Swetha
8 Vasanthalu Review In Telugu: అనంతిక సునిల్ కుమార్ నటించిన 8 వసంతాలు మూవీ ఈరోజు రిలీజ్ అయింది. కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు ఒక్కోసారి కొత్త తరం వారితో సినిమాలు తీస్తూ ఉంటారు. అలా మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన సినిమానే 8 వసంతాలు. అనంతిక సునిల్ కుమార్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ సినిమాపై ప్రమోషన్స్ వలన కాస్త హైప్ పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో చూసేద్దాం.
8 Vasanthalu Review In Telugu: అనంతిక సునిల్ కుమార్ నటించిన 8 వసంతాలు మూవీ ఈరోజు రిలీజ్ అయింది. కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు ఒక్కోసారి కొత్త తరం వారితో సినిమాలు తీస్తూ ఉంటారు. అలా మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన సినిమానే 8 వసంతాలు. అనంతిక సునిల్ కుమార్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ సినిమాపై ప్రమోషన్స్ వలన కాస్త హైప్ పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో చూసేద్దాం.
Swetha
అనంతిక సునిల్ కుమార్ నటించిన 8 వసంతాలు మూవీ ఈరోజు రిలీజ్ అయింది. కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు ఒక్కోసారి కొత్త తరం వారితో సినిమాలు తీస్తూ ఉంటారు. అలా మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన సినిమానే 8 వసంతాలు. అనంతిక సునిల్ కుమార్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ సినిమాపై ప్రమోషన్స్ వలన కాస్త హైప్ పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో చూసేద్దాం.
కథ :
ఇది ఓ ప్రేమ జంట జీవితానికి సంబందించిన కథ . శుద్ధి అయోధ్య(అనంతిక సునిల్ కుమార్) అనే ఓ యువతి ఓ మంచి రచయిత. ఆమె ఊటీలో ఉంటూ యంగ్ ఏజ్ లోనే ఓ పుస్తకం రాస్తుంది. ఆ బుక్ బాగా హిట్ అవ్వడంతో చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంటుంది. ఇది మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఆమె ప్రావిణ్యం సంపాదించుకుంటుంది. ఇలా సాగిపోతున్న ఆమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) అనే వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. కొంతకకాలానికి ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. వరుణ్ తన మనసులో మాట చెప్తాడు. కాదు శుద్ధి దానికి కొంత సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమి జరిగింది ? శుద్ధి వరుణ్ కు తన మనసులో మాట చెప్పిందా లేదా ? ఈలోగా వరుణ్ జీవితంలో ఎలాంటి సంగటనలు చోటు చేసుకున్నాయి ? ఆమె జీవితంలోకి వచ్చిన మరో వ్యక్తి ఎవరు ? చివరికి శుద్ధి ప్రేమ కథ ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది తెరపై చూడాల్సిన కథ.
నటి నటుల పని తీరు :
ఈ సినిమాలో మెయిన్ హైలెట్ అనంతిక సునిల్ కుమార్. సినిమా కథ అంతా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆమె అందం, అభినయం, స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్ లో ప్రేక్షకులను కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. ఇక మరో ఇద్దరు నటులు వరుణ్‌గా చేసిన హనురెడ్డి.. సెకండాఫ్‌లో వచ్చే రవి దుగ్గిరాల ఇద్దరు కూడా వారి వారి క్యారెక్టర్స్ కు న్యాయం చేశారు. రవి దుగ్గిరాల ఇదివరకే ‘మధురం’లో నటించాడు. ఇక ఇందులో అతని క్యారెక్టర్ ఉన్నది కాసేపు అయినా డిజైన్ చేసిన విధానం బాగుంది. మిగిలిన వారంతా కూడా బాగానే నటించారని అనిపిస్తుంది.
టెక్నీకల్ విభాగం పని తీరు :
ఈ సినిమాలో మెయిన్ బ్యూటీ స్పాట్స్ అయినా ఊటీ , కాశ్మిర్ అందాలను చూపించడంలో.. కెమెరా పనితనం బాగా కనిపించింది. విశ్వనాధ్ రెడ్డి కు ఈ విషయంలో ఫుల్ మార్క్స్ పడతాయి. కొన్ని కొన్ని సీన్స్ లో అందరికి మణిరత్నం గుర్తొస్తారు. ఇక సినిమాకు మరో హైలెట్ హెషామ్ అందించిన సంగీతం. ఇక దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించాడు. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ గా సాగకపోయినా.. డైలాగ్స్ చాలా అద్భుతంగ అనిపిస్తాయి. ఫైనల్ గా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయని అనిపిస్తుంది.
విశ్లేషణ :
ప్రేమ కథలు ఎప్పుడు ఒకేలా ఉంటాయి అనుకుంటే పొరపాటే. ఒక్కోసారి వాటిని చూపించే తీరు సినిమా మీద పూర్తి ఒపీనియన్ ని మార్చేస్తుంది. ప్రేమకథలు గురించి ప్రేమగా చెప్పే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి సినిమాలలో ఇప్పుడు ఇది కూడా ఒకటి. అన్ని లవ్ స్టోరీస్ లోలానే హీరో హీరోయిన్ ను ప్రేమలో పడేయడానికి నానా తంటాలు పడతాడు. హీరోయిన్ ఆల్మోస్ట్ అతనికి ఒకే చెప్తుంది అనుకునే టైం లో ఆమెను దూరం పెట్టేస్తాడు. ఆయా సందర్భాలలో వచ్చే డైలాగ్స్ కు పక్కా విజిల్స్ పడతాయి. ఇక సెకండ్ ఆఫ్ లో మరో వ్యక్తి ఎంట్రీ. అక్కడ మరో ప్రేమ కథ.. అలా హాయిగా సాగిపోతు ఉంటుంది. అక్కడక్కడా కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపించినా.. డైలాగ్స్ మాత్రం బావుంటాయి.
సినిమాను కాస్త ఓపిక చేసుకుని చూస్తే మొదటి నుంచి చివరివరకు ఏ అలజడి లేని నదీప్రవాహంలా సాగిపోతూ ఉంటుంది. ఈ సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది ఆఖరిలో రివీల్ చేసే విధానం బావుంటుంది. మొత్తం మీద ఫణీంద్ర నర్సెట్టి ఈ సినిమాతో ప్రేమకు ముగింపు లేదు, అలాగే ప్రేమకు కండిషన్స్ కూడా ఉండవు అనే పాయింట్ ను చెప్పినట్లు అనిపిస్తుంది. నేరేషన్ కాస్త స్లో గా ఉండడంతో అందరికి నచ్చకపోవచ్చు. కానీ భావుకత, కవితలు అంటే ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
ప్లస్ లు :
మైనస్ లు :
రేటింగ్ : 2.25/5
చివరిగా : ప్రేమ కథలు ఇష్టపడే వారికి ‘8 వసంతాలు’ బెస్ట్ ఛాయిస్