OTT Suggestions- Suspense Thriller: భార్య పై భర్తకి అనుమానం!ఇంట్లో కెమెరాలు పెట్టి! OTT లో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్!

భార్య పై భర్తకి అనుమానం!ఇంట్లో కెమెరాలు పెట్టి! OTT లో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్!

OTT Suspense Thriller : టెక్నాలజీని ఇప్పడు ఎలా కావాలంటే అలా వాడేస్తున్నారు. ఇందులో చాలా మంది తెలుసుకుని.. జాగ్రత్త పడాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా చూస్తే కొంతవరకు క్లారిటీ వస్తుంది. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ సారి చెక్ చేసేయండి.

OTT Suspense Thriller : టెక్నాలజీని ఇప్పడు ఎలా కావాలంటే అలా వాడేస్తున్నారు. ఇందులో చాలా మంది తెలుసుకుని.. జాగ్రత్త పడాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా చూస్తే కొంతవరకు క్లారిటీ వస్తుంది. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ సారి చెక్ చేసేయండి.

కొన్ని సినిమాలు సస్పెన్స్ ఎలిమెంట్స్ తో చివరి వరకు సినిమాను చూసేలా చేస్తాయి. ఇక మరి కొన్ని సినిమాలు స్టార్టింగ్ బోర్ కొట్టినా కానీ క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. అదే సస్పెన్స్ ఎలిమెంట్స్ టెక్నలాజితో ముడి పడి ఉంటే.. అలాంటి సినిమాలు చూసేందుకు ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. టెక్నాలజీని ఇప్పడు ఎలా కావాలంటే అలా వాడేస్తున్నారు. ఇందులో చాలా మంది తెలుసుకుని.. జాగ్రత్త పడాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ దాదాపు అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా స్టార్టింగ్ లో ఓ 18 ఏళ్ళ స్టూడెంట్ బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంటుంది. మరో వైపు ఓ గుర్తుతెలియని ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వస్ట్ పంపుతూ ఉంటాడు. మరో వైపు పోలీస్ ఆఫీసర్ విష్ణు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ.. తన బాస్ సదానంద్ చెప్పిన వారి ఫోన్స్ ను ట్యాప్ చేస్తూ.. ఆ కాల్స్ వింటూ రికార్డింగ్స్ ను తన బాస్ కు ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ రోజు సదానంద్ .. నాయక్ అనే ఓ వ్యక్తి నెంబర్ డీటెయిల్స్ ఇచ్చి.. అతని ఫ్యామిలీ అందరి నెంబర్స్ ను కూడా ట్యాప్ చేస్తాడు. అలా చేస్తున్నప్పుడు నాయక్ వైఫ్ హర్ష అనే అతనితో రిలేషన్ లో ఉందని తెలుస్తుంది. దీనితో హర్ష ఫోన్ కూడా ఇతను ట్యాప్ చేసి.. వాళ్ళ కాన్వర్సేషన్ మొత్తం వింటూ కాల్ రికార్డ్స్ చేస్తాడు.

మరో వైపు విష్ణు భార్య , చెల్లి విష్ణుకు అసలు సోషల్ మీడియా గురించి ఏమి తెలియదని భావిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఓ రోజు సదానంద్ అదే డిపార్ట్మెంట్ లో పని చేసే ఓ ఇద్దరి పోలీస్ ఆఫీసర్స్ ఫోన్ కాల్స్ రికార్డు చేయమని చెప్తాడు. వారిద్దరూ కూడా డిపార్ట్మెంట్ పేరు చెప్పుకుని.. లంచాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఎంతో సిన్సియర్ ఆఫీసర్ లా కనిపించే విష్ణు.. ఇలా అందరి కాల్ రికార్డింగ్స్ ను వింటూ.. వారికి తెలీకుండా వారి డబ్బులను దొంగలిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ రోజు నాయక్ భార్య ఎఫైర్ తో ఉన్న హర్ష ఫోన్ నుంచి.. విష్ణు ఇంటికి కాల్ వెళ్తుంది. తీరా చూస్తే అది తన భార్య.. హర్షకు, విష్ణు భార్య కు ఏదైనా సంబంధం ఉందా ! విష్ణు ఈ విషయంలో ఏం చేస్తాడు ? విష్ణు విషయం బయటపడుతుందా ? ఆ తర్వాత ఏం జరుగుతుంది ? ఇవన్నీ తెలియాలంటే “100” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments