సైలెంట్ గా OTT లో తెలుగు ఎమోషనల్ డ్రామా ‘షేడ్స్ ఆఫ్ బేబీ పింక్’ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

OTT New Releases- Telugu Movie Shades Of Baby Pink: డైరెక్ట్ గా ఓటీటీ లోకి వచ్చే సినిమాల లిస్ట్ పెరిగిపోతుంది. సాధారణంగా షార్ట్ ఫిల్మ్స్ అంటే యూట్యూబ్ లో మాత్రమే రిలీజ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు షార్ట్ ఫిల్మ్ ను ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోకి తీసుకుని వచ్చారు. మరి ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటో చూసేద్దాం.

OTT New Releases- Telugu Movie Shades Of Baby Pink: డైరెక్ట్ గా ఓటీటీ లోకి వచ్చే సినిమాల లిస్ట్ పెరిగిపోతుంది. సాధారణంగా షార్ట్ ఫిల్మ్స్ అంటే యూట్యూబ్ లో మాత్రమే రిలీజ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు షార్ట్ ఫిల్మ్ ను ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోకి తీసుకుని వచ్చారు. మరి ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో ఎక్కువగా తెలుగు సినిమాలే సందడి చేస్తున్నాయి. అవి కూడా ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా.. డైరెక్ట్ గా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సైలెంట్ స్ట్రీమింగ్ లిస్ట్ లో మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ యాడ్ అయింది. కాబట్టి ఈ వీకెండ్ ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. సాధారణంగా ఏవైనా తెలుగు సినిమాలు.. ఓటీటీ లోకి వస్తున్నాయంటే.. ఓ రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. మరి ఆల్రెడీ స్ట్రీమింగ్ అంటే అదేం సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఇంకాస్త పెరుగుతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా రన్ టైమ్ చాలా తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి చాలా ఈజీగా చూసేయొచ్చు. చెప్పాలంటే ఇదొక షార్ట్ ఫిల్మ్ లా ఉంటుంది. సాధారణంగా షార్ట్ ఫిల్మ్స్ అంటే యూట్యూబ్ లోనే రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేసారంటే కచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండే ఉంటుంది. ఈ సినిమా పేరు ‘షేడ్స్ ఆఫ్ బేబీ పింక్’. ఈ సినిమాను చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ , గోల్డెన్ లీఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రిలీజ్ చేశారు. ఆ సమయంలో ఈ సినిమాకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఈ షార్ట్ ఫిల్మ్ కు నీలిమ గుడవల్లి దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు తెలుగు షార్ట్ ఫిల్మ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీకెండ్ ఓ మంచి ఎమోషనల్ డ్రామా చూడాలంటే మాత్రం ఈ మూవీ బెస్ట్ ఛాయస్

ఇక షేడ్స్ ఆఫ్ బేబీ పింక్ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా కథ అంతా కూడా ఓ చిన్న బాబు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతని తల్లి తండ్రులు.. జీవితంలో సెటిల్ అవ్వడం కోసం.. విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆ బాబును అమ్మమ్మ , తాతయ్య ల దగ్గర వదిలేసి వెళ్తారు. ఇక ఆ తర్వాత ఆ బాబు ఎలాంటి మానిసిక ఒత్తిడికి గురయ్యాడు.. అమ్మమ్మ తాతయ్య లు అతనికి ఎలా నచ్చచెప్పారు .. అతని ఎమోషనల్ ట్రామాస్ చుట్టూనే.. ఈ మూవీ కథ కొనసాగుతూ ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు అందరి జీవితాల్లో జరుగుతున్న సంఘటనలే ఇవి.. కాబట్టి ఈ ఫిల్మ్ అందరి హృదయాలను కదిలిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి వెంటనే ఈ ఫిల్మ్ ను చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments