Swetha
Garudan OTT: ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి కొత్త సినిమాలు రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో కోట్లు కొల్లగొట్టిన ఓ మూవీ ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతుందని టాక్. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
Garudan OTT: ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి కొత్త సినిమాలు రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో కోట్లు కొల్లగొట్టిన ఓ మూవీ ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతుందని టాక్. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
Swetha
ఇప్పుడు దాదాపు అన్ని భాషల చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు కాబట్టి.. తెలుగు తమిళం అనే తేడా లేకుండా ఓటీటీ లో వచ్చిన సినిమాలను వచ్చినట్లు చూసేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఓ తమిళ సినిమా గురించే. తమిళంలో పాపులర్ కమెడియన్స్ అయినా.. సూరి, శశికుమార్, ఉన్న ముకుందన్ లాంటి నటి నటులంతా కలిసి నటించిన సినిమా “గరుడన్”. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సెంథిల్ కుమార్ డైరెక్ట్ చేశారు. మే 31 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ఓటీటీ గురించి ప్రస్తుతం బజ్ బాగా నడుస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందనే విషయాలను చూసేద్దాం.
గరుడన్ అనే ఈ సినిమాను.. సుమారు 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించగా.. 30 కోట్ల గ్రాస్ ను రాబట్టాలనే టార్గెట్ తో ఈ సినిమా మే 31 న థియేటర్స్ లో అడుగుపెట్టగా.. ఊహించని కలెక్షన్స్ ను రాబట్టింది. సినిమా విడుదలైన మొదటి షో నుంచే.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది ఈ మూవీ. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి.. 45 కోట్ల గ్రాస్, 40 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. అటు ఓవర్సీస్ లో కూడా.. ఈ సినిమా రికార్డు వసూళ్లను క్రియేట్ చేసింది. మొత్తంగా చూసినట్లయితే ఈ సినిమా సుమారుగా 55 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో బాగా బజ్ నడుస్తుంది. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
ఇక సాధారణంగా ఏ సినిమా అయినా కూడా .. థియేటర్ లో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీ లోకి రావాలి. కానీ, ఇప్పుడు దాదాపు నెల రోజులు కూడా గడవకముందే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా కూడా సడెన్ గా ఓటీటీ లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే చిత్ర బృందం మాత్రం.. జూలై 12 వ తేదీన ఓటీటీ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. గరుడన్ సినిమా ఓటీటీ రైట్స్ ను దక్కించుకునేందుకు.. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ సంస్థలు పోటీ పడుతున్నట్లుగా సమాచారం. మరి ఈ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు వస్తుంది అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి గరుడన్ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.