Maruthi Nagar Subramanyam Review and Rating in Telugu: ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్ కీలక పాత్రలో నటించిన మూవీ మారుతీనగర్ సుబ్రమణ్యం. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? హీరోగా రావు రమేశ్ మెప్పించాడా? ఈ రివ్యూలో చూద్దాం.
Maruthi Nagar Subramanyam Review and Rating in Telugu: ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్ కీలక పాత్రలో నటించిన మూవీ మారుతీనగర్ సుబ్రమణ్యం. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? హీరోగా రావు రమేశ్ మెప్పించాడా? ఈ రివ్యూలో చూద్దాం.
Somesekhar
టాలీవుడ్ లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రావు రమేశ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఓ వైపు విలన్ గా చేస్తూనే, మరోవైపు హీరో, హీరోయిన్ లకు తండ్రి పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు. అలాంటి రావు రమేశ్ ను లీడ్ రోల్ లో పెట్టి తీసిన సినిమానే ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’. అందరూ దీన్ని చిన్న సినిమాగానే అనుకున్నారు. కానీ సుకుమార్ భార్య నిర్మాతల్లో ఒకరు కావడం, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్ గా రావడంతో.. సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా(ఆగస్ట్ 23)న రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉంది? రావు రమేశ్ మెప్పించాడా? ఈ రివ్యూలో చూద్దాం.
సుబ్రమణ్యం(రావు రమేశ్) మారుతీనగర్ లో తన కుటుంబంతో కలిసి ఉంటాడు. ఇతడికి 1998లో టీజర్ జాబ్ వస్తుంది. కానీ కోర్టులో స్టే ఉండటం చేత అది కాస్త హోల్డ్ లో ఉండిపోతుంది. దాంతో చేస్తే ప్రభుత్వ ఉద్యోగమే చేస్తానని, ఏ పని చేయకుండా ఖాళీగా ఇంట్లోనే ఉంటాడు. ఇక సుబ్రమణ్యం భార్య కళావతి(ఇంద్రజ) ప్రభుత్వ ఆఫీస్ లో క్లర్క్ గా పనిచేస్తుంటుంది. వీళ్ల కొడుకు అర్జున్(అంకిత్ కొయ్య). అప్పులతో కుటుంబాన్ని వెళ్లదీస్తూ వస్తున్న సుబ్రమణ్యం అకౌంట్ లో రూ. 10 లక్షలు పడతాయి. అసలు అంత డబ్బు ఎవరు వేశారు? చివరికి అతడికి టీచర్ జాబ్ వచ్చిందా? రాలేదా? అన్నదే మిగతా కథ.
మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీని పూర్తిగా కామెడీ మీద ఆధారంగానే తెరకెక్కించినట్లు మూవీ టీమ్ ప్రమోషన్స్ లోనే చెప్పుకుంటూ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే సినిమా కూడా ఉంది. సుబ్రమణ్యం క్యారెక్టర్ ఎలాంటిది? వారి కుటుంబ పరిస్థితులు ఎలాంటివి? అని చెబుతూనే డైరెక్టర్ కథలోకి తీసుకెళ్లాడు. అయితే కథకు తగ్గట్లుగా కామెడీ సీన్లతో కాసేపు ప్రేక్షకులను నవ్వించాడు. కానీ అక్కడక్కడ కొన్ని సీన్లు లాజికల్ గా వర్కౌట్ కాలేదు. అయితే రూ. 10 లక్షలు సుబ్రమణ్యం అకౌంట్ లోకి ఎలా వచ్చాయి అనే చిన్న పాయింట్ తీసుకుని, దాన్ని చివరి వరకు తీసుకొచ్చిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఒకేసారి పది లక్షల డబ్బు వచ్చి అకౌంట్ లో పడితే.. ఆ వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుంది? అతడి తీరు ఎలా మారిపోతుంది? అన్న విషయాలు చాలా బాగా చూపించాడు. ఇక అర్జున్-కాంచన లవ్ సీన్లు సినిమాటిక్ గా డిజైన్ చేసి, ప్రేక్షకులకు బోర్ కొట్టించాడు. కథ ప్రేక్షకుల ఊహకు తగ్గట్లుగా సాగినా.. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నాడు డైరెక్టర్. అక్కడక్కడ కొన్ని లాజిక్ లెస్ సీన్లు తప్పితే ఓవరాల్ గా ఈ మూవీ సరదాగా చూసి నవ్వుకోవచ్చు.
సుబ్రమణ్యం పాత్రలో రావు రమేశ్ ను తప్ప ఇంకోకరిని ఊహించుకోలేము. అంతలా ఆ పాత్రలో జీవించేశాడు. తన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేశాడు. ఇక కళావతిగా ఇంద్రజ కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికీ ఆకట్టుకుంది. అర్జున్, రమ్య పసుపులేటి తమ నటనతో మెప్పించారు. ఇక మిగతావారిలో ప్రవీణ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ విభాగానికి వస్తే.. మూవీని కలర్ ఫుల్ గా చూపించడంలో కెమెరా మెన్ MN బాల్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. కళ్యాణ్ నాయక్ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి. ఇక చివరిగా డైరెక్టర్ లక్ష్మణ్ దగ్గరికి వస్తే.. సింపుల్ కథను తీసుకున్నా గానీ.. తనదైన రైటింగ్ తో టేకింగ్ తో ఆకట్టుకున్నాడు.
చివరి మాట: మారుతీనగర్ సుబ్రమణ్యం హాయిగా నవ్వుకోవడానికి ఓ మంచి ఆప్షన్.
రేటింగ్: 2.5/5