Swetha
ఓటీటీ లో విడుదలయ్యే సినిమాల కంటే వెబ్ సిరీస్ లకే బాగా ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్ లలో.. క్రైమ్, సస్పెన్స్, కామెడీ సిరీస్ లకు బాగా ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో మరో కామెడీ వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలో సందడి చేస్తోంది.
ఓటీటీ లో విడుదలయ్యే సినిమాల కంటే వెబ్ సిరీస్ లకే బాగా ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్ లలో.. క్రైమ్, సస్పెన్స్, కామెడీ సిరీస్ లకు బాగా ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో మరో కామెడీ వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలో సందడి చేస్తోంది.
Swetha
ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే వాటిలో .. తెలుగు వెబ్ సిరీస్ లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా వాటిలో కామెడీ వెబ్ సిరీస్ లకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఎందుకంటే, కామెడీ వెబ్ సిరీస్ లంటే.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు కాబట్టి.. వాటికీ మంచి వ్యూవర్ షిప్ దక్కుతుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మరో కామెడీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రజెంటర్ గా వ్యవహరిస్తోన్న.. తెలుగు కామెడీ వెబ్ సిరీస్ “తులసివనం”. ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. మరి, ఈ సిరీస్ ఓటీటీ వివరాలు ఇలా ఉన్నాయి.
తరుణ్ భాస్కర్ ప్రజంటర్ గా వ్యవహరిస్తోన్న .. ఈ కామెడీ సిరీస్ “తులసివనం”. ఈ సిరీస్ కు దర్శకుడిగా అనిల్ రెడ్డి వ్యవహరించారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్ ను తెరకెక్కించారు దర్శకుడు. ఇక ఈ సిరీస్‌లో అక్షయ్ లగుసాని, ఐశ్వర్య హోలక్కల్, వెంకటేష్ కాకుమాను, టాక్సీవాలా విష్ణు ప్రధాన పాత్రలు పోషించారు. “తులసివనం” సిరీస్ ను స్వాగత్ రెడ్డి, నీలిత పైడిపల్లి, జీవన్ కుమార్, ప్రీతమ్ కలిసి నిర్మించారు. అయితే అక్షయ్ లగుసాని, ఐశ్వర్య హోళక్కల్ కలిసి ఆల్రెడీ గతంలో హాస్టల్ డేస్ అనే వెబ్‌సిరీస్ చేశారు. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో సెకండ్ వెబ్ సిరీస్ గా “తులసివనం” వచ్చింది. ఈ సిరీస్ మార్చి 21నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పైగా ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ ను ఫ్రీ గా చూసేయొచ్చట. అయితే, ఇప్పటివరకు ఈ సిరీస్ నుంచి మూడు ఎపిసోడ్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. మిగిలిన ఎపిసోడ్స్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇక “తులసివనం” సిరీస్ కథ విషయానికొస్తే.. తులసి అనే ఒక యువకుడి నిజ జీవితంలో జరిగిన కొన్ని హాస్య సంఘటనలతో దర్శకుడు ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఆ యువకుడిని ఐఏఎస్ గా చూడాలనేదే అతని తండ్రి కోరిక. కానీ, తులసి మాత్రం క్రికెటర్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత తన తండ్రి బలవంత పెట్టగా సాఫ్ట్ వేర్ జాబ్ లో జాయిన్ అవుతాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కు వచ్చిన అతనికి..ఎలాంటి వాస్తవ సంఘటనలు ఎదురౌతాయి. ఆ తర్వాత అతని కలలను నెరవేర్చుకుంటాడా లేదా.. అనేదే ఈ సిరీస్ లో చూడవచ్చు . మరి, కామెడీ సిరీస్ అయిన “తులసి వనం” పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.