Animal Movie Review & Rating in Telugu: ప్రస్తుతం సినిమా అభిమానులు అంతా మాట్లాడుకుంటోంది అనిమా మూవీ గురించే. మరి.. సందీప్ రెడ్డి వంగా నుంచి దాదాపు నాలుగేళ్ల తర్వాత వచ్చిన అనిమల్ సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
Animal Movie Review & Rating in Telugu: ప్రస్తుతం సినిమా అభిమానులు అంతా మాట్లాడుకుంటోంది అనిమా మూవీ గురించే. మరి.. సందీప్ రెడ్డి వంగా నుంచి దాదాపు నాలుగేళ్ల తర్వాత వచ్చిన అనిమల్ సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
Tirupathi Rao
సందీప్ రెడ్డి వంగా నుంచి సినిమా వస్తోందంటే అందరిలో ఒక అటెన్షన్ వచ్చేస్తుంది. తీసింది ఒకటే సినిమా(కబీరి సింగ్ కూడా అర్జున్ రెడ్డి కాబట్టి) కానీ, సినిమా లవర్స్ మదిలో సందీప్ రెడ్డి వంగా సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఒక సినిమా గురించి చర్చించుకోవడం మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా డిబేట్లు కూడా జరిగాయి. అలాంటి ఒక సినిమా దర్శకుడి నుంచి దాదాపు నాలుగేళ్ల తర్వాత ఒక సినిమా వస్తోందంటే.. ఆడియన్స్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. మరి.. అంత గ్యాప్ తర్వాత సందీప్ రెడ్డి వంగా నుంచి వచ్చిన అనిమల్ సినిమా ఎలా ఉందో తెలియాలంటీ ఈ రివ్యూని పూర్తిగా చదివేయండి.
ఇది చాలా సింపుల్ కథ. ఎక్కడా కూడా ఎలాంటి తికమకలు, దాపరికాలు ఏం ఉండవు. ఇది ఒక కంప్లీట్ లవ్ స్టోరీ. అయితే అబ్బాయి, అమ్మాయి మధ్య నడిచే సో కాల్డ్ లవ్ కాదు ఇది. ఈ సినిమా మొత్తం ఒక తండ్రీకొడుకుల మధ్య జరిగే ప్యూర్ లవ్ స్టోరీ. తండ్రి బల్బీర్ సింగ్(అనిల్ కపూర్)ని ఎంతగానో ప్రేమించే కొడుకు రణ్ విజయ్ సింగ్ బల్బీర్(రణ్ బీర్ కపూర్). తండ్రికి బిజినెస్, వర్క్, ఎంపైర్ అంటూ క్షణం కూడా తీరకలేకుండా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు. కన్న కొడుకుని దగ్గరకు తీసుకుని ఏరా ఎలా చదువుతున్నావ్? ఏం చదువుతున్నావ్? అసలు ఎక్కడ చదువుతున్నావ్? అని అడిగే సమయం కూడా ఉండదు. కానీ, కొడుకు కంప్లీట్ డిఫరెంట్. తండ్రి పేరు చెప్పగానే ఏం పని చేస్తున్నాను? ఎక్కడ ఉన్నాను? ఏ పరిస్థితుల్లో ఉన్నాను? అని కూడా చూడడు. పరిగెత్తుకు వెళ్లిపోతాడు. మరి.. ఆ తండ్రికి తన కొడుకు ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? అసలు తెలుస్తుందా.. లేదా? అనేది కథ. ఈ స్టోరీలో అడిషనల్ గా కొన్ని లేయర్స్ ఉంటాయి. అవే లవ్, మ్యారేజ్, కిడ్స్, ఎనిమీ, పోరాటాలు, రివేంజ్ అంటూ కొన్ని లేయర్స్ తో ఒక కంప్లీట్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగా.
ఈ సినిమా చూస్తున్నంతసేపు మీరు సందీప్ ప్రంపంచంలోకి వెళ్లిపోతారు. ఒక సీన్ ని ఎలా చూపించాలనేది.. ఒక ఆడియన్ గా సినిమాని తన మైండ్ లో ఊహించుకుని.. ఆ తర్వాతే తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. మీరు ఈ సినిమాకి వెళ్లే సమయంలో అర్జున్ రెడ్డి మూవీని ఊహించుకుని వెళ్లే అవకాశం ఉంది. నిజానికి సందీప్ విజన్ కి అర్జున్ రెడ్డి అనేది ఒక ట్రైలర్ మాత్రమే. కానీ, అనిమల్ మాత్రం సందీప్ రెడ్డి విశ్వరూపం అనే చెప్పాలి. మీరు సినిమా చూస్తున్నంతసేపు దాదాపు సీటు అంచునే కూర్చుని ఉంటారు. ఎక్కడా కూడా ఆడియన్ దృష్టిని, ప్రేక్షకుడి అటెన్షన్ ని పక్కకు పోనివ్వకుండా 3 గంటల 21 నిమిషాల 23 సెకన్ల 16 ఫ్రేములు థియేటర్లో మిమ్మల్ని కట్టి పడేస్తాడు. ప్రతి సీన్లో మీకు ఒక పర్ఫెక్షన్ కనిపిస్తుంది. స్టోరీని కూడా ఎంతో పకడ్బందీగా రాసుకున్నాడు. అంతే కట్టుదిట్టంగా తెరకెక్కించాడు. సినిమా ఓపెనింగ్ సీన్ నుంచి ఎండ్ టైటిల్స్ పడి స్క్రీన్ ఆఫ్ అయ్యే వరకు మీ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా మూవీని తెరకెక్కించారు.
ఈ మూవీ మీకు అర్థమయ్యినట్లే ఉంటుంది.. కానీ, చివర్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమాకి అనిమల్ సినిమాకి ఒక కంపారిజన్ ఉంటుంది. అదేంటంటే సందీప్ రెడ్డి వంగా హీరో క్యారెక్టరైజేషన్ సిమిలర్ గా అనిపిస్తుంది. అర్జున్ రెడ్డి దేశ్ ముఖ్ లాగానే రణ్ విజయ్ సింగ్ బల్బీర్ కి కూడా అన్ని ఎమోషన్స్ ఎక్స్ ట్రీమ్ గానే ఉంటాయి. ప్రేమ, బాధ, ఆనందం, కోపం, పగ అన్నీ ఎక్కువగానే ఉంటాయి. ఆ అన్ని ఎమోషన్స్ ఎలా చూపిస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారో అలాగే చూపించారు. తండ్రిపై ఉన్న ప్రేమతో ఒక కొడుకు ఏమైనా చేస్తాడు.. చేయగలడు అనే విషయాన్ని అందరూ కన్విన్స్ అయ్యే వేలో తెరకెక్కించారు. అయితే ఇందులో ప్రేమ, తండ్రీకొడుకుల బంధం మాత్రమే కాదు.. అన్నదమ్ముల అనుబంధం కూడా ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో డైలాగ్స్ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఈ లవ్ స్టోరీలో మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడానికి కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా ట్రైలర్ లో హైలెట్ చేసిన హోటల్ ఫైట్ సీక్వెన్స్ అందరినీ కళ్లు అప్పగించి చూసేలా చేస్తుంది. ప్రతి ఎమోషన్ ని ఈ సినిమాలో టచ్ చేశారు. అది కూడా ఒక పర్ఫెక్ట్ వేలో ప్రెజెంట్ చేశారు.
ఈ సినిమాకి రణ్ బీర్ కపూర్ ఒక పెద్ద అసెట్ అనే చెప్పాలి. సందీప్ కి రణ్ బీర్ మీద ఎందుకు అంత నమ్మకం అనే విషయం మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇందులో ఉన్న ప్రతి ఎమోషన్ ని రణ్ బీర్ కపూర్ పర్ఫెక్ట్ గా డెలివర్ చేశాడు. కామెడీ, యాక్షన్, లవ్, రివేంజ్ ఇలా అన్ని సీన్స్ లో తన వందశాతాన్ని ఇచ్చాడు. ఇంక రణ్ బీర్ తర్వాత చెప్పుకోవాల్సింది అనీల్ కపూర్ గురించే. ఆయన నటన గురించి ఇప్పుడు మనం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ, ఒక తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయారనే చెప్పాలి. తర్వాత మీకు గుర్తుండిపోయే క్యారెక్టర్ గీతాంజలి(రష్మిక) ఒక అనిమల్ లాంటి భర్తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే పాత్రలో రష్మిక మందన్నా పరకాయ ప్రవేశం చేసింది. ఇంక విలన్ పాత్రలో నటించి బాబీ డియోల్ ఎప్పటిలాగానే మెప్పిస్తాడు. ఈ సినిమాలో ఇంకా చాలా పాత్రలు ఉంటాయి. ముఖయంగా రణ్ బీర్ కపూర్ చుట్టూ ఉండే తన బాడీ గార్డ్స్(అలా అంటే విజయ్ కి నచ్చదు. వాళ్లు తన అన్నయ్యలు) పాత్రల్లో చేసిన ప్రతి ఒక్కరు మెప్పిస్తారు. ఏ పాత్ర కూడా ఎందుకు ఉంది అనే భావన రాదు. అందరూ పాత్రల పరిధి మేరకు నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమాకి తెర మీద కనిపించే హీరో రణ్ బీర్ కపూర్ అయితే.. ప్రేక్షకుల మైండ్ లో మాత్రం సందీప్ రెడ్డి వంగానే తిరుగుతూ ఉంటాడు. ప్రతి ఎమోషన్ ని సందీప్ హ్యాండిల్ చేసిన తీరు అందరినీ మంత్ర ముగ్దులను చేస్తుంది. సినిమాకి ఉండే షరతులు, పరిమితులను బట్టి మూవీకి A సర్టిఫికేట్ వస్తుందని తెలిసినా.. ఎక్కడా కూడా రాజీ పడకుండా తను అనుకున్న సినిమాని తీశాడు. ఈ సినిమాకి డైరెక్టర్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్ బోన్ అనే చెప్పాలి. సాంగ్స్ చాలా సింపుల్ గా ప్రేక్షకులను అలరిస్తాయి. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ల్లో పంజాబీ మ్యూజిక్, సాంగ్స్ వస్తాయి. అవి మీకు అర్థం కాకపోయినా మీకు గూస్ పంబ్స్ తెప్పిస్తాయి. ఇంక బీజీఎం అయితే నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. యాక్షన్ సన్నివేశాల్లో హర్షవర్దన్ రామేశ్వర్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మైండ్ లో నుంచి పోదు. ఆ తర్వాత అమిత్ రోయ్ సినిమాటోగ్రఫీ మిమ్మల్ని వావ్ అనేలా చేస్తుంది. ఇంక నిర్మాణ విలువలు అయితే నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. ఎక్కడా కూడా రాజీలేకుండా తెరకెక్కించారు.
రేటింగ్: 3.5/5