Best Suspense Thriller In OTT: ఆ రోడ్డుపై వరుస యాక్సిడెంట్స్! త్రిష కెరీర్ లో బెస్ట్ మూవీ! OTTలో ఉంది!

OTT Movie Suggestion - Best Suspense Thriller : కొన్ని మంచి సినిమాలు ఓటీటీ లో ఉన్నాయని ఎవరో ఒకరు సజ్జెస్ట్ చేసేవరకు తెలియదు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా మీరు మిస్ చేసిన సినిమాలలో ఉందేమో ఓ లుక్ వేసేయండి.

OTT Movie Suggestion - Best Suspense Thriller : కొన్ని మంచి సినిమాలు ఓటీటీ లో ఉన్నాయని ఎవరో ఒకరు సజ్జెస్ట్ చేసేవరకు తెలియదు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా మీరు మిస్ చేసిన సినిమాలలో ఉందేమో ఓ లుక్ వేసేయండి.

ఓటీటీ లో చాలా సినిమాలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలను ప్రేక్షకులు మిస్ చేసే అవకాశం ఉంది. అటువంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. ఇక కొన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఓటీటీ లో ఉన్నాయని.. ఎవరో ఒకరు సజ్జెష్ చేసేవరకు తెలియదు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.. ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కావాలంటే మాత్రం ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందే. పైగా ఇందులో మెయిన్ లీడ్ చేసిన యాక్టర్ అందరికి బాగానే పరిచయం. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథేంటంటే.. మీరా అనే ఓ మహిళ తన కొడుకు బర్త్ డే కోసం.. కొడైకెనాల్ ట్రిప్ ప్లాన్ చేస్తుంది. కానీ ఆ సమయంలో మీరా ప్రెగ్నెంట్ గా ఉండడంతో.. డాక్టర్ లాంగ్ డ్రైవ్స్ కు వెళ్లకూడదని సలహా ఇస్తారు. దీనితో చివరి నిమిషంలో మీరా.. డ్రాప్ అయిపోతుంది. కేవలం తన భర్త , కొడుకు మాత్రమే ఆ ట్రిప్ కు వెళ్తారు. అయితే అనుకోకుండా దారిలో ఆ కారు యాక్సిడెంట్ కు గురి అవుతుంది. ఆ ప్రమాదంలో వారిద్దరూ మరణిస్తారు. దీనితో అందరిలానే మొదట్లో మీరా కూడా తన కొడుకు, భర్త రోడ్ యాక్సిడెంట్ లోనే చనిపోయి ఉంటారని అనుకుంటుంది. కానీ అది ప్రమాదం కాదని, మర్డర్ అని మీరాకు ఆ తర్వాత తెలుస్తుంది. తన భర్త, కొడుకు చనిపోయిన ప్లేస్ లోనే తరచూ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని మీరా అన్వేషణలో తెలుస్తుంది. అసలు ఆ ప్రదేశంలో యాక్సిడెంట్స్ జరగడానికి గల కారణం ఏంటి ? దాని వెనుక ఎవరున్నారు ? ఇవి హత్యల లేక ప్రమాదాల ? ఈ విషయాలను మీరా ఎలా కనిపెడుతుంది? ఇవన్నీ తెలియాలంటే “ది రోడ్ ” అనే ఈ సినిమాను చూడాల్సిందే.

ఇందులో మెయిన్ లీడ్ లో నటించింది మరెవరో కాదు. హీరోయిన్ త్రిష. ది రోడ్ అనేది ఓ తమిళ సినిమా. ఓ విధంగా ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పి తీరాలి. ఈ సినిమాకు అరుణ్ వ‌సీగ‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. రెగ్యులర్ స్టోరీలా అనిపించినా కూడా.. త్రిష ఈ కేస్ ను ఎలా సాల్వ్ చేసింది అనే ప్లాట్ కోసమైనా ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments