మరో OTT లోకి రీసెంట్ ఫ్యామిలీ డ్రామా .. ఈ వీకెండ్ బెస్ట్ ఛాయస్

OTT Recent Telugu Family Drama : ఇప్పుడు ఓటీటీ లకు క్రేజ్ బాగా నడుస్తుందని అందరికి తెలుసు కానీ ఈ రేంజ్ లో ఉంటుందని మాత్రం.. ఎవరు ఊహించి ఉండరు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఒకేసారి రెండు ఓటీటీ ల్లోకి.. రావడం లేదా ఒక దాని తర్వాత మరొక రావడం జరుగుతున్నాయి.

OTT Recent Telugu Family Drama : ఇప్పుడు ఓటీటీ లకు క్రేజ్ బాగా నడుస్తుందని అందరికి తెలుసు కానీ ఈ రేంజ్ లో ఉంటుందని మాత్రం.. ఎవరు ఊహించి ఉండరు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఒకేసారి రెండు ఓటీటీ ల్లోకి.. రావడం లేదా ఒక దాని తర్వాత మరొక రావడం జరుగుతున్నాయి.

ఈ వారం ఓటీటీ లో ఎంటర్టైన్మెంట్ కు కొదవే లేదు. ఎందుకంటే చాలానే ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. వారం స్టార్టింగ్ లో వచ్చిన అప్ డేట్స్ తో పాటు.. ప్రేక్షకులను సర్ప్రైజ్ర్ చేయడానికి మరికొన్ని సినిమాలు కూడా వచ్చేశాయి. అయితే, ఇప్పుడు ఓటీటీ లకు ఉన్న డిమాండ్ , క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈ రేంజ్ లో క్రేజ్ పెరుగుతుందని మాత్రం ఎవరు ఊహించి ఉండరు. ఎందుకంటే ఒకప్పుడు ఏదైనా సినిమా ఒక ఓటీటీ లోకి రావడమే విశేషం అయితే.. ఇప్పుడు ఏకంగా ఆయా సినిమాలు ఒకేసారి రెండు ఓటీటీ ల్లోకి రావడం , లేదా ఒక రోజు అటు ఇటుగా మరొక ఓటీటీ లోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది రీసెంట్ ఫ్యామిలీ డ్రామా విషయంలో కూడా ఇదే జరిగింది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు.. ఈ మూవీ కథేంటో చూసేద్దాం.. యాభై ఏళ్ళున్న ఓ పెద్దయాన ఓ చిన్న టౌన్ లో.. మ్యూజిక్ షాప్ ను రన్ చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పటి జెనెరేషన్ వారు ఆ మ్యూజిక్ షాప్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. దీనితో అతను షాప్ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. ఇంట్లో కూడా ఆ షాప్ మూసేయాలని ఒత్తిడి పెరిగిపోతుంది. కానీ అతనికి మాత్రం ఇందులోనే ఏదైనా వెరైటీగా చేయాలనీ ఉంటుంది. దీనితో యాభై ఏళ్ళ వయసులో అతను డీజే నేర్చుకోవాలని అనుకుంటాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపైన చూడాల్సిన కథ. ఈ సినిమా మరేదో కాదు. చాందిని చౌదరి , అజయ్ ఘోష్, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రలలో నటించిన “మ్యూజిక్ షాప్ మూర్తి” మూవీ.

ఈ సినిమా జూన్ 14 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. థియేటర్ లో ఈ సినిమా డీసెంట్ టాక్ నే సంపాదించుకుంది. ఇక ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయినా ప్రేక్షకులు.. ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూశారు. ప్రేక్షకుల ఎదురుచూపులకు తగినట్లే ఈ సినిమా జూలై 16న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక ఇప్పుడు ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా.. జూలై 17న సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ వీకెండ్ ఎంచక్కా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ మూవీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments