పెంచిన తండ్రా? ప్రేమించిన ప్రియుడా? OTTలో సస్పెన్స్ లవ్ స్టోరీ!

OTT Suggestions- Best Love Story: మీకు లవ్ స్టోరీలు అంటే ఇష్టమా? అయితే మీకోసం ఓటీటీలో ఓ రేంజ్ లవ్ స్టోరీ ఒకటి స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి అది చాలా సింపుల్ స్టోరీ. కానీ, ప్రతి తండ్రికి, ప్రతి ప్రియుడికి, ప్రతి కూతురుకి కనెక్ట్ అవుతుంది.

OTT Suggestions- Best Love Story: మీకు లవ్ స్టోరీలు అంటే ఇష్టమా? అయితే మీకోసం ఓటీటీలో ఓ రేంజ్ లవ్ స్టోరీ ఒకటి స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి అది చాలా సింపుల్ స్టోరీ. కానీ, ప్రతి తండ్రికి, ప్రతి ప్రియుడికి, ప్రతి కూతురుకి కనెక్ట్ అవుతుంది.

లవ్ స్టోరీలు అంటే ఇష్టపడని సినిమా లవర్స్ ఉండరేమో? అందుకే వచ్చే 10 సినిమాల్లో దాదాపుగా 7 సినిమాల్లో లవ్ స్టోరీస్ ఉంటాయి. అలాంటిది ఎన్ని లవ్ స్టోరీలు వచ్చినా కూడా ఇంకా కొత్త కోణంలో ఒక లవ్ స్టోరీ వస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పుకునే లవ్ స్టోరీ మాత్రం చాలా రొటీన్ స్టోరీ. ఎంతో సింపుల్ గా ఉంటుంది. కానీ, ఇలాంటి ఒక మంచి ప్రేమకథను మాత్రం చూసుండరు. ఎప్పుడైనా మన లైఫ్ లోకి ఒక కొత్త వ్యక్తి వస్తున్నారు అంటే.. అప్పటి వరకు మనతో ఉన్న, మన బాగోగులు చూసిన తల్లిదండ్రులు కూడా కాస్త పొసెసివ్ గా ఫీలవుతారు. అందుకే ఏ కుటుంబంలో అయినా పెళ్లైన తర్వాత చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ పొసెసివ్ నెస్ మీద వచ్చిందే ఈ మూవీ.

సాధారణంగా పెంచిన తండ్రా? ప్రేమించిన ప్రియుడా? అనే ఆప్షన్ కొంతమంది అమ్మాయిలకు ఎదురయ్యే ఉంటుంది. కుటుంబం కోసం ప్రేమను త్యాగం చేసిన వాళ్లు ఉన్నారు. ప్రేమ కోసం పేగు బంధాన్ని వదిలించుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇద్దరినీ మనం తప్పుబట్టలేం. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్లు కరెక్ట్. అలాంటి ఒక సంఘర్షణ ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. పైగా ఆయన కన్నతండ్రి కూడా కాదు. శకుంతలను కణ్వ మహర్షి ఎలా అయితే పెంచి పెద్ద చేస్తాడో అదే తరహాలో ఈ తండ్రి కూడా తనకు పుట్టని ఒక పాపను సొంత కూతురి కంటే ఎక్కువగా పెంచుకుంటాడు. ఆ అమ్మాయే తన సర్వస్వంగా జీవిస్తాడు. ఉన్నత చదువులకు విదేశాలు వెళ్లాలి అన్నా కూడా తనకు ఎక్కడ దూరమవుతుందో అనే భయం.

ఆ అమ్మాయి కూడా ఈ లోకంలో తన తండ్రి కంటే మరెవరు ఎక్కువ కాదు అనే విధంగా ఉంటుంది. తండ్రి కోసం ప్రాణం కూడా వదిలేస్తుంది. అలాంటి అమ్మాయి జీవితంలోకి దుష్యంత మహారాజు తరహాలో ఓ కుర్రాడు ఎంటర్ అవుతాడు. ఆమెను చూసిన తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అనుకున్నదే తడవుగా ఆమెను ప్రేమలో పడేయాలి అని కంకణం కట్టుకుంటాడు. ఆమె చుట్టూ తిరగడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం అతడిని పురుగు కన్నా హీనంగా చూస్తు ఉంటుంది. దగ్గరకు కూడా రానివ్వదు.

ఆమెకు ఆ కుర్రాడు అస్సలు సెట్ కాడు అని ఆ తండ్రి కూడా బలంగా నమ్ముతాడు. అయితే అదంతా పైకి మాత్రమే. ఆమె నో చెప్పలేనంతగా ఆ కుర్రాడు ఆమెను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతని ప్రేమలో పడేలా చేస్తాడు. మరి.. ఆ తండ్రి పరిస్థితి ఏంటి? కన్నకూతురు కంటే గారంగా పెంచిన ఆ అమ్మాయి అతడిని వదిలేసి వెళ్లిపోతుందా? లేక పెళ్లి పేరుతో ఆ తండ్రే ఆ అమ్మాయితో బంధాన్ని తెంచేసుకుంటాడా? ఆ విషయాలు తెలియాలి అంటే మీరు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో అమరం.. అఖిలం.. ప్రేమ సినిమా చూడాల్సిందే.

Show comments