Nabha Natesh Darling Movie Review And Rating In Telugu: నభా నటేష్- ప్రియదర్శి జంటగా డార్లింగ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి.. ఈ లేడీ అపరిచితుడు తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించింది? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
Nabha Natesh Darling Movie Review And Rating In Telugu: నభా నటేష్- ప్రియదర్శి జంటగా డార్లింగ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి.. ఈ లేడీ అపరిచితుడు తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించింది? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
Tirupathi Rao
ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులు డార్లింగ్ అనే సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే విక్రమ్ ని అపరిచితుడుగా చూశారు. మళ్లీ ఇంత కాలం తర్వాత ఒక లేడీ అపరిచితుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అసలు ఆ మూవీ కథ ఏంటి? ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి.. ఉత్సుకత అయితే తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. అందరూ ఎదురుచూస్తున్న డార్లింగ్ సినిమా థియేటర్లలోకి రానే వచ్చింది. జులై 19 విడుదలవుతున్న ఈ చిత్రానికి సంబంధించి 18న సాయంత్రమే స్పెషల్ షో వేశారు. మరి.. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ డార్లింగ్ సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
రాఘవ్ (ప్రియ దర్శి) చిన్ననాటి నుండి పెళ్లి, భార్య, హనీమూన్ అంటూ కలలు కంటూ ఉంటాడు. అందుకోసమే కష్టపడి చదివి లైఫ్ లో సెటిల్ అవుతాడు. అలాంటి రాఘవ్ పెళ్లి.. పీటలపైనే ఆగిపోతుంది. ఇక జీవితంపై విరక్తి చెందిన రాఘవ్ చనిపోవడానికి సిద్ధం అవుతాడు. అలాంటి సమయంలో అతని జీవితంలోకి ఆనంది (నభా నటేష్) వస్తుంది. అయితే ఆమెకు మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది. అలాంటి అరుదైన లక్షణం ఉన్న ఆనందీ కారణంగా రాఘవ్ లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేదే మిగిలిన కథ.
హీరోయిన్ కి స్ప్లిట్ పర్సనాలిటీ, అందులో నుండి వచ్చే కామెడీ నిజంగా ఎంగేజ్ చేసే కంటెంట్. అయితే.. ఇంత మంచి పాయింట్ పెట్టుకుని డార్లింగ్ డైరెక్టర్ కథలోకి రావడానికి చాలా సమయం తీసుకున్నాడు. కథ అంతా హీరోయిన్ క్యారెక్టర్ చుట్టూ రాసుకుని, హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ కోసం మొదటి గంట వాడుకోవడం ఈ సినిమాకి ప్రధానమైన మైనస్. ఇక హీరోయిన్ క్యారెక్టర్ లో ఉన్న మెయిన్ పాయింట్ రివీల్ అయ్యాక.. కథలో వేగం పెరిగింది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగా పేలింది. కానీ.., మొదటి గంటలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
డార్లింగ్ సెకండ్ హాఫ్ టేకాఫ్ అద్భుతంగా జరిగింది. హీరోయిన్ క్యారెక్టర్ లో ఉన్న డెప్త్ బాగా ప్రెజెంట్ చేశారు. ఇక ఇక్కడ నుండి సబ్జెక్టు ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ఇక్కడ అక్కడక్కడ కామెడి కూడా బాగా వర్కౌట్ అయ్యింది. కాకపోతే.. సెకండ్ హాఫ్ మొత్తం ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉండటంతో సినిమా పడుతూ, లేస్తూ సాగుతుంది. ఇక క్లైమాక్స్ కూడా అంతగా కిక్ ఇవ్వక పోవడంతో డార్లింగ్ మూవీ సాధారణ సినిమాగా మిగిలి పోయింది.
ఈ సినిమా మొత్తం నభా నటేష్ చేసిన ఆనంది పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ని ప్లే చేయడంలో నభా నటేష్ సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పచ్చు. డార్లింగ్ సినిమాలో ఆనందిగా నభా నటేష్ తన కెరీర్ బెస్ట్ ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఇది ఆమె కెరీర్ లోనే ది బెస్ట్ రోల్ అవుతుంది. ఇంక ప్రియదర్శి యాక్టింగ్ స్కిల్స్, కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కూడా ప్రియదర్శి తన బెస్ట్ ఇచ్చేశాడు. ఇంక ఈ సినిమాలో ఉన్న పాత్రలు కూడా వారి ప్రాధాన్యతకు తగినట్లుగా నటించి మెప్పించారు.
డార్లింగ్ సినిమా టెక్నికల్ విభాగం గురించి మాట్లాడుకోవాలి అంటే.. ప్రొడక్షన్ వ్యాల్యూస్ పరంగా ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. నిర్మాణ విలువుల ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఇంక ఈ సినిమాకి బిగ్ అసెట్ సినిమాటోగ్రఫీ అనే చెప్పాలి. నరేశ్ రామదురాయ్ కెమెరా పనితనం ప్రేక్షకులను మెప్పిస్తుంది. కానీ, వివేక్ సాగర్ మ్యూజిక్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇంక కెప్టెన్ ఆఫ్ ది షిప్.. డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి అంటే.. ఇంత మంచి కథ రాసుకున్న డెరైక్టర్ కథనంలో మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచాడు.
చివరి మాట: డార్లింగ్ మూవీ.. కాస్త బోర్.. ఇంకాస్త బెటర్
రేటింగ్: 2.25/5