అభిషేక్ శర్మ ఊహకందని విధ్వంసం ఇది! 25 బంతుల్లో.. 14 సిక్సర్లతో..

ఐపీఎల్ 2024లో దుమ్మురేపిన అభిషేక్ శర్మ.. అదే జోరును క్లబ్ క్రికెట్ లో చూపిస్తున్నాడు. తాజాగా గుర్గావ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కేవలం 25 బంతుల్లో.. 14 సిక్సర్లతో..

ఐపీఎల్ 2024లో దుమ్మురేపిన అభిషేక్ శర్మ.. అదే జోరును క్లబ్ క్రికెట్ లో చూపిస్తున్నాడు. తాజాగా గుర్గావ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కేవలం 25 బంతుల్లో.. 14 సిక్సర్లతో..

అభిషేక్ శర్మ.. ఐపీఎల్ 2024 సీజన్ లో మారుమోగిన పేరు. సంచలన ఇన్నింగ్స్ లకు మారుపేరుగా ఈ సీజన్ లో నిలిచిన ఈ యువ ఆటగాడు.. అదే జోరును ఇప్పుడు కూడా చూపిస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఓపెనర్ గా విధ్వంసకర బ్యాటింగ్ తో రికార్డుల మీద రికార్డులను బద్దలు కొట్టాడు అభిషేక్. అదే ఫామ్ ను ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నాడు. తాజాగా గుర్గావ్ వేదికగా జరిగిన ఓ క్లబ్ మ్యాచ్ లో బౌలర్లకు పీడకలను మిగుల్చుతూ.. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్ లో శివాలెత్తిన అభిషేక్ 25 బంతుల్లోనే శతకం బాదాడు.

ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ.. ఎలాంటి సంచలన ఇన్నింగ్స్ లు ఆడాడో మనందరికి తెలిసిందే. పవర్ ప్లే లో తన పవర్ ఏంటో చూపించాడు. సిక్సులు, ఫోర్లతో వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం ఉతికారేశాడు. ఈ సీజన్ లో 16 మ్యాచ్ లు ఆడి.. 484 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ ఫైనల్ కు చేరడంలో అభిషేక్ ది కీలక పాత్ర. ఇక అదే జోరును తాజాగా గుర్గావ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సైతం చూపించాడు.

ఈ మ్యాచ్ లో వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన అభిషేక్ శర్మ.. ప్రత్యర్థి బౌలర్లకు పీడకలను మిగిల్చాడు. కేవలం 25 బంతుల్లోనే సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. 14 సిక్సర్లు, 4 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఓవరాల్ గా 26 బంతుల్లో 103 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో 396 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఇది అధికారిక మ్యాచ్ కానప్పటికీ.. అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఇక అతడు ఇదే జోరును కొనసాగిస్తే.. త్వరలోనే టీమిండియాలోకి అడుగుపెట్టడం ఖాయం అంటున్నారు క్రీడా పండితులు, నెటిజన్లు. అయితే ఈ ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ.. టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోలేకపోయాడు అభిషేక్. కానీ త్వరలోనే అతడిని టీమిండియాలో చూస్తామని క్రికెట్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments