Tirupathi Rao
Vijay Antony Love Guru Movie Review & Rating In Telugu: విజయ్ ఆంటోనీ నుంచి మూవీ వస్తోంది అంటే తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. కమర్షియల్ హంగులు మాత్రమే మంచి మెసేజ్ కూడా ఉంటుంది. మరి.. విజయ్ ఆంటోనీ లవ్ గురూ సినిమా ఎలా ఉందో చూద్దాం.
Vijay Antony Love Guru Movie Review & Rating In Telugu: విజయ్ ఆంటోనీ నుంచి మూవీ వస్తోంది అంటే తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. కమర్షియల్ హంగులు మాత్రమే మంచి మెసేజ్ కూడా ఉంటుంది. మరి.. విజయ్ ఆంటోనీ లవ్ గురూ సినిమా ఎలా ఉందో చూద్దాం.
Tirupathi Rao
విజయ్ ఆంటోనీకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తీసిన బిచ్చగాడు సినిమాకి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. విజయ్ ఆంటోనీ సినిమా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటుగా కచ్చితంగా మెసేజ్ ఉంటుంది. అలాంటి హీరో నుంచి మూవీ వస్తోంది అంటే తెలుగు ఆడియన్స్ కూడా అలర్ట్ అయిపోతారు. తాజాగా విజయ్ ఆంటోనీ నటించిన లవ్ గురు అనే సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి.. ఆ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ఆకట్టుకుందా? ఆంటోనీ తన మ్యాజిక్ చేశాడా? తెలియాలంటే ఈ రివ్యూ పూర్తిగా చదివేయండి.
అరవింద్(విజయ్ ఆంటోనీ) పెళ్లి కోసం మలేషియా నుంచి ఇండియాకి వస్తాడు. అయితే అతను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. అయితే కుటుంబంలో ఉండే కొన్ని సమస్యల కారణంగా 35 ఎళ్లు వచ్చినా బ్రహ్మచారిగానే మిగిలిపోతాడు. అయితే అలాంటి అరవింద్ కు తమ రిలేటివ్స్ అమ్మాయి లీలా(మృణాళిని రవి)ని చూసి ప్రేమలో పడతాడు. ఎలాగైనా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. కానీ, లీలా ఆలోచన, ఆశయం, తన గోల్ వేరుగా ఉంటాయి. తనేమో ఒక పెద్ద హీరోయిన్ కావాలని కలలు కంటూ ఉంటుంది. ఎట్టకేలకు కొన్ని అనూహ్య పరిణామాల వల్ల అరవింద్- లీలా వివాహం జరుగుతుంది. మరి.. అరవింద్ కోరుకున్న వైవాహిక జీవితం దక్కుతుందా? లీలాని హీరోయిన్ చేయడానికి అరవింద్ ఎన్ని కష్టాలు పడ్డాడు? హీరోయిన్ అయ్యాక లీలా తన భర్తను, అతని ప్రేమను అర్థం చేసుకుందా? అతని చేరువైందా? అసలు అరవింద్ లైఫ్ ఎన్ని మలుపులు తిరుగుతుంది? అనేదే మిగిలిన కథ.
ఈ మూవీలో డైరెక్టర్ ఎంచుకున్న మెయిన్ పాయింట్ అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమాలో మంచి కాన్ ఫ్లిక్ట్ క్రియేట్ చేసే స్కోప్ కూడా ఉంది. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, తన భార్య కలను నెరవేర్చడం కోసం భర్త కష్ట పడటం, భార్య ప్రేమ కోసం ఎదురుచూడటం అంటే ఎన్నో నాటకీయ పరిణామాలను ఈ పాయింట్ తో క్రియేట్ చేయచ్చు. అలాంటి పాయింట్ ని డైరెక్టర్ బాగానే వాడుకున్నాడు. ఎన్నో ఆశలతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. ఆమె దగ్గరకి రానివ్వకపోతే ఆ భర్త పడే మానసిక క్షోభను విజయ్ ఆంటోనీ చక్కగా పలికించాడు. ఈ మూవీలో అరవింద్ ప్రేమ, హీరోయిన్ కల మాత్రమే కాకుండా వీటికి అదనంగా సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంది. ఈ మూవీకి సిస్టర్ సెంటిమెంట్ అదనపు బలం అనే చెప్పాలి.
ఈ మూవీలో కామెడీ కూడా బాగానే పండింది. వీటీవీ గణేశ్, యోగిబాబు చక్కగా ఫన్ క్రియేట్ చేశారు. అయితే ఈ మూవీకి ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే.. సినిమా చూస్తున్నంత సేపు షారుక్ ఖాన్ నటించిన ‘రబ్ నే బనాదీ జోడీ’ కథ గుర్తొస్తూ ఉంటుంది. కథ, కథనం ఎంత బలంగా ఉన్నా కూడా ఆడియన్ మైండ్ లో బ్యాక్ డ్రాప్ లో షారుక్ సినిమానే తిరుగుతూ ఉంటుంది. అది కాస్త ఈ మూవీకి మైనస్ కిందకు వస్తుంది. అలాగే కథలో ఎంత బలం ఉన్నా కూడా స్క్రీన్ ప్లే మాత్రం కాస్త బలహీనంగా కనిపిస్తుంది. స్క్రీన్ ప్లేపై ఇంకాస్త ప్రత్యేక దృష్టి సారిస్తే బాగుండేది అనే భావన కలుగుతుంది. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక ఆసక్తిని, ఉత్కంఠని కొనసాగించడంలో డైరెక్టర్ విఫలమైనట్లు కనిపిస్తుంది. అలాగే హీరో హీరోయిన్ల మధ్య బలమైన సీన్లు పడలేదనే వెలితి కనిపిస్తుంది. సినిమా నిర్మాణానికి సంబంధించి సీన్స్ పై మరింత శ్రద్ధ వహించి ఉండాల్సింది.
భార్య ప్రేమ కోసం పాకులాడే భర్తగా, ఒక సోదరుడిగా విజయ్ ఆంటోనీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. తన పాత్రకు విజయ్ ఆంటోనీ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. ఎమోషన్, యాక్షన్, ఫన్నీ సీన్స్ లో విజయ్ ఎంతో చక్కగా వేరియేషన్స్ చూపించాడు. హీరోయిన్ అవ్వాలని కలలు కనే యువతిగా, ఇష్టంలేని పెళ్లి చేసుకున్న భార్యగా మృణాళిని రవి పాత్రలో జీవించేసింది. తనకు ఇచ్చిన క్యారెక్టర్ ని ఆమె చక్కగా పండించింది. హీరో మామగా వీటీవీ గణఏశ్ అద్భుతంగా నటించారు. ఆయన ఇప్పుడు తెలుగులో కూడా ఎంతో ఫేమస్ అనే చెప్పాలి. ఆయన అప్పియరెన్స్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. యోగి బాబు పంచులు కూడా బాగానే పేలాయి. ఇళవరసు, తలైవాసల్ విజయ్, శ్రీజ, సుధ వంటి యాక్టర్స్ తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ఈ మూవీకి భరత్ ధనశేఖర్ మ్యూజిక్ బిగ్ అసెట్ అని చెప్పాలి. సాంగ్స్, బీజీఎం ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఫరూక్ జే బాషా సినిమాటోగ్రఫీ ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుంది. హీరోగానే కాకుండా.. విజయ్ ఆంటోనీ ఎడిటర్ గా కూడా ఈ మూవీలో తన మ్యాజిక్ ఏంటో చూపించాడు. ఎడిటర్ గా తన పనితనం అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే ఒక నిర్మాతగా మంచి కమర్షియల్ హంగులు కలిగిన సినిమాని విజయ్ ఆంటోనీ అందిచారనే చెప్పాలి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎక్కడా తగ్గవు. మంచి రిచ్ ఫీల్ ఇస్తుంది.
చివరిగా: ‘లవ్ గురు’ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తుంది.
రేటింగ్: 2.5/5