Market Mahalakshmi OTT: OTT లో క్లాస్ అబ్బాయి, మాస్ అమ్మాయి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

OTT లో క్లాస్ అబ్బాయి, మాస్ అమ్మాయి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

Market Mahalakshmi OTT: కేరింత మూవీలో ఒసేయ్ భావన అంటూ శ్రీకాకుళం యాసలో నవ్వించిన నటుడు పార్వతీశం. లేటెస్ట్ గా ఈ నటుడు హీరోగా నటించిన ఓ సినిమా ఓటీటీ లో కి వచ్చేస్తుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేద్దాం.

Market Mahalakshmi OTT: కేరింత మూవీలో ఒసేయ్ భావన అంటూ శ్రీకాకుళం యాసలో నవ్వించిన నటుడు పార్వతీశం. లేటెస్ట్ గా ఈ నటుడు హీరోగా నటించిన ఓ సినిమా ఓటీటీ లో కి వచ్చేస్తుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేద్దాం.

కొంతమంది నటి నటులు కొన్ని సినిమాల ద్వారా ఫేమస్ అవుతూ.. క్రమంగా వారే హీరోలుగా , హీరోయిన్స్ గా వెండి తెరపై కనిపిస్తూ ఉంటారు . ఈ క్రమంలోనే గతంలో వచ్చిన కేరింత సినిమా అందరిని ఎంతో మెప్పించింది. ఇక ఈ సినిమాలో ఒసేయ్ భావన అంటూ శ్రీకాకుళం భాషలో అందరి నవ్వించ్చిన నటుడు గుర్తున్నాడా.. అతనే పార్వతీశం. ఇక ఇప్పుడు ఈ నటుడు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “మార్కెట్ మహాలక్ష్మి”. ఈ సినిమాలో పార్వతీశం కు జోడిగా ప్ర‌ణీకాన్వీకా నటించింది. థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా స్టార్ క్యాస్టింగ్ లేకపోవడంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లోకి రానున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఏ ఓటీటీ లోకి రానుంది అనే విషయాలను చూసేద్దాం.

మార్కెట్ మహాలక్ష్మి సినిమాకు ఎస్ ముఖేష్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాను ఏప్రిల్ లో థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఓ క్లాస్ అబ్బాయికి, ఓ మాస్ అమ్మాయికి మధ్య సాగే ప్రేమ కథే ఈ సినిమా. ప్రేమ పెళ్లి లాంటి విషయాల మీద ఇప్పటికే చాలానే సినిమాలు వచ్చాయి. ఇక ఇటువంటి ప్లాట్ లో వచ్చే సినిమాలన్నీ కూడా ఒకే తరహాలో కొనసాగినా కానీ.. దర్శకుడు కథను ముందుకు తీసుకుని వెళ్లే తీరుపైనే సినిమా ఆధారపడి ఉంటుంది. ఇక ఈ సినిమాలో పెళ్లి విష‌యంలో యువ‌త ఎలాంటి ఆలోచ‌న‌లతో ఉంది అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. ఇక ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. థియేటర్ లో సక్సెస్ కాలేకపోయింది కాబట్టి కనీసం ఓటీటీ లో అయినా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి.

ఇక మార్కెట్ మహాలక్ష్మి సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఇండిపెండెంట్ బ్రతికే అమ్మాయి తనకు భార్యగా రావాలని ఎన్నో కలలు కంటూ ఉంటాడు. కానీ హీరో తండ్రి మాత్రం.. తనకు కట్నం ఎక్కువ ఇచ్చే పిల్లతోనే అతని పెళ్లి జరిపించాలని ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలో హీరో ఓ రోజు మార్కెట్ లో కూరగాయలు అమ్ముతున్న.. మహాలక్ష్మి అనే అమ్మాయిని చూస్తాడు. ఆమె దైర్యం, ఆలోచనా విధానం అన్నీ నచ్చి తొలిచూపులోనే.. ఆమెతో ప్రేమలో పడతాడు హీరో. ఈ క్రమంలోనే ఆమెకు ప్రపోజ్ కూడా చేస్తాడు. కాని ఆమె మాత్రం ఇతని ప్రపోజల్ ను రిజెక్ట్ చేస్తుంది. ఆమె అతని ప్రపోజల్ ఎందుకు రిజెక్ట్ చేసింది ! మహాలక్ష్మి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి ! హీరో తండ్రి తన ప్రేమను ఒప్పుకుంటాడా లేదా ! ఈ స్టోరీ ఎలా ముందుకు సాగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments