Vyooham Movie Review & Rating In Telugu: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఆ సినిమా ఎలా ఉంది? రామ్ గోపాల్ వర్మ మరోసారి మెప్పించాడా? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
Vyooham Movie Review & Rating In Telugu: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఆ సినిమా ఎలా ఉంది? రామ్ గోపాల్ వర్మ మరోసారి మెప్పించాడా? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
Tirupathi Rao
సూపర్ స్టార్స్ ఫేవరెట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి పాన్ ఇండియన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రామ్ గోపాల్ వర్మ కూడా పట్టువదలి విక్రమార్కుడిగా ఎట్టకేలకు సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మార్చి 2న వరల్డ్ వైడ్ గా వ్యూహం సినిమా విడుదలైంది. మరి.. ఈ చిత్రం ఎలా ఉంది? అసలు వ్యూహం కథేంటి? రామ్ గోపాల్ వర్మ తన మార్క్ ని మరోసారి చూపించారా? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
మదన్మోహన్ రెడ్డి(అజ్మల్ అమీర్) తండ్రి వీఎస్ వీరశేఖరరెడ్డి మరణంతో ఈ సినిమా కథ మొదలువుతుంది. తండ్రి మరణవార్త తెలుసుకుని మదన్ తల్లడిల్లిపోతాడు. తన తండ్రి మరణించాడనే వార్త విని కొన్ని వందల మంది ప్రాణాలు వదిలేశారని మదన్ తెలుసుకుంటాడు. ఆ కుటుంబాలను కలిసి ఓదార్చాలని ఫిక్స్ అవుతాడు. అలా వారిని ఓదార్చేందుకు ఓదార్పు యాత్రను ప్రారంభిస్తాడు. మదన్ ఇలా ప్రజల్లోకి వెళ్లడం అటు ప్రతిపక్షానికి ఇటు భారత్ పార్టీ హైకమాండుకు కూడా ఇష్టం ఉండదు. ప్రతిపక్ష నేత ఇంద్రబాబు(ధనుంజయ్ ప్రభునే) భారత్ పార్టీ హైకమాండ్ తో కలిసి తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతారు. ఆ తర్వాత మదన్మోహన్ రెడ్డి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? భారత్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి కొత్త పార్టీ స్థాపించి.. సీఎంగా ఎలా ఎదిగాడు? ప్రజల నాయకుడిగా ఎలా మారాడు? శ్రవణ్ కల్యాణ్ పాత్ర ఏంటి? ఇంద్రబాబుతో కలవడం, విడిపోయవడం వెనుక కథ ఏంటి అనేది తెలియాలంటే వ్యూహం సినిమా చూడాల్సిందే.
వ్యూహం సినిమాలో ఆర్జీవీ చెప్పాలి అనుకున్న విషయాలను ఎంతో స్పష్టంగా చెప్పేశాడు. ఎక్కడా దాపరికం లేకుండా.. ఈ విషయం చెప్పాలా వద్దా అనే బెరుకు లేకుండా తెరకెక్కించారు. వీఎస్ వీరశేఖరరెడ్డి మరణం తర్వాత మదన్ ఎదుర్కొన్న పరిస్థితులను, తండ్రి మరణవార్తతో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతో వారిని ఓదార్చేందుకు కూడా ఆంక్షలు పెట్టిన విధానం, భారత్ పార్టీ- మదన్ కు మధ్య దూరం పెరగడం, తప్పుడు కేసులు బనాయించి జైలులో పెట్టడం.. ఆ సమయంలో మదన్ ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని ఎదిరించి నిలబడిన తీరును చాలా చక్కగా తెరకెక్కించారు. అసలు నాయకుడు కూడా కావాలి అనుకోని మదన్.. ఎలా ప్రజలు మెచ్చే నేతగా ఎదిగాడు అనే అంశాన్ని, ముఖ్యంగా ప్రజలకు సేవచేయాలి అని మదన్ కు ఉన్న ఆకాంక్ష, ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న ఆపేక్షను అద్భుతంగా చూపించారు.
ముఖ్యంగా ప్రతి సన్నివేశంలో ఆ భావోద్వేగాలు, ఆ సంఘర్షణనకు చక్కని దృశ్యరూపాన్ని ఇచ్చారు. మదన్మోహన్ రెడ్డిపై జరిగిన కుట్రలు- కుతంత్రాలు, ప్రతిపక్షాలు- భారత్ పార్టీ చేతులు కలిపడం వంటి దృశ్యాలు ప్రేక్షకులను కాస్త ఆగ్రహానికి గురి చేస్తాయి. అలాగే తండ్రి బాటలో మదన్ ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు చూసి ఎమోషనల్ అవుతారు. మదన్- ప్రతిపక్షాల మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఒక గొప్ప నాయకుడిగా ఎదిగిన తర్వాత ప్రజలకు మదన్ చేసే సేవను కూడా చక్కగా చూపించారు. మొత్తానికి తాను అనుకున్నది అనుకున్నట్లు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు.
ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అజ్మల్ అని చెప్పాలి. మదన్ పాత్రలో అజ్మల్ ఒదిగిపోయాడు. తన నటనతో మరోసారి మెప్పించాడు. ప్రేక్షకులు మదన్ పాత్రకు బాగా కనెక్ట్ అవ్వడానికి అజ్మల్ యాక్టింగ్ ప్రధాన కారణం అని చెప్పచ్చు. తర్వాత మదన్ భార్య మాలతి పాత్రలో నటించిన మానస కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఆమె నటన ఎంతో సెటిల్డ్ గా ఉంటుంది. ఇంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక సీరియస్ రాజకీయ నాయకుడి పాత్రలో ధనుంజయ్ ప్రభునే అద్భుతంగా నటించారు. శ్రవణ్ కల్యాణ్ వంటి పాత్రలు చేసిన యాక్టర్స్ కూడా తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇంక టెక్నికల్ వర్క్ విషయానికి వస్తే.. ఆర్జీవీ ఫ్రేమింగ్ గురించి ఎవరూ పేర్లు పెట్టడానికి ఉండదు. కెమెరా వర్క్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ మూవీలో బ్యాగ్రౌండ్ స్కోర్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంటెన్స్ సీన్స్ లో మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా మెప్పిస్తాయి.
చివరిగా: ఆర్జీవీ మరోసారి తన మార్క్ చూపించేశాడు..