South Africa: ఛోకర్స్‌ ముద్రను తుడిచిపెట్టేశాడు! సౌతాఫ్రికా తలరాత మార్చిన వీరుడు!

South Africa: ఛోకర్స్‌ ముద్రను తుడిచిపెట్టేశాడు! సౌతాఫ్రికా తలరాత మార్చిన వీరుడు!

Aiden Markram, South Africa, SA vs AFG, T20 World Cup 2024: సౌతాఫ్రికా తొలిసారి వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. 1992 నుంచి సెమీస్‌ గండాన్ని దాటేలేకపోతున్న ఆ జట్టును ఒకే ఒక్కడు ఆ గండాన్ని దాటించి.. ఫైనల్స్‌కు చేర్చాడు. ఆ ఒక్కడు ఎవడంటే..?

Aiden Markram, South Africa, SA vs AFG, T20 World Cup 2024: సౌతాఫ్రికా తొలిసారి వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. 1992 నుంచి సెమీస్‌ గండాన్ని దాటేలేకపోతున్న ఆ జట్టును ఒకే ఒక్కడు ఆ గండాన్ని దాటించి.. ఫైనల్స్‌కు చేర్చాడు. ఆ ఒక్కడు ఎవడంటే..?

క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఓ వరల్డ్‌ కప్‌ టోర్నీ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది సౌతాఫ్రికా జట్టు. 1992లో తొలిసారి వన్డే వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌కు చేరిన సౌతాఫ్రికా.. సెమీస్‌లో ఓడిపోయింది. అక్కడి నుంచి మొత్తంగా 8 సార్లు సెమీస్‌ ఆడింది. అందులో తొలి ఏడు సార్లు ఓటమే ఎదురైంది. అందుకే సౌతాఫ్రికాను క్రికెట్‌ అభిమానులు ఛోకర్స్‌ అంటుంటారు. సెమీస్‌ గండాన్ని దాటలేని టీమ్‌గా, నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తయ్యే జట్టుగా సౌతాఫ్రికాకు పేరుంది. అలాంటి సౌతాఫ్రికా జట్టు తొలిసారి సెమీస్‌ గండాన్ని దాటేసి.. ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో గెలిచి.. ఫైనల్‌ పోరుకు సిద్ధమైంది.

వరుసగా ఏడు సార్లు సెమీస్‌కు చేరినా.. ఒక్కటంటే ఒక్కసారి కూడా సెమీస్‌ గెలిచి ఫైనల్‌కు వెళ్లలేదు. ఎంతో గొప్ప గొప్ప ఆటగాళ్లు కెప్టెన్లుగా ఉన్నా.. పటిష్టమైన జట్టు అండగా ఉన్నా.. సౌతాఫ్రికా ఏనాడు సెమీస్‌ ఆడలేదు. ఎయిడెన్‌ మార్కరమ్‌ కెప్టెన్సీలో సౌతాఫ్రికా తొలిసారి వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ సక్సెస్‌లో జట్టు సమిష్టి కృషి ఉన్నా.. ఆ లక్‌ మాత్రం మార్కరమ్‌ కెప్టెన్సీతోనే వచ్చిందని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. తొలిసారి 1992లో వన్డే వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌ ఆడిన సౌతాఫ్రికా అప్పటి నుంచి ఎన్నో వరల్డ్‌ కప్‌లు ఆడింది, వన్డే, టీ20 అన్ని కలిపినా.. ఒక్కసారి కూడా ఫైనల్‌కు వెళ్లలేదు. ఈ సారి ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న మార్కరమ్‌ తన టీమ్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లి చరిత్ర సృష్టించాడు.

టీమిండియాకు ధోని ఎలాగైతే లక్కీ కెప్టెన్‌, పట్టిందల్లా బంగారం అని అంటూ ఉంటారో.. ఇప్పుడు మార్కరమ్‌ కూడా సౌతాఫ్రికా అలాంటి లక్కీ కెప్టెన్‌గా మారిపోయాడు. మార్కరమ్‌ ఒక బార్న్‌ లీడర్‌ అంటూ క్రికెట్‌ అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 2014లో సౌతాఫ్రికాకు కెప్టెన్‌గా అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ అందించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో వరుసగా తొలి రెండు సీజన్స్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఇప్పుడు తన కెప్టెన్సీలోనే తొలిసారి సౌతాఫ్రికాను వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌కు చేర్చాడు. ఆ ఫైనల్‌ కూడా గెలిచి.. సౌతాఫ్రికాకు తొలి వరల్డ్‌ కప్‌ను అందించాలని ఆ దేశ క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మరి సౌతాఫ్రికా తలరాతను మార్చడానికే పుట్టినట్లు ఉన్న మార్కరమ్‌ కెప్టెన్సీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments