సినిమాగా రియల్‌ స్టోరీ.. 10 నెలల తర్వాత ఓటీటీలోకి..

కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి వస్తున్నాయి. మరికొన్ని చిత్రాలు ముందుగా థియేటర్లలో విడుదలై తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. తాజాగా, ఓ సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.

కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి వస్తున్నాయి. మరికొన్ని చిత్రాలు ముందుగా థియేటర్లలో విడుదలై తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. తాజాగా, ఓ సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.

 ఓటీటీలు సినిమాల పాలిట వరంగా మారుతున్నాయి. ముఖ్యంగా చిన్న చిత్రాలకు మంచి ఆదాయ మార్గం అవుతున్నాయి. థియేటర్‌ రైట్స్‌తో కొంత మొత్తాన్ని.. తర్వాత ఓటీటీ రైట్స్‌తో మరికొంత మొత్తాన్ని సంపాదిస్తున్నాయి. నిర్మాతలు లాభసాటి వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. సాధారణంగా ఓ సినిమా థియేటర్లలో విడుదల అయిన నెల రోజులకే ఓటీటీలోకి వస్తూ ఉంటుంది. కానీ, మూవీకి మంచి టాక్‌ ఉంటే మాత్రం అది కాస్త లేట్‌ అవుతూ ఉంటుంది.

కానీ, కొన్ని సినిమాలు మాత్రం చాలా ఆలస్యంగా ఓటీటీలోకి వస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో ఆడకుండా నేరుగా ఓటీటీలోకి వస్తుంటే.. మరికొన్ని సినిమాలు థియేటర్లలో ఆడి ఓటీటీకి వస్తున్నాయి. తాజాగా, సాచి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మూవీ 2023 మార్చి నెలలో థియేటర్లలో విడుదల అయింది. అయితే, సినిమాలో పేరున్న నటీ,నటులు లేకపోవటంతో మంచి గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. సాచి థియేటర్లలోకి వచ్చిన సంగతి వెళ్లిపోయిన సంగతి కూడా ఎవ్వరికీ తెలియలేదు.

దాదాపు 10 నెలల తర్వాత సాచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఇక, ఈ మూవీ నిజ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కింది. మహిళా సాధికారతే ప్రధాన అంశం. తండ్రి అనారోగ్యంతో మంచానికి పరిమితమవ్వటంతో కూతురు ఇంటి బాధ్యతలు తీసుకుంటుంది. తండ్రి వృత్తినే చేపడుతుంది. బార్బర్‌గా మారి ఇంటికి అండగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఎదురైన సమస్యలు ఏంటి? అన్నదే మిగిలిన కథ.

ఇక, మరో సినిమా ‘ది ట్రైల్‌ ’ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక, ఈ మూవీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. మర్డర్‌ మిస్టరీ మీద కథ మొత్తం నడుస్తుంది. ఈ మూవీలో ఉదయ్‌ పులిమె, సాక్షి ఉత్తాడ, జశ్వంత్‌ పెరుమాళ్ల, వజీర్‌ ఇషాన్‌ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీ నవంబర్‌ 24వ తేదీన థియేటర్లలో రిలీజైంది. దాదాపు నెలన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. మరి, 10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన రియల్‌ లైఫ్‌ స్టోరీ ‘ సాచి’పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments