టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'విరాజి'. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఓటీటీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'విరాజి'. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఓటీటీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Somesekhar
ప్రేమకథలతో కెరీర్ ఆరంభించిన యంగ్ హీరో వరుణ్ సందేశ్.. ఆ తర్వాత విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ వస్తున్నాడు. తాజాగా ‘విరాజి’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆగస్ట్ 2న థియేటర్లలోకి వచ్చాడు. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. మరి థ్రిల్లర్ మూవీతో వరుణ్ సందేశ్ మెప్పించాడా? ఈ రివ్యూలో చూద్దాం.
ఒకరితో ఒకరికి పరిచయం లేకుండా.. ఓ వ్యక్తి ఫోన్ కాల్ వల్ల డాక్టర్, స్టాండప్ కమెడియన్, ప్రొడ్యూసర్, ఫొటోగ్రాఫర్, ప్రముఖ జోష్యుడు, పోలీస్ అధికారి అందరు ఓ పాడుబడ్డ బంగ్లాకి వస్తారు. అక్కడి వచ్చిన తర్వాత అది ఒకప్పటి పిచ్చాసుపత్రి అని గుర్తిస్తారు. అదే వారికి చివరి రోజు అని ఓ కార్డుపై రాసిపెట్టి ఉంటుంది. అన్నట్లుగానే అనుమానాస్పదంగా ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. ఇలాంటి టైమ్ లో డ్రాగ్స్ కు బానిసైన ఆండ్రీ(వరుణ్ సందేశ్) ఆ ఇంట్లోకి అడుగుపెడతాడు. ఆ తర్వాత ఏమైంది? వారిని చంపేది దెయ్యమా? వ్యక్తా? అసలు వాళ్లకు ఫోన్ చేసింది ఎవరు? తెలియాలంటే విరాజి చూడాల్సిందే.
చెన్నైలో చోటు చేసుకున్న కొన్ని యదార్థ సంఘటన ఆధారంగా డైరెక్టర్ ఆద్యంత్ హర్ష ఈ కథను తెరకెక్కించాడు. అతడు తీసుకున్న పాయింట్ మంచిదే అయినప్పటికీ.. ఎస్టాబ్లిస్ చేయడంలో కాస్త తడబడ్డాడు. కామెడీతో పాత్రలతో ప్రారంభం అయిన ఈ మూవీ.. పాడుబడ్డ భవనంలోకి కథ ఎంటర్ అయిన దగ్గర నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లోకి వెళ్తుంది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు అక్కడి ఎందుకు వచ్చారు? అన్న పాయింట్ తో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాడు డైరెక్టర్. అయితే ఒక్కో పాత్రను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో.. కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. హత్యలు స్టార్ట్ అవ్వడం, అవి ఎవరు చేస్తున్నారో తెలియకపోవడం, హీరోనే వాటిని చేస్తున్నాడు అని చెప్పే రీతిలో తీర్చిదిద్దిన సీన్స్ ఆకట్టుకుంటాయి. హీరో ఎంట్రీతో కథ టర్న్ అవుతుంది. సెకండాఫ్ లో వరుణ్ సందేశ్ నేపథ్యంలో వచ్చే సీన్లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. క్లైమాక్స్ తో డైరెక్టర్ ఊహించని సర్ప్రైజ్ ఇస్తాడు.
డ్రగ్స్ కు బానిసైన వ్యక్తిగా వరుణ్ సందేశ్ అద్భుతమైన నటనతో మెప్పించాడు. సినిమాకు ఇతడి నటనే హైలెట్. ఇక మిగతా వారిలో రఘు కారుమంచి, ప్రమోదిని, కుషాలిని, బలగం జయరాం తమ పాత్రల పరిధిమేరకు నటించారు. టెక్నికల్ విభాగానికి వస్తే.. జీవీ అజయ్ కుమార్ కెమెరా పనితం ఆకట్టుకుంది. తన కెమెరాతో కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులను భయపెట్టాడు. ఇక ఎబెనైజర్ పాల్ మ్యూజిక్ బాగుంది. డైరెక్షన్ విషయానికి వస్తే.. ఆద్యంత్ హర్ష తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయ్యాడు.
చివరి మాట: విరాజి అనుకున్నంత విరాజిల్లలేదు
(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)