తిట్టమని ద్రవిడే చెప్పాడు! సంచలన నిజం బయటపెట్టిన అభిషేక్‌ శర్మ!

Abhishek Sharma, Rahul Dravid: టీమిండియా యువ క్రికెటర్‌ అభిషేక్‌ శర్మ.. మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Abhishek Sharma, Rahul Dravid: టీమిండియా యువ క్రికెటర్‌ అభిషేక్‌ శర్మ.. మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ గురించి.. యంగ్‌ క్రికెటర్‌ అభిషేక్‌ శర్మ సంచలన విషయం వెల్లడించాడు. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లను తిట్టమని రాహుల్‌ ద్రవిడే తమతో చెప్పినట్లు పేర్కొన్నాడు. అదేంటి.. ద్రవిడ్‌ స్వభావం అంది కాదే.. ఆటగాడిగా సుదీర్ఘ కెరీర్‌లో తన జోలికి వేరే క్రికెటర్లు వచ్చారు కానీ, ద్రవిడ్‌ మాత్రం ఎవరితో గొడవకు దిగిన దాఖలాలు లేవు. అలాంటి వ్యక్తి.. ఒక యంగ్‌ టీమ్‌ను ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను తిట్టమని ఎందుకు నేర్పిస్తాడనే డౌట్‌ రావొచ్చు. కానీ, అభిషేక్‌ శర్మ చెప్పింది నిజమే. ప్రత్యర్థి టీమ్‌ ఆటగాళ్లను ద్రవిడ్‌ చెప్పాడు.

కానీ, అది ఎప్పుడంటూ.. వాళ్లు తిడితేనే. ఈ ఘటన రాహుల్‌ ద్రవిడ్‌ అండర్‌-19 కోచ్‌గా ఉన్న సమయంలో చోటు చేసుకుంది. అండర్‌-19 ఆసియా కప్‌ సందర్భంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో యంగ్‌ టీమిండియా ఓడిపోయింది. ఆ సమయంలో బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు కాస్త ఓవర్‌ యాక్షన్‌ చేసి.. టీమిండియా కుర్రాళ్లపై నోరు పారేసుకున్నారు. ఆ సమయంలో ద్రవిడ్‌ అండర్‌ కోచ్‌గా ఉన్నాడు. అయితే.. ఆ వెంటనే అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో మరోసారి భారత్‌, బంగ్లాదేశ్‌ జట్లు తలపడ్డాయి.

ఆ సమయంలో ద్రవిడ్‌ టీమిండియా కుర్రాళ్లతో ఇలా ఉన్నాడు.. ‘వాళ్లు మిమ్మల్ని తిడితే.. ఓరుకోవాల్సిన అవసరం లేదు.. మీరు కూడా మాటకు మాట బదులివ్వండి’ అంటూ కుర్రాళ్లకు కాన్ఫిడెన్స్‌ ఇచ్చాడు. ద్రవిడ్‌ నుంచి అలాంటి మాట విని తమకే ఆశ్చర్యం వేసిందని, ద్రవిడ్‌ సార్‌ నుంచి తాము అది ఎక్స్‌పెక్ట్‌ చేయలేదని అభిషేక్‌ శర్మ చెప్పొకొచ్చాడు. అయితే.. ఎవరికైనా ఒక ఓపిక ఉంటుందని, సహనం నశిస్తే.. ఎవరైనా ద్రవిడ్‌ లాగే రియాక్ట్‌ అవుతారంటూ క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments