Mechanic Rocky Movie Review: మెకానిక్ రాకీ సినిమా రివ్యూ!

Mechanic Rocky Movie Review & Rating In Telugu: విశ్వక్ సేన్ సినిమా వస్తోంది అంటే యువత అలర్ట్ అయిపోతుంది. విశ్వక్ స్క్రీన్ మీద చూపించే ఎనర్జీ అలా ఉంటుంది. అలాంటి యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నుంచి మెకానిక్ రాకీ అని కొత్త సినిమా వచ్చింది. మరి.. ఆ మూవీ ఎలా ఉందో తెలియాలి అంటే ఈ రివ్యూ చూసేయండి.

Mechanic Rocky Movie Review & Rating In Telugu: విశ్వక్ సేన్ సినిమా వస్తోంది అంటే యువత అలర్ట్ అయిపోతుంది. విశ్వక్ స్క్రీన్ మీద చూపించే ఎనర్జీ అలా ఉంటుంది. అలాంటి యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నుంచి మెకానిక్ రాకీ అని కొత్త సినిమా వచ్చింది. మరి.. ఆ మూవీ ఎలా ఉందో తెలియాలి అంటే ఈ రివ్యూ చూసేయండి.

మెకానిక్ రాకీ

22/11/2024, యాక్షన్ డ్రామా, 2h 36m U/A
U/A
  • నటినటులు:విశ్వక్ సేన్, నరేశ్, శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి, తదితరులు
  • దర్శకత్వం:రవితేజ ముళ్లపూడి
  • నిర్మాత:రామ్ తాళ్లూరి
  • సంగీతం:జేక్స్ బెజోయ్
  • సినిమాటోగ్రఫీ:మనోజ్ రెడ్డి

Rating

2.5

విశ్వ‌క్‌ సేన్ సినిమాలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. విశ్వక్ ఎంపిక చేసుకునే కథలు ఆ థ్రిల్ ని ఇస్తుంటాయి. తక్కువ కాలంలో తనకంటూ ఒక ఇమేజ్ రావడానికి ఈ సబ్జెక్టు సెలక్షన్ ముఖ్య కారణం. ఇక తాజాగా.. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. మీనాక్షి చౌద‌రి, శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ ఏ లెవల్లో ఎంగేజ్ చేస్తుందో.. ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ:

రాకేష్ అలియాస్ రాకీ (విశ్వ‌క్‌సేన్‌) బీటెక్‌ డ్రాప్ అవుట్ స్టూడెంట్. కాలేజీలో ఉండగా తను ప్రియా (మీనాక్షి చౌద‌రి)ని ప్రేమిస్తాడు. తరువాత తన తండ్రి (న‌రేష్‌) గ్యారేజెలో మెకానిక్‌గా ప‌నిచేస్తూ, డ్రైవింగ్ పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో రాకీ గ్యారేజీ స్థ‌లాన్ని కొట్టేయడానికి రంకిరెడ్డి (సునీల్‌) రంగంలోకి దిగుతాడు. ఈ వివాదం నడుస్తుండగానే రాకీ తండ్రి కూడా చనిపోతాడు. ఇక తన గ్యారేజ్ కాపాడుకోవడానికి రాకీకి యాభై ల‌క్ష‌లు అవ‌స‌ర‌మ‌వుతాయి. రాకీ తండ్రి చనిపోయాక.. ఇన్సూరెన్స్ డబ్బులు రూ.2 కోట్లు రావడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో మాయ (శ్ర‌ద్ధా శ్రీనాథ్‌) రాకీకి అండగా నిలుస్తుంది. కానీ.., ఆ సాయం నుండే రాకీకి ఇంకాస్త సమస్యలు పెరుగుతాయి. అసలు.. ఈ మాయ ఎవరు? ఆమె ఎందుకు రాకీకి సాయం చేయడానికి ముందుకి వస్తుంది? రాకీ తన గ్యారేజ్ ని ఎలా దక్కించుకున్నాడు? అసలు ప్రియ ఏమైపోయింది? ఆమె కోసం రాకీ ఏమి చేశాడు అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ:

చెప్పేది 7 చేపల కథ అయినప్పుడు.. అనగనగా ఒకరాజు, ఆ రాజుకి ఏడుగురు కొడుకులు అనే మొదలు పెట్టాలి. అలా కాకుండా.., 7 చేపల రకాలు ఏంటి అనేది చెప్పుకుంటూ పోతే చంటోడు ఒప్పుకోడు. నిద్ర అసలే పోడు. సినిమా కథకి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. ఓ మంచి పాయింట్ తో కథ రాసుకుని, స్క్రీన్ ప్లే మాత్రం ఆ పాయింట్ తో అసలు ఎలాంటి సంబంధం లేకుండా, ఎలాంటి ఇంటర్ లింక్స్ అసలే లేకుండా నడిపిస్తా అంటే ఆడియన్స్ ఓపిగ్గా కూర్చోవడం కష్టం అయిపోతుంది. ఇప్పుడు మెకానిక్ రాకీ విషయంలో కూడా ఇదే జరిగింది.

మెకానిక్ రాకీ ఫస్ట్ హాఫ్ ఎక్కడ మొదలవుద్దో, అక్కడ నుండి ఎటు పొద్దో, ఎలా ముగుస్తుందో సామాన్య ప్రేక్షకులకి అంత ఈజీగా అర్ధం కాదు. అలా అని ఏదో.. సూపర్ థ్రిల్లర్ మూవీస్ లాంటి స్క్రీన్ ప్లే గాని, సీన్స్ గాని ఉండవు. అతి సాధారణ తెలుగు సినిమా ట్రీట్మెంట్ తోనే మూవీ సాగుతూ ఉంటుంది. కానీ.., అంత కన్ఫ్యూజన్ దేనికి అంటే స్క్రీన్ ప్లే అంత గందరగోళంగా మారింది. కాకపోతే.. విశ్వక్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ, యాక్టింగ్ సినిమాకి కాస్త స్పార్క్స్ అద్దాయి. మధ్యలో తండ్రీకొడుకులు మధ్య జరిగే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఈ రెండు తప్పించి సినిమాలో పెద్దగా మెరుపులు లేవు. కాకపోతే.. హీరో ఫాదర్ చనిపోయిన దగ్గర నుండి కథలో కాస్త స్పీడ్ పెరుగుతుంది. ఇక అదే ఫ్లోలో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ వర్కౌట్ అయ్యింది.

మెకానిక్ రాకీ కథలోని బలం అంతా సెకండ్ ఆఫ్ లోనే ఉంది. సెకండ్ ఆఫ్ మొదలయ్యాక వచ్చే ట్విస్ట్ లు బాగా ఆకట్టుకుంటాయి. ఇప్పటి వరకు మనం చూసిన సినిమా ఇదేనా అనిపించేలా స్క్రీన్ ప్లే మారిపోద్ది. ముఖ్యంగా క్యారెక్టర్స్ బిహేవియర్స్ థ్రిల్ కలిగిస్తాయి. అతి పెద్ద ట్విస్ట్ రివీల్ అయ్యాక కూడా ప్రీ క్లైమ్యాక్స్ వరకు ఆ ఎంగేజ్ తగ్గకుండా దర్శకుడు బాగా జాగ్రత్త తీసుకున్నాడు. ఓ అరగంట పాటు.. బాలీవుడ్ రేస్ మూవీ సీక్వెల్ చూస్తున్నామా అన్నంత హై వస్తుంది. ఇక క్లయిమ్యాక్స్ మాత్రం సాధారణంగానే ముగియడం విశేషం. ఇక్కడ కూడా విశ్వక్ మాస్ అప్పీల్ బాగా ప్లస్ అయింది.

నటీనటుల పనితీరు :

విశ్వక్ సేన్ నటుడిగా ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిపోయాడు. స్టార్ గా తనకు తగ్గ మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే టైర్-2 లో ఇప్పుడు అతను టాప్ పొజిషన్ లో ఉన్నాడు. అలాంటి స్టార్ కి, ఇలాంటి కథ అస్సలు నప్పలేదు. అక్కడ విశ్వక్ కొత్తగా చేయడానికి ఏమి లేదు. కాకపోతే.. ఇలాంటి క్యారెక్టర్ లో కూడా విశ్వక్ సేన్ మెరుపులు చూపించాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్రెజన్స్ అదిరిపోయింది. ఇక నటుడిగా ఇప్పటి వరకు విశ్వక్ ఫ్లాప్ అయ్యిందే లేదు. ఇప్పుడు కూడా ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. విశ్వక్ తరువాత ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ శ్రద్దా శ్రీనాథ్. మాయ పాత్రలో నిజంగా మాయ చేసి పడేసింది. కానీ.., మీనాక్షి నటనలో మాత్రం ఎలాంటి స్పార్క్స్ కనిపించలేదు. ఆఖరికి.. లుక్ పరంగా కూడా ఆకట్టుకోలేదు. ఇక సునీల్, నరేష్, వైవా హర్ష ఆకట్టుకున్నారు.

ఇక టెక్నీకల్ గా మాత్రం ఆర్ట్ వర్క్ అదిరిపోయింది. అదే స్థాయిలో సినిమాటోగ్రఫీ కూడా కుదరడం మెకానిక్ రాకీకి కలిసి వచ్చింది. మ్యూజిక్ గురించి, సాంగ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. స్క్రీన్ ప్లే ఆర్డర్ మార్చడానికి గాని, మార్పించడానికి గాని ఎడిటర్ ఇంకాస్త ప్రయత్నించి ఉంటే బాగుండేది. ఇక్కడే సినిమాకి.. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ కి పెద్ద అన్యాయం జరిగింది. దర్శకుడు రవితేజ మేకర్ గా ఓకే అనిపంచుకున్నాడు. కానీ.., రైటింగ్ విషయంలో ఇంకాస్త మెరుగు పడాల్సిన అవసరం ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ లు:

  • విశ్వక్ సేన్
  • శ్రద్దా శ్రీనాథ్
  • సెకండ్ ఆఫ్

మైనస్ లు:

  • ఫస్ట్ ఆఫ్
  • స్క్రీన్ ప్లే
  • మీనాక్షి

రేటింగ్: 2.5/5

చివరి మాట: మెకానిక్ రాకీ.. ఫస్ట్ హాఫ్ అడ్డంకి

(*ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
Show comments