Harom Hara OTT: అఫీషియల్: హరోం హర OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే!

ఈ వారం ఓటీటీ లవర్స్ ను ఎంటర్టైన్ చేయడానికి చాలానే తెలుగు సినిమాలు రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో అనుకోకుండా సుధీర్ బాబు నటించిన హరోం హర సినిమా అఫీషియల్ డేట్ వచ్చేసింది.

ఈ వారం ఓటీటీ లవర్స్ ను ఎంటర్టైన్ చేయడానికి చాలానే తెలుగు సినిమాలు రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో అనుకోకుండా సుధీర్ బాబు నటించిన హరోం హర సినిమా అఫీషియల్ డేట్ వచ్చేసింది.

ఈ వారం ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ కాబోతున్నాయి అనే లిస్ట్ ఇప్పటికే వచ్చేసింది. ఇక వీటిలో ప్రేక్షకులు ముఖ్యంగా ఎదురుచూసేది వాటిలో తెలుగు సినిమాలు ఎమున్నాయా అని. ఇక ఈ వారం తెలుగు సినిమాలకు అస్సలు కొదవ లేదు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి సుదీర్ బాబు నటించిన హరోం హర మూవీ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ కూడా వచ్చేసింది. సుధీర్ బాబు సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే గత కొన్నాళ్లుగా సుధీర్ చాలా ప్రయోగాత్మకమైన పాత్రలను ఎంచుకుంటు వస్తున్నాడు. కానీ ఎందుకో ఆ సినిమాలు మాత్రం సుధీర్ కు హిట్ తెచ్చిపెట్టలేకపోతున్నాయి. ఇక హరోం హర మూవీ కూడా థియేటర్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ తోనే సరిపెట్టుకుంది. మరి ఓటీటీ లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో.. ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

ఈ మధ్య చాలా వరకు సినిమాలు థియేటర్ ప్రేక్షకులను మెప్పించలేకపోయినా కూడా… ఓటీటీ ప్రేక్షకులను మాత్రం తెగ మెప్పించేస్తున్నాయి. కాబట్టి దాదాపు సుధీర్ బాబు మూవీ కూడా ఇలాంటి టాక్ సంపాదించుకుంటుంది అని భావిస్తున్నారు అభిమానులు… హరోం హర మూవీ జూన్ 14 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ మూవీకి జ్ఞాన‌సాగ‌ర్ ద్వార‌క దర్శకత్వం వహించారు. ఇక ఈ మధ్య కాలంలో చాల వరకు సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా.. నెల రోజులకే ఓటీటీ లో అడుగుపెడుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి హరోం హర మూవీ కూడా యాడ్ అయింది. ఇక హరోం హర మూవీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ , డేట్ ఇదే అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అది కేవలం బజ్ మాత్రమే. ఇప్పుడు ఈ మూవీ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమా జులై 11 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు ఎంచక్కా ఆహాలో చూసేయండి.

ఇక హరోం హర సినిమా కథ విషయానికొస్తే.. ఆంధ్రపద్రేశ్, తమిళనాడు, కర్ణాటక బోర్డర్ లో కుప్పం అనే ప్రాంతం ఉంటుంది. ఇక ఆ ఊరిలో తిమ్మారెడ్డి, అతడి తమ్ముడు బసవ, కొడుకు శరత్ రెడ్డి లదే పెత్తనం. ఊరిలో ప్రజలందరికి కూడా వారంటే చాలా భయం. సరిగ్గా అదే సమయంలో ఆ ఊరిలోకి సుధీర్ బాబు వస్తాడు. అతను అక్కడ ఓ కాలేజ్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఓ రోజు శరత్ రెడ్డి మనిషితో సుధీర్ బాబుకు గొడవ అవుతుంది. దీనితో అతను కాలేజ్ నుంచి సస్పెండ్ అవుతాడు. అతనితో పాటు తన ఫ్రెండ్ కానిస్టేబుల్ పళని స్వామి కూడా సస్పెండ్ అవుతాడు. అయితే అతని దగ్గర ఓ గన్ ఉంటుంది. దానితో పాటు ఓ బ్లు ప్రింట్ కూడా ఉంటుంది. ఇక సుధీర్ తన తెలివితేటలతో ఓ గన్ ను కూడా తయారు చేస్తాడు. అలాగే ఉద్యోగం పోడానికి కారణం అయినా శరత్ రెడ్డితో కూడా చేతులు కలుపుతాడు. అసలు కథ ఏంటి ! సుధీర్ కు ఆ ఊరికి ఉన్న సంబంధం ఏంటి ! సుధీర్ బాబు ఆ ఊరికి ఎందుకు వెళ్తాడు?ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments