Swetha
ఓటీటీ లోకి ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం.. మరొక కొత్త సినిమా ఎంటర్టైన్ చేయడానికి రెడీ గా ఉంది. మరి ఈ సినిమా ఏంటి.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కు రానుంది. అనే విషయాలను చూసేద్దాం.
ఓటీటీ లోకి ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం.. మరొక కొత్త సినిమా ఎంటర్టైన్ చేయడానికి రెడీ గా ఉంది. మరి ఈ సినిమా ఏంటి.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కు రానుంది. అనే విషయాలను చూసేద్దాం.
Swetha
ఈ వారం ఓటీటీ లోకి చాలానే ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతున్నా కానీ.. మూవీ లవర్స్ మాత్రం ప్రత్యేకించి తెలుగు సినిమాల కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు, ఈ క్రమంలోనే డైరెక్ట్ గా కొన్ని తెలుగు సిరీస్ లు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక వాటితో పాటు థియేటర్ లో రిలీజ్ అయినా తెలుగు సినిమాలు కూడా.. థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఈ క్రమంలో త్వరలో ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ డ్రామా రాబోతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా మరేదో కాదు.. చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన “మ్యూజిక్ షాప్ మూర్తి”. ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించగా.. అజయ్ ఘోష్ హీరోగా నటించాడు. వీరితో పాటు ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రలలో నటించారు. కాగా ఈ సినిమాకు శివ పాలడుగు దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 14 నుంచి థియేటర్ లో రిలీజ్ అయింది. థియేటర్ లో ఈ సినిమా మంచి రెస్పాన్స్ నే సంపాదించుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా డీసెంట్ టాక్ నే సంపాదించుకుంది. ఇక థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సినిమా.. ఓటీటీ లో అడుగుపెట్టనుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ జులై 16 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాలు మిస్ అయినా వారు ఎంచక్కా ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేసేయండి.
ఇక మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ కథ విషయానికొస్తే.. ఓ టౌన్ లో.. 50 ఏళ్ళున్న మూర్తి అనే వ్యక్తి.. మ్యూజిక్ షాప్ ను నడుపుతూ ఉంటాడు. ఒకప్పుడు మ్యూజిక్ షాప్స్ కు బాగా డిమాండ్ ఉంది కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారడంతో… షాప్ సరిగా నడవదు. దానితో ఆదాయం కూడా పడిపోతుంది. ఇక ఆ షాప్ ను మూసివేయాలని అతని భార్య వాదిస్తూ ఉంటుంది. కానీ అతను మాత్రం సంగీతంపై ప్రేమతో ఆ షాప్ ను అలాగే కొనసాగిస్తూ ఉంటాడు. అలా అయితే మూర్తి ఎలాగైనా ఆ షాప్ ను కొనసాగించాలని డీజే నేర్చుకోవాలని అనుకుంటాడు. దీనితో 50 ఏళ్ళ వయస్సులో అతను డీజే నేర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి ? అతను డీజే అయ్యాడా లేదా? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.