చేయడమే తన లక్ష్యమంటూ పేర్కొన్నాడు.

అలాగే ఈ ఏడాది మరణించిన తన సోదరుడు డొమ్నిక్‌ బర్న్స్‌కు నివాళిగా కూడా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అతని జెర్సీ నంబర్‌ 85నే ఇటలీకి ఆడే సమయంలో ధరిస్తానని పేర్కొన్నాడు. బర్న్స్‌ తల్లి ఇటలీ పౌరసత్వం కలిగి ఉండటంతో బర్న్స్‌కు ఆ దేశానికి ప్రాతినథ్యం వహించేందుకు అర్హత పొందాడు. ఇవే కాకుండా.. బర్న్స్‌ ఆస్ట్రేలియాను వీడి ఇటలీకి మారడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అవేంటంటే.. బర్న్స్‌కు ఈ ఏడాది దేశవాళి జట్టైన క్వీన్స్‌లాండ్‌ కాంట్రాక్ట్‌ లభించలేదు. అలాగే బిగ్‌బాష్‌ లీగ్‌తోనూ బర్న్స్‌ కాంట్రాక్ట్‌ ముగిసింది.

ఇలా ప్రొఫెషనల్‌ కమ్‌ పర్సనల్‌ రీజన్స్‌తో బర్న్స్‌ ఆస్ట్రేలియాను వీడి ఇటలీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 34 ఏళ్ల బర్న్స్‌ 2014 నుంచి 2020 మధ్య ఆస్ట్రేలియా తరఫున 23 టెస్టులు, 6 వన్డేలు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 1608 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 8 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు ఇటలీ క్రికెట్‌ జట్టు ఇప్పటి వరకు ఏ వరల్డ్‌ కప్‌ కూడా క్వాలిఫై కాలేదు. టీ20 వరల్డ్‌ కప్‌ 2026 లక్ష్యంగా జూన్‌ 9 నుంచి వరల్డ్‌ కప్‌ రీజియనల్‌ క్వాలిఫైయర్స్‌లో ఇటలీ పోటీ పడనుంది. ఈ టోర్నీలో ఇటలీ, ఫ్రాన్స్‌, ఐసిల్‌ ఆఫ్‌ మ్యాన్‌, లక్సంబర్గ్‌, టర్కీ జట్లు పోటీ పడుతున్నాయి. మరి బర్న్స్‌ ఆస్ట్రేలియాను వీడి ఇటలీకి వెళ్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments