Raj Tarun Bhale Unnade Movie Review: యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా భలే ఉన్నాడే మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం.
Raj Tarun Bhale Unnade Movie Review: యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా భలే ఉన్నాడే మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం.
Somesekhar
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గత కొంత కాలంగా పర్సనల్ లైఫ్ లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఇక పర్సనల్ లైప్ ను పక్కనపెడితే.. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే తిరగబడరా సామీ, పురుషోత్తముడు సినిమాలతో థియేటర్లలో సందడి చేశాడు. అయితే ఆ మూవీస్ ఆశించిన ఫలితాను ఇవ్వలేదు. తాజాగా ‘భలే ఉన్నాడే’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. రాజ్ తరుణ్, మనీషా కందుకూర్ జంటగా శివ సాయి వర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? లాంగ్ గ్యాప్ తర్వాత రాజ్ తరుణ్ హిట్ కొట్టాడా? లేడా? అన్నది ఈ రివ్యూలో చూద్దాం.
రాధ(రాజ్ తరుణ్) పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు శారీలు కడుతూ.. శారీ డ్రాపర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇక అతడి తల్లి గౌరి(అభిరామి) బ్యాంక్ లో పనిచేస్తుంది. అదే బ్యాంక్ లో కృష్ణ(మనీషా కందుకూర్) జాయిన్ అవుతుంది. రాధ చేసే వంట నచ్చడంతో కృష్ణ, గౌరికి దగ్గర అవుతుంది. రాధను చూడకుండానే అతడితో ప్రేమలో పడిపోతుంది. అయితే తన తల్లి ద్వారా అనుకోకుండా ఇద్దరు కలుస్తారు. ఆ తర్వాత ప్రేమించుకుని నిశ్చితార్థం చేసుకుంటారు. ఈ వేడుకలో కృష్ణ ఫ్రెండ్ వచ్చి తన భర్త సంసారానికి పనికి రాడని, అతడికి విడాకులు ఇస్తున్నట్లు, రాధ కూడా అమ్మాయిలకు దూరంగా ఉంటాడు ఒకసారి ఆలోచించు అని కృష్ణకు చెబుతుంది. దాంతో రాధ కూడా సంసారానికి పనికిరాడేమో అన్న అనుమానం కలుగుతుంది. దానికోసం ఓ ఆశ్రమానికి అతడిని తీసుకెళ్తుంది. ఆశ్రమంలో ఏం జరిగింది? రాధ నిజంగానే సంసారానికి పనికిరాడా? అసలు అతడు అమ్మాయిలకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు? చివరికి వీరి పెళ్లి జరిగిందా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
డైరెక్టర్ శివ సాయి వర్థన్ తాను ఎంచుకున్న పాయింట్ తోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఈ రోజుల్లో ఎలాంటి అలవాట్లు లేకుండా మంచిగా ఉండే అబ్బాయిలను అసలు వీడు అబ్బాయేనా? అని అనుమానంగా చూస్తున్నారు. ఈ పాయింట్ తోనే డైరెక్టర్ కథను రాసుకున్నాడు. ఇక దానికి తగ్గట్లుగా కామెడీని యాడ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లో రాధ, కృష్ణల పరిచయం, వారు ప్రేమలో పడటాన్ని కామెడీగా చూపించాడు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్డకుండా కథను నడిపించాడు. ఇక సెకండాఫ్ కు వచ్చే సరికి కాస్త ఎమోషనల్ టచ్ ను యాడ్ చేస్తూ.. ఆడియెన్స్ ను భావోద్వేగానికి గురిచేసే ప్రయత్నం చేశాడు. రాధ తల్లి కథతో ఎమోషనల్ ను పండించాడు. సెకండాఫ్ లో రచ్చ రవి చేసిన కొన్ని క్రింజ్ సీన్స్, కొంత సాగదీత ప్రేక్షకులకు కొంత బోర్ కొట్టిస్తాయి. ఇక ఆశ్రమంలోకి వెళ్లిన తర్వాత కొన్ని సీన్లు నవ్విస్తాయి, మరికొన్ని క్రింజ్ గా అనిపిస్తాయి. సింగీతం శ్రీనివాస్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మదర్ సెంటిమెంట్ కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. రాజ్ తరుణ్ సైతం ప్రీ క్లైమాక్స్ లో ఎమోషనల్ టచ్ తో ఆడియెన్స్ కు సర్ప్రైజ్ ఇస్తాడు. మెుత్తానికి భలే ఉన్నాడు సినిమా సరదా సరదాగానే ఎమోషనల్ కు గురిచేస్తుంది.
రాధ పాత్రలో రాజ్ తరుణ్ ఒదిగిపోయాడు. చాలా కాలం తర్వాత బెస్ట్ ఇచ్చాడు. శారీ డ్రాపర్ పాత్రలో ఆకట్టుకున్నాడు. వందకు వంద శాతం తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక కృష్ణ గా మనీషా కందుకూర్ తన నటన, అందంతో మెస్మరైజ్ చేసింది. తల్లిగా ఒకప్పటి హీరోయిన్ అభిరామి అదరగొట్టేసింది. అతిథి పాత్రలో సింగీతం శ్రీనివాస్, లీలా శ్యాంసన్ అలరించారు. హైపర్ ఆది, వీటీవీ గణేష్, సుదర్శన్ నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. మిగతా వారు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. కెమెరా పనితం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్ కొత్తగా, వినసొంపుగా ఉన్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి. నిర్మాత కిరణ్ కుమార్ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్లు సినిమా చూస్తే తెలుస్తుంది. ఇక తొలి సినిమాతోనే డైరెక్టర్ శివ సాయి వర్ధన్ సక్సెస్ అయ్యాడు. సింపుల్ కథను ఫ్రెష్ స్క్రీన్ ప్లేతో కొత్తగా చూపించాడు.