Will Pucovski: ఒక్క టెస్ట్‌ ఆడి.. 26 ఏళ్లకే రిటైర్మెంట్‌ ప్రకటించిన విల్ పుకోవ్స్కీ! కారణం ఇదే!

Will Pucovski Retirement, Australia: ఆసీస్‌ యువ క్రికెటర్‌ కేవలం 26 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్‌ వెనుక ఉన్న కారణం తెలిస్తే.. కన్నీళ్లు పెట్టుకుంటారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Will Pucovski Retirement, Australia: ఆసీస్‌ యువ క్రికెటర్‌ కేవలం 26 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్‌ వెనుక ఉన్న కారణం తెలిస్తే.. కన్నీళ్లు పెట్టుకుంటారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో భవిష్యత్తు ఉన్న టాలెంటెడ్‌ క్రికెటర్‌, ప్రపంచ క్రికెట్‌ను శాసించే ఆస్ట్రేలియా టీమ్‌లో స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ తర్వాత ఆ స్థానం అతనిదే అనుకున్నారంతా.. కానీ, దురదృష్టవశాత్తు కేవలం 26 ఏళ్ల చిన్న వయసులోనే ఆస్ట్రేలియా యువ క్రికెటర్‌ విల్ పుకోవ్స్కీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆస్ట్రేలియా తరఫున ఒకే ఒక టెస్ట్‌ మ్యాచ్‌, అది కూడా మన టీమిండియాపైనే ఆడి.. క్రికెట్‌కు శాశ్వతంగా దూరం అయ్యాడు. మరి ఇంత చిన్న వయసులోనే క్రికెట్‌కు ఎందుకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చిందంటే.. అందుకు ఓ బలమైన కారణం ఉంది. అది తెలిస్తే.. సగటు క్రికెట్‌ అభిమాని కన్నీళ్లు పెట్టుకుంటాడు.

1998 ఫిబ్రవరీ 2న ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జన్మించిన విల్ పుకోవ్స్కీ అలియాస్‌ విలియమ్‌ జాన్‌ పుకోవ్స్కీ.. చిన్నతనం నుంచే క్రికెట్‌ అవ్వాలని కలలు కన్నాడు. అందుకోసం ఎంతో శ్రమించాడు. ఆస్ట్రేలియా డొమెస్టిక్‌ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఏకంగా 45.19 యావరేజ్‌తో 36 మ్యాచ్‌ల్లోనే 2350 పరుగులు సాధించాడు. అందులో 7 సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇలాంటి అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా ఫ్యూచర్‌ స్టార్‌గా ఎదిగాడు. 2021లో ఇండియాతో సిడ్నీ వేదికగా జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌తో పుకోవ్స్కీకి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది.

స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌తో కలిసి.. టీమిండియాపై బరిలోకి దిగాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. జస్ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్‌, అశ్విన్‌, జడేజా లాంటి భీకరమైన బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కొని.. డెబ్యూ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లోనే 62 పరుగులు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులతో నిరాశపర్చినా.. ఫస్ట్‌ మ్యాచ్‌లోనే అతను చూపించిన ఇంటెంట్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఫిదా అయిపోయింది. ఇక ఆసీస్‌ భవిష్యత్తుకు ఢోకా లేదని సూపర్‌ ప్లేయర్‌ రెడీ అవుతున్నాడంటూ సంతోషపడింది. విల్‌ పుకోవ్స్కీ కూడా తన కెరీర్‌ గురించి ఎన్నో కలలు కన్నాడు. కానీ, ఆసీస్‌ దేశవాళి క్రికెట్‌లో షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టాస్మానియా టైగర్స్-విక్టోరియా టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విక్టోరియకాకు ఆడుతూ.. పుకోవ్స్కీ గాయపడ్డాడు. బాల్‌ నేరుగా వచ్చిన అతని తలకు తగిలింది. అక్కడికక్కడే కూలబడిపోయాడు. ఈ గాయానికి చికిత్స చేసిన అనంతరం.. ఇక క్రికెట్‌కు దూరంగా ఉండాలని సూచించారు. చాలా మంది వైద్యుల సూచన మేరకు క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవ్వాలని పుకోవ్స్కీ డిసైడ్‌ అయిపోయాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయం మూడు నెలల కిందటే తీసుకున్నా.. తాజాగా విక్టోరియా క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది. మరి ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ యంగ్‌ క్రికెటర్‌.. మ్యాచ్‌లో గాయపడి.. మొత్తం కెరీర్‌కు గుడ్‌బై చెప్పాల్సి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments