Siddharth Roy Movie Review And Rating In Telugu: చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా వచ్చిన సిద్ధార్థ్ రాయ్ మూవీ ఎలా ఉందో తెలియాలంటే.. ఈ రివ్యూ చదివేయండి.
Siddharth Roy Movie Review And Rating In Telugu: చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా వచ్చిన సిద్ధార్థ్ రాయ్ మూవీ ఎలా ఉందో తెలియాలంటే.. ఈ రివ్యూ చదివేయండి.
Tirupathi Rao
సాధారణంగా టాలీవుడ్ ప్రేక్షకులు, యువతకు అర్జున్ రెడ్డి సినిమా అంటే ఒక ఎమోషన్. అలాంటి తరహాలో కథలు కనిపించగానే అర్జున్ రెడ్డితో పోలిక పెట్టేస్తారు. మరి.. తాజాగా ఆ ముద్రను అందుకున్న సిద్ధార్థ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి.. ఆ మూవీ ఎలా ఉంది? సిద్ధార్థ్ రాయ్ మెప్పించాడా? నిజాగానే అర్జున్ రెడ్డి తాలూకా కంటెంట్ ఈ మూవీలో ఉందా? చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన దీపక్ సరోజ్.. హీరోగా ప్రేక్షకులను మెప్పించాడా? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మీరు ఈ రివ్యూని పూర్తిగా చదవాల్సిందే.
సిద్ధార్థ్ రాయ్(దీపక్ సరోజ్) ఎంతో తెలివైన కుర్రాడు. ధనవంతుల ఇంట్లో పుట్టిన ఈ జీనియస్ కి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. కన్న తల్లిని దూషించినా కామ్ గా వెళ్లిపోతాడు. ఆకలి, నిద్ర, కోపం, బాధ, కోరికలు, సె*క్స్ ఇవన్నీ అతనికి కేవలం శరీర అవసరాలు మాత్రమే. కానీ, సిద్ధార్థ్ రాయ్ వాటిని అస్సలు లెక్క చేయడు. అలాంటి వాడి జీవితంలోకి ఇందు(తన్వి వేగి) ఎంటర్ అవుతుంది. ఎమోషన్స్ అంటే ఏంటో కూడా తెలియని సిద్ధార్థ రాయ్ మనసుని కదిలించి ప్రేమలో పడేలా చేస్తుంది. ఎమోషన్స్ స్టార్ట్ అయిన తర్వాత సిద్ధార్థ్ రాయ్ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇందు లేనిదే బలకలేను అనే స్థాయికి ఎలా వెళ్తాడు? అంత ప్రాణంగా ప్రేమిస్తుంటే.. ఎందుకు ఇందు దూరం పెడుతుంది? అసలు సిద్ధార్థ్ రాయ్ అలా ఎమోషన్స్ లేకుండా ఎందుకు పెరుగుతాడు? అసలు సిద్ధార్థ్- ఇందు ప్రేమ సక్కెస్ అవుతుందా? అనేదే మిగిలిన కథ.
ట్రైలర్ చూసిన తర్వాత అందరూ అర్జున్ రెడ్డి మూవీతో సిద్ధార్థ్ రాయ్ ని కంపేర్ చేశారు. మేకర్స్ కూడా ఆ మూవీకి తమ కథకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అది నిజమనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ కథ చూస్తుంటే.. రోబో 2.0 కథ గుర్తొస్తుంది. ఆ మూవీలో ఎంతో ప్రతిభావంతమైన రోబో ఫీలింగ్స్ లేకుండా అందరికీ హెల్ప్ చేస్తూ ఉండేది. ఎప్పుడైతే ఆ రోబోకి ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయో.. అప్పటి నుంచే అసలు సిసలైన విధ్వంసం మొదలవుతుంది. ఈ సిద్ధార్థ్ రాయ్ సినిమాలో కూడా దాదాపుగా అలాంటి దాఖలాలే కనిపిస్తాయి. సిద్ధార్థ్ ఎమోషన్స్ ని నమ్మడు.. కేవలం లాజిక్స్ తోనే మాట్లాడతాడు. ఫీలింగ్స్ రాక ముందు సిద్ధార్థ్ ఒక జీనియస్ గా ఉండేవాడు. కానీ, ఎప్పుడైతే ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయో.. ఎప్పుడైతే ఇందు ప్రేమలో పడతాడో.. అప్పుడే పిచ్చివాడిగా మారిపోతాడు.
తన ప్రేమ కోసం ఎక్స్ ట్రీమ్ కి వెళ్తూ ఉంటాడు. అతని పిచ్చి ప్రేమ వల్ల తన జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటాడు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా ల్యాగ్ అనే భావన కలుగుతుంది. సినిమాకి సంబంధించి క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయాలంటే విజువల్స్ ద్వారా చూపించచ్చు.. డైలాగ్స్ ద్వారా కూడా చెప్పచ్చు. కాకపోతే డైలాగ్స్ అనే సరికి కాస్త షార్ట్ అంట్ షార్ప్ గా ఉండాలి. కానీ, ఇక్కడ మాత్రం కాస్త లెక్చర్స్, మోటివేషనల్ స్పీచెస్ వింటున్నాం అనే భావన కలుగుతుంది. దానిపై కాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. కథలో మంచి పాయింట్, ఎమోషన్స్ ఉన్నా కూడా.. అనుకున్నది అనుకున్నట్లు తెర మీదకు తీసుకురావడంలో డైరెక్టర్ నూటికి నూరు శాతం సక్సెస్ కాలేదు అనే అభిప్రాయం కలుగుతుంది. ఫస్టాఫ్ స్టోరీ, ఇంటర్వెల్ బ్యాంగ్ అన్నీ మంచి అభిప్రాయాన్నే కలిగిస్తాయి. కానీ, సెకండాఫ్ లో మాత్రం కాస్త ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది.
ఒక చైల్డ్ ఆర్టిస్టుగా దీపక్ సరోజ్ నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రెండు వేర్వేరు పాత్రల్లో దీపక్ నటన మెప్పిస్తుంది. ఏదైనా ఎక్స్ ట్రీమ్ గా చూపించే సిద్ధార్థ్ క్యారెక్టర్ దీపక్ మంచి పేరే తెచ్చి పెడుతుంది. హీరోయన్ తన్వి నేగి నటన కూడా మెప్పిస్తుంది. ప్రేమ, బాధ, కన్ఫ్యూజన్ కలిగిన అమ్మాయిగా తన్వి అద్భుతంగా నటించింది. కల్యాణి నటరాజన్- మాథ్యూ వర్గీస్ నటన కూడా ఈ మూవీకి మంచి అసెట్ అనే చెప్పాలి. మిగిలిన అన్ని పాత్రలు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
ముఖ్యంగా డైరెక్టర్ టాలెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కథ, కథనం చూశాక డైరెక్టర్ వీ యశస్వీలో కచ్చితంగా మంచి టాలెంట్ ఉందని ఒప్పుకుంటారు. కాకపోతే ఇంకాస్త ఫోకస్డ్ గా ఉండి ఉంటే ఇంకా మంచి అవుట్ పుట్ వచ్చి ఉండేది అనే అభిప్రాయం కలుగుతుంది. రధన్ సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు కూడా పర్వాలేదు అనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది. శ్యామ్ కే నాయుడు కెమెరా పనితనం ప్రేక్షకులను మెప్పిస్తుంది. కాస్త కొత్తదనాన్ని కూడా చూస్తారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక రిచ్ ఫీలింగ్ ని కలిగిస్తాయి.
చివరిగా.. సిద్ధార్థ్ రాయ్ యువతను కొంత వరకు మెప్పించవచ్చు.
రేటింగ్: 2/5