RBI పై ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్! సామాన్యులకి తెలియని ఎన్నో నిజాలు!

RBI OTT Web Series: రెగ్యులర్ కాన్సెప్ట్స్ కాకుండ కొత్త తరహా కథలు ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అది కూడా చూసే వారికి ఉపయోగపడేలా.. ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో త్వరలోనే ఆర్బీఐ పై ఓ వెబ్ సిరీస్ రానుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

RBI OTT Web Series: రెగ్యులర్ కాన్సెప్ట్స్ కాకుండ కొత్త తరహా కథలు ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అది కూడా చూసే వారికి ఉపయోగపడేలా.. ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో త్వరలోనే ఆర్బీఐ పై ఓ వెబ్ సిరీస్ రానుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఎంటర్టైన్మెంట్ విభాగంలో ప్రస్తుతం ఓటీటీ లకు ఎక్కువ డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో నిత్యం ఓటీటీ లో రకరాల వెబ్ సిరీస్ లు , సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇక వాటికి లభించే ఆదరణ కూడా అదే రేంజ్ లో ఉంది. దీనితో మేకర్స్ కూడా రెగ్యులర్ కాన్సెప్ట్స్ కాకుండా కొత్త తరహా కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అది కూడా చూసే వారికి ఉపయోగపడే విధంగా ఉండనున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఓ వెబ్ సిరీస్ రానుంది. మరి ఆ వెబ్ సిరీస్ లో దేని గురించి ఉండబోతుంది? ఎక్కడ స్ట్రీమింగ్ కు రానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పటికే ఓటీటీ లో స్కామ్ 1992, స్కామ్ 2003 లాంటి వెబ్ సిరీస్ లలో.. బయట ఏం జరుగుతుంది అనే విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ తరహా వెబ్ సిరీస్ లకు లభించిన ఆదరణ కూడా అదే రేంజ్ లో ఉంది. ఈ క్రమంలో ఇక ఇప్పుడు ఆర్బీఐ పై ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రానుంది. ఆర్బీఐ పై కథ ఏం ఉంటుంది అనే ప్రశ్న అందరికి కలిగే ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ విధులను ప్రారంభించి 90 సంవత్సరాలు పూర్తైన సంధర్బంగా.. ఈ 90 సంవత్సరాల ప్రయాణం గురించి అందరికి తెలియజెప్పేలా.. ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నారు. అది కూడా కేవలం ఐదు ఎపిసోడ్స్ లోనే కథ మొత్తం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఎపిసోడ్ కూడా 25-30 నిమిషాల నిడివితో ఉన్నట్లు.. సమాచారం. ఈ విషయాన్నీ స్వయంగా ఆర్బీఐ ప్రకటించడం విశేషం.. “ఆర్బీఐ 90 సంవత్సరాల ప్రయాణాన్ని గుర్తు చేసేలా జాతీయ టీవీ ఛానెల్‌లు లేదా OTT ప్లాట్‌ఫారమ్‌లలో సుమారు 25-30 నిమిషాల నిడివి గల ఐదు ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్‌ను రూపొందించాలని బ్యాంక్ కోరుకుంటోంది”. అంటూ ఆర్బీఐ తెలిపింది.

అంటే ఇంకా ఈ సిరీస్ ఏ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది అనే విషయం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ప్రస్తుతం వారు అనుకున్న విధంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించే టీమ్ కోసం ఆర్బీఐ సెర్చ్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ కోసం ఇంట్రెస్ట్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ లు , టీవీ ఛానెల్స్ , OTT ప్లాట్ ఫార్మ్స్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చిందన్నమాట. “బలమైన కథలు చెప్పేవారు, నిపుణుల ఇంటర్వ్యూలు, అధిక-నాణ్యత గల విజువల్స్ ద్వారా, ఆర్బీఐ పారదర్శకతను పెంచడానికి, సెంట్రల్ బ్యాంక్ కార్యకలాపాలు, విధానాలపై నమ్మకాన్ని పెంపొందించేలా వెబ్ సిరీస్ ఉండాలి” అంటూ ఆర్బీఐ ప్రకటించింది. మరి ఈ వెబ్ సిరీస్ ను ఎవరు రూపొందిస్తారో.. ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు రానుంది అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments