Dhootha Web Series Review: నాగ చైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ ‘దూత’.. ఎలా ఉందంటే?

అక్కినేని నాగ చైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? రివ్యూలో చూద్దాం.

అక్కినేని నాగ చైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? రివ్యూలో చూద్దాం.

దూత

20231201, థ్రిల్లర్,
ఓటీటీ లో
  • నటినటులు:నాగ చైతన్య, పార్వతి తిరువొతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పశుపతి, రవీంద్ర విజయ్, తరుణ్ భాస్కర్
  • దర్శకత్వం:విక్రమ్ కుమార్ కె
  • నిర్మాత:శరత్ మరార్
  • సంగీతం:ఇషాన్ చాబ్రా
  • సినిమాటోగ్రఫీ:మికోలాజ్ సైగులా

Rating

2.5/5

అక్కినేని నాగ చైతన్య తొలిసారి వెబ్ సిరీస్ లో నటించాడు. ఆ సిరీస్ పేరే ‘దూత’. చై తన పంథా మార్చి వెబ్ సిరీస్ లో నటించడం, పైగా దీనికి విక్రమ్ కుమార్.కె దర్శకత్వం వహించడంతో.. ప్రేక్షకుల్లో ఎక్కడా లేని ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. వీరిద్ద కాంబోలో అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం, థ్యాక్యూ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది ‘దూత’. ఈ థ్రిల్లర్ సిరీస్ లో చైతో పాటుగా ప్రియా భవాని శంకర్, పార్వతి తిరువొతు, ప్రాచీ దేశాయ్ నటించారు. మరి తాజాగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ

సాగర్ వర్మ(నాగ చైతన్య) సమాచార్ అనే న్యూస్ పేపర్ కు CEO గా అపాయింట్ అయ్యి.. ఓ పొలిటికల్ లీడర్ కు అనుకూలంగా ఉంటూ వారి నుంచి లాభం పొందుతుంటాడు. కొన్ని ఊహించని పరిణామాలు అతడిని కష్టాల పాలు చేస్తాయి. అతడి లైఫ్ లో ఏం జరుగుతుందో అది ముందుగానే కనపడుతుంది. ఇక సాగర్ వర్మ వెళ్లిన ప్రాంతంలో ఏదో ఒక సంఘటన అతడిని వెంటాడుతూనే ఉంటుంది. వాటి కారణంగా తన కూతురిని కోల్పోతాడు. దీంతో జరిగే సంఘటనలన్నింటికీ కారణం ఎవరో తెలసుకోవాలని పూనుకుంటాడు. మరి ఈ సమస్యలకు కారణం ఎవరు? వాటిని సాగర్ వర్మ ఎలా అధిగమించాడు? జర్నలిస్టుగా అతడు ఏం చేశాడు అన్నదే దూత వెబ్ సిరీస్ కథ.

విశ్లేషణ

నాగచైతన్య వెబ్ సిరీస్ చేస్తున్నాడు అనగానే ప్రేక్షకుల్లో ఎక్కడా లేని ఇంటెన్షన్ క్రియేట్ అయ్యింది. అదీకాక ఈ సిరీస్ కు విక్రమ్ కుమార్ కె డైరెక్టర్ అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. సున్నితమైన కథలను అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ విక్రమ్ ‘దూత’ ట్రైలర్ తోనే ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ కలిగేలా చేశాడు. ఇక దర్శకుడు తన తొలి సినిమా అయిన ’13B’ పంథాలోనే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ను మెుదలు పెట్టిన విధానం బాగుంది. జర్నలిస్టుగా తప్పుడు పనులు చేస్తున్న సాగర్ వర్మ(నాగ చైతన్య)కు ‘దూత’ అనే పేరుతో పేపర్ కటింగ్స్ అతడిని వెంటాడటంతో ఆ తర్వాత ఏం జరుగుతుందో అని ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ ను కలగజేస్తుంది. అన్ని థ్రిల్లర్ సినిమాల్లో లాగే ఈ సిరీస్ కూడా సాగుతూ ఉంటుంది.

కథలో భాగంగా వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. స్లో నెరేషన్ కారణంగా ప్రేక్షకులు కొద్దిగా విసుగుచెందుతారు. స్టోరీని ఫస్ట్ థ్రిల్లర్ జోనర్ లో మెుదలుపెట్టి.. మధ్యలోకి వచ్చేసరికి న్యాచురల్ టచ్ ఇచ్చాడు డైరెక్టర్. క్లైమాక్స్ లో వచ్చే పాత్రలను ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్లకు ముడిపెట్టిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. హారో పాత్రని ఫస్ట్ నుంచి నెగటీవ్ గా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అయితే ఆ పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అయితే సినిమా అయినా.. వెబ్ సిరీస్ అయినా సూపర్ హిట్ అవుతుంది. కానీ దూత విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. క్లైమాక్స్ ప్రేక్షకులను కొద్దిగా నిరుత్సహపరుస్తుంది. ఫైనల్ గా 8 ఎపిసోడ్స్ తో వచ్చిన ‘దూత’ ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో కాస్త తగ్గాడు.

నటీ, నటుల పనితీరు

నాగ చైతన్య తన గత సినిమాలకు పూర్తి భిన్నమైన కథలో నటించి మంచి మార్కులు కొట్టేశాడు. సాగర్ వర్మ అనే జర్నలిస్టు పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఓ వైపు నెగటీవ్ షేడ్స్ మరో వైపు పాజిటీవ్ షేడ్స్ తో మెస్మరైజ్ చేశాడు చై. ఇక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా క్రాంతి పాత్రలో పార్వతి తిరువొతు ఆకట్టుకుంది. ప్రాచీ దేశాయ్ తన పరిధి మేరకు నటించింది. నాగ చైతన్య భార్యగా నటించిన ప్రియా భవాని శంకర్ పర్వాలేదనిపించింది. మిగతావారు కూడా తమ తమ పాత్రలకు నటన పరంగా న్యాయం చేశారు. ఈ సిరీస్ కు సినిమాటోగ్రాఫీ మెయిన్ హైలెట్ అని చెప్పాలి. ఎక్కువ శాతం వర్షంలో సీన్స్ ఉన్నాగానీ.. వాటిని బాగా తీశాడు కెమెరామెన్ మికోలాజ్ సైగులా. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ దూతకు ప్లస్ పాయింట్. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా ఎక్కడా తగ్గలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదునుపెట్టాల్సి ఉంది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ కథనాల్లో ఇంకాస్త గ్రిప్ ను యాడ్ చేస్తే బాగుండేది.

ప్లస్ పాయింట్స్

  • నాగ చైతన్య యాక్టింగ్
  •  కథనం
  • సినిమాటోగ్రఫీ
  • బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్

  • స్లో నెరేషన్
  • ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు
( గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
Show comments