Dharani
Premalo-Amazon Prime Video: ఆరు నెలల క్రితం తెలుగులో విడుదలైన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఒకటి సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వివరాలు..
Premalo-Amazon Prime Video: ఆరు నెలల క్రితం తెలుగులో విడుదలైన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఒకటి సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వివరాలు..
Dharani
ఓటీటీల హవా పెరిగిన తర్వాత.. కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇతర భాషల్లో మంచి విజయం సాధించిన సినిమాలు తెలుగులో కూడా వస్తున్నాయి. ఇక కొన్ని తెలుగు మూవీలు అయితే థియేటర్‌లో మంచి టాక్ తెచ్చుకోకపోయినా.. ఓటీటీల్లో సత్తా చాటుతున్నాయి. ఆలస్యంగా అయినా సరే.. ఓటీటీల్లో పలకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో తెలుగు సినిమా.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా రిలీజైన ఆరు నెలల తర్వాత.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇక సినిమాలోని ట్విస్ట్‌లు చూస్తే.. మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఆ రేంజ్‌లో ఉంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈసినిమా.. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకు అది ఏ చిత్రం..
తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రేమలో ఓటీటీలోకి వచ్చింది. ఆరు నెలల క్రితం విడుదలైన ఈ చిన్న సినిమా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ సినిమాకు చందూ కోడూరి దర్శకుడు మాత్రమే కాక హీరో కూడా కావడం గమనార్హం. డైరెక్టర్‌గా, దర్శకుడిగా చందుకి ఇదే మొదటి సినిమా. ఈ మూవీలో చరిష్మా శ్రీకర్ హీరోయిన్‌గా నటించగా.. శివాజీరాజా, మధుసూదన్‌రావు కీలక పాత్రలు పోషించారు.
ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ ఏడాది జనవరి 26న ప్రేమలో మూవీ థియేటర్లలో రిలీజైంది. ప్రేమకథకు సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను జోడించి దర్శకుడు చందు ఈ మూవీని తెరకెక్కించాడు. సినిమాను పూర్తిగా గోదావరి యాసలో నడిపించాడు చందు. బ్యాక్‌డ్రాప్ కొత్తగా ఉన్నా.. లవ్ స్టోరీ రొటీన్‌గా ఉండటంతో ప్రేమలో చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.
ప్రేమలో చిత్రాన్ని యథార్థ ఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ తెరకెక్కించారు దర్శకుడు చందు. సోషల్ మీడియా లో వచ్చే ఫేక్ వీడియోల కారణంగా అమాయకులు ఎన్ని ఇబ్బందులకు గురవుతుంటారు అనే కథాంశంతో ప్రేమలో మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాకు సందీప్ కానుగుల మ్యూజిక్ అందించాడు. రాంపీ నందిగాం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు.