Nidhan
IND vs BAN, Akash Deep: చెన్నై టెస్టులో బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపిస్తున్నారు టీమిండియా బౌలర్లు. ఒక్కో పరుగు చేయడానికి చెమటోడ్చేలా చేస్తున్నారు. ఒక బౌలర్ అయితే ఆ టీమ్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.
IND vs BAN, Akash Deep: చెన్నై టెస్టులో బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపిస్తున్నారు టీమిండియా బౌలర్లు. ఒక్కో పరుగు చేయడానికి చెమటోడ్చేలా చేస్తున్నారు. ఒక బౌలర్ అయితే ఆ టీమ్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.
Nidhan
టీమిండియా వ్యూహం పనిచేసింది. స్పిన్ పిచ్‌ను పేస్ వికెట్‌గా మార్చి బంగ్లాదేశ్‌కు షాక్ ఇవ్వాలనుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతం గంభీర్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. పేస్, స్వింగ్‌కు అనుకూలిస్తున్న చెన్నై వికెట్‌పై బంగ్లా బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు భారత బౌలర్లు. ఒక్కో పరుగు చేయడానికి చెమటోడ్చేలా చేస్తున్నారు. ఒక బౌలర్ అయితే ఆ టీమ్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. క్రీజులో నిలదొక్కుకోవాలంటేనే భయపడేలా చేస్తున్నాడు. అతడే ఆకాశ్‌దీప్. అతడి దెబ్బకు బంగ్లా బ్యాటర్లు భయపడుతున్నారు. అద్భుతమైన పేస్, అనూహ్యమైన బౌన్స్, స్వింగ్‌తో అతడు వేస్తున్న డెలివరీస్ ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి ఆటగాళ్లు వణికిపోతున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే బంగ్లాకు షాక్ ఇచ్చాడు ఆకాశ్‌దీప్.
బంగ్లాదేశ్ బ్యాటర్లు జస్ప్రీత్ బుమ్రా కోసం ప్రిపేర్ అయి వచ్చారు. అతడి స్పెల్‌ను దాటితే మిగతా వాళ్లను అలవోకగా ఎదుర్కొవచ్చని.. పరుగుల వరద పారించొచ్చని అనుకున్నారు. కానీ ఇంకో ఎండ్ నుంచి బౌలింగ్ స్టార్ట్ చేసిన ఆకాశ్‌దీప్ వాళ్లకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టించాడు. ఆరంభంలోనే జాకీర్ ఖాన్ (3)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఫుల్ లెంగ్త్ డెలివరీతో అతడ్ని బీట్ చేసి బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికే మోమినుల్ హక్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఫుల్ లెంగ్త్‌లో పడి లోపలకు దూసుకొచ్చిన బంతిని ఆడలేకపోయాడు మోమినుల్. తొలి బంతికే ఔట్ అయి నిరాశతో క్రీజును వీడాడు. గంటకు 140 కిలోమీటర్లకు తగ్గని వేగం, స్వింగ్, బౌన్స్‌తో బంతులు సంధిస్తూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు ఆకాశ్‌దీప్.
దిగ్గజ పేసర్ మహ్మద్ షమి లేని లోటు కనపడకుండా చేశాడు ఆకాశ్‌దీప్. అతడిలాగే మెరుపు వేగంతో బంతులు విసిరాడు. బ్యాటర్లను ఊరిస్తూ ఫుల్ లెంగ్త్ డెలివరీస్ వేశాడు. వికెట్లు తీయాలనే కసితో బౌలింగ్ చేశాడు. ఫస్ట్ స్పెల్‌లో 5 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు ఆకాశ్‌దీప్. ఆ తర్వాత బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టసాగారు. పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా (3 వికెట్లు), స్పిన్నర్ రవీంద్ర జడేజా (2 వికెట్లు) ఆ టీమ్ పనిపట్టారు. దీంతో ఆకాశ్‌దీప్ మళ్లీ బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు.
ప్రస్తుతం బంగ్లాదేశ్ 8 వికెట్లకు 112 పరుగులతో ఉంది. ఆ టీమ్ స్కోరు 150 దాటడం కష్టంగానే ఉంది. ఈ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచిన ఆకాశ్‌దీప్ బౌలింగ్ చూసిన అభిమానులు.. షమి వారసుడు దొరికేశాడని అంటున్నారు. అచ్చం అతడిలాగే బౌలింగ్ చేస్తున్నాడని, రివర్స్ స్వింగ్, యార్కర్స్, స్లో బౌన్సర్స్ లాంటివి నేర్చుకుంటే మరింత డేంజరస్ బౌలర్‌గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి బౌలర్లే మనకు కావాలని.. ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నావ్ బాస్ అని అడుగుతున్నారు. ఆకాశ్‌దీప్ ఇలాగే బౌలింగ్ చేస్తూ పోతే సిరాజ్ ప్లేస్‌కు ప్రమాదం పొంచి ఉందంటున్నారు. మరి.. ఆకాశ్‌దీప్ బౌలింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
THE BEST SIGHT IN CIRCKET…!!!
Bowler dismantling batter’s middle stump – Akash Deep with TWO in TWO! 🎯 pic.twitter.com/ItzxOaFLIE
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2024