RCB నుంచి బయటపడి.. స్టార్లుగా మారిన క్రికెటర్లు వీళ్లే!

RCB, IPL 2024: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 16 ఏళ్లుగా ఐపీఎల్‌ కప్పు కోసం పోరాడుతున్న జట్టు. ఈ సీజన్‌లో కూడా వాళ్ల ప్రదర్శన గొప్పగా లేదు. అయితే.. ఒక్కసారి ఆ టీమ్‌లో ఆడి వచ్చే ఆటగాళ్ల తలరాత మాత్రం పూర్తిగా మారిపోతుంది. అలా ఆడి స్టార్లు అయిన వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

RCB, IPL 2024: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 16 ఏళ్లుగా ఐపీఎల్‌ కప్పు కోసం పోరాడుతున్న జట్టు. ఈ సీజన్‌లో కూడా వాళ్ల ప్రదర్శన గొప్పగా లేదు. అయితే.. ఒక్కసారి ఆ టీమ్‌లో ఆడి వచ్చే ఆటగాళ్ల తలరాత మాత్రం పూర్తిగా మారిపోతుంది. అలా ఆడి స్టార్లు అయిన వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే గెలిచింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌తో పాటు, శుక్రవారం హోం గ్రౌండ్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆర్సీబీ దారుణ ఓటమిని చవిచూసింది. టీమ్‌లో ఒక్క విరాట్‌ కోహ్లీ తప్పించి అంతా విఫలం అవుతుండటం ఆర్సీబీని కలవరపెడుతోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లను చూస్తే.. ఈ ఐపీఎల్ సీజన్‌లో అన్ని టీమ్స్‌లోకెల్లా వరస్ట్‌ టీమ్‌ ఆర్సీబీనే అని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. విరాట్‌ కోహ్లీ, దినేష్‌ కార్తీక్‌ మినహా.. ఎవరూ కూడా వారికి స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు.

టీమ్‌ మొత్తం విఫలమై.. ఒక్క ఆటగాడు ఎంత ఆడినా ఏం లాభం ఉంటుందని ఫ్యాన్స్‌ అంటున్నారు. ఇప్పుడు ఆర్సీబీలో ఆడుతూ.. చెత్త ప్రదర్శన కనబరుస్తున్న వాళ్లు.. టీమ్‌ మారితే మాత్రం స్టార్లు అయిపోతారని, అలాగే గతంలో ఆర్సీబీకి ఆడి.. తర్వాత ఆర్సీబీ నుంచి బయటికి వచ్చేసిన వాళ్లు ప్రస్తుతం ఐపీఎల్‌ను శాసిస్తున్నారంటూ క్రికెట్‌ అభిమానులు ఓ లిస్ట్‌ను వైరల్‌ చేస్తున్నారు. ఆ లిస్ట్‌లో ఉన్న ఓ నలుగురు ఆటగాళ్లు ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఐపీఎల్‌గా ఉన్నారు. మరి ఆర్సీబీ నుంచి బయటికి వచ్చి.. స్టార్లుగా మారిన ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

మొదటిగా టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆశిష్‌ నెహ్రా గురించి మాట్లాడుకుంటే.. ఈ పేసర్‌ కొంతకాలం ఆర్సీబీ టీమ్‌లో ఆడాడు. కానీ, ఆ టీమ్‌కి ఉన్న దరిద్రమో ఎమో కానీ, పెద్దగా రాణించలేకపోయాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌ చివర్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున బౌలింగ్‌ చేసి.. అదరగొట్టాడు. ఆ తర్వాత గుజరాత్‌ టైటాన్స్‌ టీమ్‌కు హెడ్‌ కోచ్‌గా మారి.. ఐపీఎల్‌నే శాసిస్తున్నాడు. 2022లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌తో తొలి సీజన్‌లోనే కప్పుకొట్టించాడు. రెండో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది గుజరాత్‌.. ప్రస్తుతం సీజన్‌లో కూడా స్ట్రాంగ్‌ టీమ్‌గా ఉంది. నెహ్రా తర్వాత శివమ్‌ దూబే గురించి చెప్పుకోవాలి. ఆర్సీబీలో ఉన్నంత కాలం ఒక అనామక ప్లేయర్‌గా ఉన్న శివమ్‌ దూబే.. కొంతకాలంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడుతూ స్టార్‌ ప్లేయర్‌గా ఎదిగాడు. చెన్నైకి ఆడిన తర్వాతే అతనికి టీమిండియాలో చోటు దక్కింది. ఆట తీరులో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. 2019, 2020 సీజన్స్‌లో రూ.5 కోట్లుకు ఆర్సీబీ తరఫున ఆడినా.. పెద్దగా ఇంప్యాక్ట్‌ చూపని దూబే.. కేవలం రూ.4 కోట్లకు సీఎస్‌కే టీమ్‌ తరఫున ఆడుతూ స్టార్‌గా మారిపోయాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌లో విధ్వంసం సృష్టిస్తున్న సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ గతంలో ఆర్సీబీ తరఫున ఆడాడు అంటే బహుషా ఆర్సీబీ ఫ్యాన్స్‌ షాక్‌ అవుతారేమో. క్లాసెన్‌ 2019 సీజన్‌లో ఆర్సీబీకి ఆడాడు. కేవలం 50 లక్షలకు మాత్రమే ఆర్సీబీకి దొరికిన క్లాసెన్‌ అప్పుడు పెద్దగా రాణించలేదు. ఎప్పుడైతే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.5.25 కోట్లు పెట్టి తీసుకుందో.. అప్పటి నుంచి రెచ్చిపోయి ఆడుతున్నాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌లో ఆడుతున్న మరో స్టార్‌ ప్లేయర్‌ ట్రావిస్‌ హెడ్‌ కూడా గతంలో ఆర్సీబీకి ఆడాడు. 2016, 2017 సీజన్స్‌లో హెడ్‌ ఆడిన విషయం కూడా చాలా మందికి గుర్తుండి ఉండదు. కానీ, ఇప్పుడు హెడ్‌ దుమ్మురేపుతున్నాడు. ఇలా ఆర్సీబీని వదిలి పెట్టి బయటికి వచ్చిన ఈ నలుగురు ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్‌ను శాసిస్తున్నారు. దీంతో.. అసలు దరిద్రం అంతా ఆ టీమ్‌లోనే ఉందంటూ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments